క్రియాయోగులు-3

క్రియాయోగులు-3

 


(గత సంచిక తరువాయి)


మహావతార్‌ బాబాజీ


ఎవరా మహావతార్‌ బాబాజీ ? ఎలా అగస్త్యుల అనుగ్రహం పొందారు? వారు ఎలా ప్రసిద్ధులయ్యారు? అనే విషయాలను తెలుసుకుందాం.

మహావతార్‌ బాబాజీ

అది దక్షిణ భారతదేశంలో పోతంగీ పర్వత ప్రాంతం. కుర్తాళం తీరంలో దట్టమైన అరణ్యం. కుర్తాళం అనేది 64 శక్తి పీఠాలలో శక్తిమంతమైనది. అది ఆదిపరాశక్తి మూలస్థానం. ఆ సమీపంలో 14 ఏళ్ల వయసున్న ఓ బాలుడున్నాడు. అతన్ని చూస్తే ధ్రువుడా, ఝటావల్కధారా?, బాలకుమారస్వామా?, సిద్ధేంద్రుడా? అనిపిస్తుంది. ఆ తోజోమయుడు భయంకర అరణ్యంలో ఏకాంతంగా ఉన్నాడు. శరీరం, మనస్సు, చిత్తం, బుద్ధి, ఆత్మ అన్నిటినీ ఏకోన్ముఖం చేసి ధ్యానం చేస్తున్నాడు. మహానుభావుడు, సకల విజ్ఞానవేత్త, దేవర్షి, అగస్త్య మునీంద్రుల దర్శన అనుగ్రహం, ఉపదేశం ధ్యేయంగా కఠోరదీక్ష చేస్తున్నాడు ఆ బాలకుడు. క్రిమికీటకాలు పెట్టే బాధల్ని కూడా అతను పట్టించుకోవడం లేదు. 
  అటువైపు అరుదుగా వచ్చే సాధువులు, యాత్రికులు ఈ బాలుడిని దర్శించి అతని తపోదీక్షకు మెచ్చి ఆహారం, పానీయం అందించేవారు. అగస్త్యులవారు పురాణ పురుషుడు. నిజంగా తనకు దర్శనం ఇస్తాడా? అనే సంచయం ఆ బాలకుడికి ఉంది. అయినా బలవంతంగా మనస్సును లగ్నంచేసి దీక్ష సాగించేవాడు. చిన్నప్పటినుంచి తాను అభ్యసించిన వేదజ్ఞానం, శాస్త్రజ్ఞానం, యోగజ్ఞానం, తనకు కలిగిన పాండిత్య ప్రకర్షతో పొందిన గౌరవాలు గుర్తుకు వచ్చినా అహం చేరనివ్వకుండా చుట్టూ ఉన్న ధూళితో పోల్చుకునేవాడు. ఆ ధూళికన్న తాను గొప్పవాడా?, సముద్రంలా అంతులేని శాస్త్రఖనిలో తాను పొందింది ఎంత? అణుమాత్రమే కదా! అని అనుకునేవాడు. ధ్యేయం నెరవేరాలి... స్వామి దర్శనం కావాలి అనే దీక్షతో సాధన కొనసాగించాడు. ఒక ఆశయం నెరవేరాలంటే అలాంటి పట్టుదలే కావాలి. 
  వేళకు తిండి, నిద్ర లేక శరీరం బలహీనమైంది. తన కోరిక నెరవేరక చనిపోతే మాత్రం ఏంటి ? నెరవేరని ధ్యేయంతో జీవించడం కన్నా మరణమే మేలు. చివర క్షణం వరకు ఆ పట్టు వీడను, వెనుకాడను ఆ స్వామి ప్రత్యక్షం కావాలి లేదా తాను మరణించాలి... అంతే అనుకున్నాడు ఆ బాలకుడు.
  ఆ పరమాత్మ అధీనంలో ధ్యానం నలభై రోజులు గడిచింది. మనం ఏ పని చేయాలనుకున్నా ఒక మండలం... అంటే 40 రోజులు పూర్తి కావాలి. ఆ 40 సంఖ్య పరమార్థం ఏమిటి? ''నక్షత్రాలు 27, అభిజిత్తు1, మొత్తం ఇరువది ఎనిమిది (28)'' రాసులు 12 కలిపితే మొత్తం 40. ఈ నక్షత్రాలకు, రాసులకు, మన జీవితానికి ఏదో అనుబంధం ఉంది. ఏ ఆటంకాలు కల్గినా అధికంగా మూడు రోజులు, 43 రోజులు దీక్ష, ఔషధ సేవనానికైనా, మంత్ర పఠనానికైనా దైవానుగ్రహ ప్రదక్షణాలకైనా, భూత అరిష్ట నివారణకైనా ఆ మండల దీక్ష మూడో రోజులు పాటించాలి. అలానే ఆ బాలుని దీక్షకూ, మండలం గడిచింది. పైన మూడోరోజు జరుగుతోంది. దాదాపు శరీరం శక్తి కోల్పోయింది. ప్రాణం కడపట్టింది. ఇక స్మృతికోల్పోయేలా ఉంది.

ఓ అగస్య్త మునీంద్రాయ నమః


  అదే మంత్రం, అదే జపం, అదే ధ్యానం, తైలధారలా ఆగని ఆ తపః ఫలం, ఇక ఏ క్షణమో అంతిమం అన్నట్లుంది. అయినా దీక్ష వీడలేదు. పట్టుదల సడలలేదు. భక్తి తరగలేదు. అగస్త్యమహాముని కరుణారసవరుణుడయ్యాడు మిత్రావరుణుడు. ఆ బాలుడి భక్తి కి మెచ్చి పరవశించి, ఆ క్షణమే తక్షణమే, ఆ మహారణ్యం వీడి బాలుని తేజస్సు, తపోదీక్ష తనకు దర్శనం కావాలనే పట్టుదలకు ముగ్ధుడయ్యాడు. 
  ''బాలకా! లే నీ దీక్షకు మెచ్చాను... వచ్చాను నీ ఎదుటనే నిలిచాను'' అని కరుణతో తొణికిసలాడు మృదువచనంతో పిలిచాడు. మెల్లగా కళ్లు తెరిచాడు బాలుడు. తన ఎదుట సాక్షాత్తు ఆ భగవాన్‌ ఋషి అగస్య్తమునీంద్రుడు. తను ఎవరి అనుగ్రహం కోరి ఇన్నాళ్ళు తపస్సు చేశాడో, ఆ మూర్తి తన ఎదుట నిలువగా, ఆనందపరవశుడై నోట మాట రాలేదు. అగస్త్యుడు ఆ బాలుడిని చేతులతో పట్టిలేపి హృదయానికి హత్తుకొన్నాడు. దయతో పల్కులతో సేద తీర్చాడు. ఆహారం

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: