2019 12-9 Pavan కాలండర్ *పితృ దోషములు*


2019  12-9 Pavan కాలండర్ *పితృ దోషములు*

*పితృ దోషములు*

పంచమ స్థానంలో రవి తన మీద రాశిలో శని అంశతో ఉండి, అతని ముందు వెనకా పాపగ్రహాల ఉంటే పితృ శాపంవల్ల సంతానానికి హాని కలుగుతుంది.

పుత్ర స్థానంలో సూర్యుడు ఉండి క్రూర గ్రహాలు మధ్యలో త్రికోణం లో పాపగ్రహ నుండి పాపగ్రహాల దృష్టిలో ఉంటె పితృ శాపంవల్ల సంతానానికి హాని కలుగుతుంది.

సూర్యుని రాశిలో గురువు ఉండి  పంచమాధిపతి రవితో కలిసి ఉండి, పంచమ, లగ్నాల్లో పాపగ్రహం ఉంటె పితృ శాపంవల్ల సంతాన హాని కలుగుతుంది.

లగ్నాధిపతి దుర్భలుడే పంచమ భావం లో ఉండి,పంచమాదిపతి రవితో కలిసి ఉండి,పంచమ ,లగ్న భావాలలో పాప గ్రహం ఉంటే పితృ శాపంవల్ల సంతానానికి హాని కలుగుతుంది.

దశమాధిపతి పంచమభావంలో  ఉండి పంచమాధిపతి  తో లగ్న పంచమ భావాలలో పాపగ్రహం ఉంటె పితృ శాపంవల్ల సంతానానికి హాని కలుగుతుంది.

కుజుడు పితృ  స్థానాధిపతిగా పంచమాధిపతి తో కలిసి ఉండి లగ్న పంచమ దశమ భావాలలో పాపగ్రహాలు ఉంటే పితృ శాపం వల్ల సంతానానికి హాని కలుగుతుంది.

పితృ స్థానాధిపతి:- అంటే,దశమాధిపతి 6,7,12- వీటిలో స్థానంలో నైనా  ఉండి కారక గ్రహం గురువు పాపరాశిలో వుండి, పంచమాధిపతి, లగ్నాధిపతి పాపయుతులూ ఉంటే  పితృశాపం వల్ల తంతాన క్షతి కలుగుతుంది.

లగ్న, పంచమ భావాల్లో రవి, కుజుడు,శని ఉండి,8,12 స్థానా   ల్లో రాహువు, గురువు ఉండి, లగ్నంలో పాపగ్రహం ఉంటే పితృశాపం వల్ల సంతానహాని కలుగుతుంది.

లగ్నంలో అష్టమ రవి ఉండి,  పంచమం లో శని ఉండి, పంచమధి పతికి రాహువుతో యతి ఉండి, లగ్నంలో పాపగ్రహం జీవించి ఉంటే పితృశాపం వల్ల సంతానహాని కలుగుతుంది.
  
                 మీ
బోర్పట్ల భాస్కరాచార్య సిద్ధాంతి:
ఫోన్:9866997520

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12