ధర్మాచరణ, ధర్మ ప్రచారం, ధర్మ రక్షణ, దేశరక్షణ
*నేను సౌదీ అరేబియా లో ఉన్నపుడు.*
*ఒక సౌదీ employee నా దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు: "భారత దేశంలో ఇంకా 80% హిందువులు ఎలా ఉన్నారు?*
*"నేను" అన్నాను " మీరు అడగదలుచుకున్నది ఏమిటి?*
*ఆ సౌదీ వ్యక్తి ఈ విధంగా చెప్పాడు:-*
*"రియాద్" లో మా ఇస్లామిక్ విశ్వవిద్యాలయం లో జరిగిన పరిశోధనలో"* *ఎక్కడ ఇస్లాం ప్రవేశిస్తే ఆ దేశం 100% ఇస్లామిక్ దేశంగా మారిపోతుంది అని తెలుసుకున్నాను.*
*ఉదా:-* *ఇరాన్ ఒక జొరాస్ట్రియన్ ( ఇది ఒక మతం) దేశం, కాని ఇస్లామిక్ దండయాత్ర జరిగిన తరువాత అక్కడ జనాభ మొత్తం 100% ఇస్లాం లోకి మారిపోయారు, కేవలం 17 సంవత్సరాలలో ఇరాక్ కూడా ఇస్లామిక్ దేశం గా మారిపోయింది.*
*21 సంవత్సరాలలో ఈజిప్ట్ కూడా ఇస్లామిక్ దేశంగా మారిపోయింది.*
*అలాగే క్రైస్తవ మతం కూడా ఐరోపాలో 50 సంవత్సరాలలో వ్యాపించింది.*
*కాని భారత దేశం మాత్రం 800 సంవత్సరాలు ముస్లిం పాలనలో, 200 సంవత్సరాలు బ్రిటీషు(క్రైస్తవ) పాలనలో ఉంది.* *కాని ఇంకా భారత దేశం లో 80% హిందువులు ఎలా ఉన్నారు???*
*నా సమాధానం:-* *మా దేశం పై దండ యాత్ర చేసిన విదేశీయులతో ఎన్నో యుధ్ధాలలో ఓడిపోయి ఉండొచ్చు. కానీ మా పూర్వీకులు పోరాటాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. వారి తుది శ్వాస వరకు పొరాటం చేశారు. అందుకే ఈ దేశంలో సనాతన ధర్మం ఇంకా మిగిలి ఉంది.*
*నిర్విరామంగా మన పూర్వీకులు దాదాపు 2000 సంవత్సరాలకు పైగా ధర్మం కోసం యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఎంతో దారుణమైన, కష్టమైన పరిస్థితులను ఎదురుకుని నిలిచారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. ఎందుకోసం? ఎవరి కోసం? మనం ఇవాళ హిందువులుగా జన్మించగలిగాము అంటే అది వారి బిక్షయే... ఇంత గొప్ప సంస్కృతికి వారసులము కాగలిగాము. వాళ్ళ శ్రమ, త్యాగాలు వృధా కాకూడదు. ఈ ధర్మాన్ని రక్షించి, మన తర్వాతి తరాలకు అందించడం మినహా మరే ఇతర విధంగానూ మనం వారి ఋణం తీర్చుకోలేము. ధర్మాచరణ, ధర్మ ప్రచారం, ధర్మ రక్షణ, దేశరక్షణ మన తక్షణ కర్తవ్యాలు. అవే మన తాతముత్తాలకు, పితృదేవతలకు ఇచ్చే పెద్ద గౌరవం.*
Comments
Post a Comment