Posts

Showing posts from November, 2018

Pavan 12-4. 2019. శ్రీ వికారి నామ సంవత్సర ఫలములు.

1. శ్రీ వికారి నామ సంవత్సర ఫలములు. ఈ సంవత్సరము రాజు, సేనాధిపతి, అర్ఘాధిపతి శని. మంత్రి  - రవి. సస్యాధిపతి, నీరసాధిపతి - కుజుడు.  ధాన్యాధిపతి, మేఘాధిపతి - చంద్రుడు. రసాధిపతి - శుక్రుడు. దేశమునందు ఆర్ధిక సంక్షోభము, అస్థిరత, ఏర్పడును.  జలప్రళయముల వలన ఆస్థి,  పసువులు, పంటలు,  నష్టపోయిన రైతులకు ఆదరణ కరువగును. అనేకమంది ప్రాణములు కోల్పోవుదురు. ఇతర దేశాలతో మైత్రీసంబంధాలవలన, సహాయసహకారాలు అందును. వర్షములు సమృద్ధిగా కురిసి పంటలు బాగాపండును. రక్షణ రంగము, దేశ సరిహద్దులందు సైన్యము,  అత్యంత సమర్ధవంతంగా పనిచేయును.  పుణ్యక్షేత్రములు భక్తుల ఆహ్లాదాన్ని పెంచే సేవలు కార్యక్రమాలు శోభాయమానంగా నిర్వహిస్తుండటంతో భక్తులు, భక్తిప్రపత్తులతో  తన్మయత్వం చెందుతూ,  పరవశులవుతారు. నిరుద్యోగులకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువగును. అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా కొనసాగును. ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకుచేరవు. ప్రజలకు గ్యాస్, విద్యుత్తు సరఫరా మెరుగు పడి ధరలు తగ్గును. డీజిల్, పెట్రోల్ ధరలు అదుపు లేకుండా పెరుతూ, ప్రజలపై భారము పెరుగుతూనే వుంటుంది. ప్రాచీన క్రీడలైన కరాటే, కుస్తీ, కబాడీ, ఆటలయెడలత్య్ర ప్రజాదరణ, క్