Pavan. 12-3. 2019 ఫలితాలు రాజకీయం

రాజకీయం

ఇపుడు మనం అమృతతుల్యమైన అధికారం కోసం ఎందరితో జతకడితే మాత్రం తప్పేంటి?
ఈ కాలంలో అధికారం కోసం ఏం చేసినా ఆక్షేపణీయం కాదు.

కాలోచితంగా స్ట్రేటజీ మార్చనివాడు పాలిటిక్స్‌లో షైన్‌ కాజాలడు.

ఒంటరిగా ఓటమిని భరించడం కంటే నలుగురితో పంచుకోవడం తేలిక.

అవినీతి పాలన, కుటుంబ పాలన, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు –

ఈ కలయికలు, పొత్తులు అన్నీ యుగాలుగా ఉన్నవే.

***

అచ్చమైన నేత

ముందస్తు ఎన్నికలు రావడం వేరు, నాయకుడే కోరి తెప్పించుకోవడం వేరు. దీనికి తెగువ, తెగింపు కావాలి. అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధపడాలి. తెలంగాణ ముఖ్యమంత్రిది నిజంగానే గొప్ప సాహసం... కాదంటే ఆత్మ విశ్వాసం. సర్వే రిపోర్ట్‌లన్నీ ‘సరిలేరు నీకెవ్వరూ’ అని ముక్త కంఠంతో చెప్పాయనీ, కనుక కేసీఆర్‌ ఈ రద్దుని దుస్సాహసంగా భావించడం లేదనీ దగ్గరివారను కుంటున్నారు.

తిరిగి మళ్లీ అంతా వాళ్లే. ఎమ్‌ఐఎమ్‌ వాళ్ల పేర్లు కూడా అవే వుండచ్చు. సేమ్‌ గవర్నర్‌! ప్రజలకి అసలేం తేడా పడదు.

కేసీఆర్‌ ఉద్యమంలోంచి ఉద్భవించిన నేతగా జ్ఞాని కనుకనే సీట్ల గురించిన కసరత్తులు చేయకుండా ఒక్క నిమిషంలో తేల్చి పడేశాడు. ఆయనకి స్పష్టంగా తెలుసు, ఎవరైనా ఒకటేనని!

సాహసాన్ని ప్రదర్శించి ప్రత్యర్థుల్ని చెదరగొట్టడం ఒక స్ట్రాటజీ’ .  సామాన్యంగా రాష్ట్రంలో అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఎన్నికలు వస్తే బావుండని అధికార పార్టీ ఆశిస్తుంది. ఈ సీజన్‌లో వర్షాలుపడి రిజర్వాయర్ల నిండి ఊరి చెరువుల దాకా నీళ్లతో తొణికిసలాడుతున్నాయి. లా అండ్‌ ఆర్డర్‌ సమస్య, కరెంటు కోతలు లాంటి ఈతి బాధలు లేకుండా ఉంటే – సామాన్య పౌరుడు అంతా సజావుగానే ఉందనుకుంటాడు.

విశాల దృక్పథంతో జనం ఉంటారు.

అవతలివైపు ఏమైనా అద్భుతమైన ప్లస్‌ పాయింట్లు వచ్చి చేరాయా అంటే అదేం లేదు.  కొత్త ఆలోచనలు లేవు. కొత్త ప్రాజెక్టులు లేవు. కొత్త రైల్వేలైను, నాలుగు పెద్ద కర్మాగారాలు లేవు అందుకని కేసీఆర్‌ తన సీట్లో తాను కాళ్లూపుకుంటూ నిశ్చింతగానే కూర్చుని కనిపి స్తున్నారు.

ప్రత్యక్షంగా పరోక్షంగా అయిదారు లక్షల కోట్లు ముఖ్యమంత్రి చేతులమీదుగా చెలామణీలోకి పోతుంది, వెళ్తుంది.  ఎన్ని అవకతవకల్ని, అవినీతుల్ని శుద్ధి చేసి పక్కన పెట్టగలరో! అందుకే రాజకీయం చాలా గొప్పది. కేసీఆర్‌ అటు ఢిల్లీ అధికార పక్షంతో కూడా అన్ని విషయాలు మాట్లాడుకుని ఈ పనికి పూనుకున్నారని అంతా అనుకుంటున్నారు. ఇందులో పెద్ద అర్థంగాని వ్యూహమేమీ లేదు.

ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు అయిపోతే, పార్ల మెంటుకి స్థిమితంగా ఉంటారు. అప్పుడు కొంచెం బీజేపీకి చేసాయం, మాటసాయం చెయ్యచ్చు. అప్పుడు బీజేపీతో కలిసి వెళ్లినా ఆక్షేపణ ఉండదు. ఉన్నా పెద్ద పట్టింపు లేదు. కాసేపు సెక్యులరిజాన్ని ఫాంహౌజ్‌లో పెట్టి కథ నడిపించవచ్చు. అప్పుడది నల్లేరు మీద బండి నడక అవుతుంది. ‘జీవితంలో తన ఉన్నతికి చేదోడుగా ఉన్న ఎందరినో సందర్భో చితంగా మర్చిపోతూ వెళితేగానీ ఒక నేతగా నిలబడ లేడని’ సూక్తి. కల్వకుంట్ల చంద్రశేఖర రావు అచ్చ మైన నేత.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: