Pavan 12-4. 2019. శ్రీ వికారి నామ సంవత్సర ఫలములు.

1. శ్రీ వికారి నామ సంవత్సర ఫలములు.

ఈ సంవత్సరము రాజు, సేనాధిపతి, అర్ఘాధిపతి శని. మంత్రి  - రవి. సస్యాధిపతి, నీరసాధిపతి - కుజుడు.  ధాన్యాధిపతి, మేఘాధిపతి - చంద్రుడు. రసాధిపతి - శుక్రుడు.

దేశమునందు ఆర్ధిక సంక్షోభము, అస్థిరత,
ఏర్పడును.  జలప్రళయముల వలన ఆస్థి,  పసువులు, పంటలు,  నష్టపోయిన రైతులకు ఆదరణ కరువగును. అనేకమంది ప్రాణములు కోల్పోవుదురు. ఇతర దేశాలతో మైత్రీసంబంధాలవలన, సహాయసహకారాలు అందును. వర్షములు సమృద్ధిగా కురిసి పంటలు బాగాపండును.

రక్షణ రంగము, దేశ సరిహద్దులందు సైన్యము,  అత్యంత సమర్ధవంతంగా పనిచేయును.  పుణ్యక్షేత్రములు భక్తుల ఆహ్లాదాన్ని పెంచే సేవలు కార్యక్రమాలు శోభాయమానంగా
నిర్వహిస్తుండటంతో భక్తులు, భక్తిప్రపత్తులతో  తన్మయత్వం చెందుతూ,  పరవశులవుతారు. నిరుద్యోగులకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువగును. అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా కొనసాగును. ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకుచేరవు. ప్రజలకు గ్యాస్, విద్యుత్తు సరఫరా మెరుగు పడి ధరలు తగ్గును. డీజిల్, పెట్రోల్ ధరలు అదుపు లేకుండా పెరుతూ, ప్రజలపై భారము పెరుగుతూనే వుంటుంది.

ప్రాచీన క్రీడలైన కరాటే, కుస్తీ, కబాడీ, ఆటలయెడలత్య్ర ప్రజాదరణ, క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. పసిడి ధరలు రోజు రోజుకి పెరుగుతున్నా, బంగారు ఆభరణాల అలంకరించుకోవడానికి వస్త్రాలంకరణకు ఆడవారు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చెదరు.
గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు అభివృద్ధి పధంలో మార్గదర్శకంగా నిలుస్తాయి.
తెలంగాణ ప్రజలు అనందంగా జీవిస్తారు.
జమ్మూకాశ్మీర్ లో ప్రశాంత  పరిస్థితి ఏర్పడుతంది.
అమెరికా, స్వీడన్, స్విట్జర్లాండ్, ధక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలు అభివృద్ధి పథంలో ముందంటాయి. మన దేశం నుండి ఉన్నతవిద్య, ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ అనేక మంది మేథావులు ఆదేశాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ  విరుద్ధ రాజకీయ భావజాలాలున్న పార్టీలు ఏర్పడతాయి. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లోకి అనేక కొత్త పార్టీలు ఏర్పాటు అవుతాయి. పార్టీ  జెండా, అజెండా సిద్ధాంతాలు
సర్వేజనాస్సుఖినోభవంతు - ప్రజలందరకూ ఆ సర్వే స్వరుడు శుభములు చేకూర్చుగాక.

2. మౌఢ్యం, కర్తరి.

ది.4-5-2019 రా 2.41 ని౹౹కు రవి భరణీ నక్షత్రం
3 వ పాదం లోనికి ప్రవేశించును గాన చిన్న (డొల్లు)
కర్తరి ప్రారంభమగును. తిరిగి 11-5-2019 రా. 11.59 ని౹౹కు కృత్తిక నక్షత్రం లోనికి ప్రవేశించుచున్నందు వలన పెద్ద కర్తరి ప్రారంభమగును.

ది. 29-5-2019 ఉ. 7.37 ని౹౹కు రోహిణి నక్షత్రం 3 వ పాదం లోనికి ప్రవేశించుచున్నందున కర్తరి సమాప్తమగును.

1. శుక్ర మౌఢ్యమి

ది.12-07-2019  ఆషాఢ శుద్ధ ఏకాదశీ శుక్రవారం నుండి 28-9-2019 భాద్రపద బహూళ చవితి బుధవారం వరకు శుక్ర మౌఢ్యమి వుండును.

2. గురు మౌఢ్యమి

ది.13-12-2019 మార్గశిర బహుళ పాఢ్యమి  శుక్రవారం నుండి 12-01-2020 పుష్య బహుళ విదియ ఆదవారం వరకు గురు మౌఢ్యమి వుండును.

*ఇదావత్సర

పంచవత్సరాత్మక యుగమునుసరించి "వికారి" నామ సంవత్సరమునకు ఇదావత్సర మందురు.
విష్ణువు అధిపతి. ఉప్పు దానమిచ్చనచో శుభములు కలుగును.

బ్రహ్మ పుత్రానదీ పుష్కరములు.

ఈ సంవత్సరము కార్తీక శుద్ద అష్టమీ సోమవారం అనగా ది. 04-11-2019 తె. 4.29 ని౹౹లకు దేవగురువు బృహస్పతి ధనుస్సు రాశిలోనికి ప్రవేశించును. కావున బ్రహ్మ పుత్రానదీ పుష్కరములు జరుగును. తెల్లవారుఝామున ప్రవేశించుటచే నవంబర్ 5 నుండి 16 వ తారీఖు వరకు 12 రోజులు పుష్కరములు జరుగును.

ఈ పుష్కర సమయములో  పుణ్యస్నానాలు, చనిపోయిన పెద్దలకు పిండప్రదాన, గోదానాది దానములు చేయుట వలన వంశాభివృద్ధి, అనేక జన్మలలో చేసిన పాపములు నాశనమగును.

పుష్కరములు జరుగు ప్రదేశములు.
అస్సాం రాష్ట్రములో గౌహతి నగరమునందు
బ్రహ్మ పుత్రానది వున్నది. అరుణాచల్
ప్రదేశ్ రాష్ట్రములో బ్రహ్మ పుత్రానది వున్నది.

వచ్చే శార్వరీ నామ సంవత్సరములో తుంగభద్రా
పుష్కరములు. ది. 20-11-2020 మ.13.37 ని౹౹లకు  గురుడు మకర రాశిలోనికి ప్రవేశించును. కావున 20-11-2020 నుండి 1-12-2020 వరకూ
12 రోజులు పుష్కరములు జరుగును.

7.గ్రహణములు

భారత దేశములో కనిపించే గ్రహణములు రెండు మాత్రమే. చంద్ర సూర్య గ్రహణములు.

1.  పాక్షిక చంద్రగ్రహణము.
ఈ గ్రహణము పాక్షికముగా ఏర్పడును.
ది. 16-7-2019 ఆషాఢ శుద్ద పూర్ణిమ మంగళవారం
పూర్వాషాఢ నక్షత్రములో వచ్చుచున్నది.

గ్రహణ సమయాలు - వివిధ దశలు.
ఈ గ్రహణము పాక్షికముగా ఏర్పడును.
స్పర్శకాలం.          రా. 1.30
మధ్యకాలం.
(పూర్ణిమాంతము) రా. 3.00
మోక్షకాలం.            రా. 4.39
గ్రహణకాలము.  గం.2.59 ని౹౹లు.
రాత్రి గ్రహణమైనందున నియమములను పాటీంచనవసరములేదు.

2. సూర్యగ్రహణము.

ఈ గ్రహణము
ది. 26-12-2019 మార్గశిర బహుళ అమావాస్యా  గురువారము
మూలా నక్షత్రములో వచ్చుచున్నది.

గ్రహణ సమయాలు - వివిధ దశలు.
ఈ గ్రహణము పాక్షికముగా ఏర్పడును.
స్పర్శకాలం.                ఉ. 8.01
మధ్యకాలం.
(అమావాస్యాంతము) ప. 10.43
మోక్షకాలం.                 ప. 11.20
గ్రహణకాలము.  గం.3.19 ని౹౹లు.

ఆబ్దీకాదులు ప.11.30 తరువాత చేసుకొనవచ్చును.

గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో మృత్యుంజయ మహా మంత్రము చదువుకొనినయెడల కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యముగా వుండును. గర్భిణీ స్త్రీలు 5 వ నెల నుంచి 9 వ నెలవరకు మాత్రమే గ్రహణ నియమములను పాటించవలెను.

***
వార, నక్షత్ర, తిధులు కలిసిన విశేషదినములు.
ఏప్రి. 6,10,13,18.
మే.    7,11,16,23,29.
జూన్. 7,12,14,16,22,28.
జూలై. 4,9,13,19,25.
ఆగ.    5,9,24.
సెప్టె.     1,5,17,21,26.
అక్టో.      3,9,15,21,26.
నవం.     4,14,21,23.
డిశం.      4,11,12,15,19.
జన.        8,12,16,20,27.
ఫిబ్ర.        1,7,8,13,16,
మార్చి.  2,7,11,21.

విశేష యోఢమైన రోజులు.
గురుపుష్య
జున్. 6. రా. 8.29 నుండి తె. 5.32.
జూలై. 4. ఉ. 5.38 నుండి రా. 2.31.
ఆగ.    1.5.46 నుండి ప. 12.12.

మంగళపుష్య

సెఫ్ట. 24. ఉ. 10.30.నుండి తె. 5.55.
అక్టో. 22. ఉ. 6.01 నుండి  సా.4.36.

ఈ రోజులలో ముఖ్యమైన శుభకార్యాలు చేసుకొనవచ్చును్

*సూర్యసంక్రమణ పుణ్యకాలమందు పితృదేవతలకు
పిండప్రదానములు, తర్పణములు, చేసినఛో వంశాభివృద్ధి కలుగను. దానధల్మములను ఆచరించుట శుభప్రదము. కోటిరెట్లు అధిక ఫలము ప్రాప్తించును.

*హనుమంతుడు రుద్రాంశలో జన్మించినందున కుజ, శని గ్రహాల దోష నివారణ జరుగుటకు హనుమ ఆరాధన అత్యంత ప్రాధాన్యం. రామదూతగా కుజగ్రహ దోషమును, వాయుపుత్రుడుగా శనిఢ్రహ దోషమును నివారిస్తాడు. శని దేవుడు హనుమంతుని మిత్రుడుగా పురాణగాధ ఉన్నది.

*కందాయ ఫలములలో ఒకొక్క సంఖ్య 4 మాసములకు ఫలములను సూచిస్తుంది.
చైత్రము నుండి ఆషాఢము వరకు మొదటి సంఖ్య.
శ్రావణము నుండి కార్తీకము వరకు రెండవ సంఖ్య.
మార్గశిరము నుండి ఫాల్గుణము వరకు మూడవ సంఖ్యను కందాయ ఫలముగా చూసుకొనవచ్చును.
ఇందు బేసి సంఖ్యలు ధనలాభములు. సరి సంఖ్యలు సమలాభమును సూచించును.
మొదటి సున్న వ్యాధిని, రెండవ సున్న భయమును, మూడవ సున్న ఋణమును సూచిఃచును. మూడు సున్నాలే వచ్చిన యెడల సంవత్సరమంతయూ కష్టజీవనము కొనసాగుతుంది.

*ఈ సమయములు గ్రహగతులు, ఇతరవిషయములను దృష్టిలో ఉంచుకొని ఇవ్వబడుతున్నాయి. పాఠకులు గమనించగలరు.

* శ్రావణ మాసము2-8-2019 నుండీ 30-8-2019 -
ఈ మాస మంతయూశుక్ర మూఢమి కలదు.
*భాద్రపదం 31-8-2019 నుండి 28-9-219
ఈ మాస మంతయూశుక్ర మూఢమి, సూన్య మాసము.
*పుష్య మాసము 27-12-2019 నుండి 24-12820.

ఈ మాస మంతయూ
గురు మూఢమి మరియూ సగభాగం సూన్యమాసము.

* పేరు ప్రఖ్యాతులు రావాలంటే జాతక చక్రంలో  చంద్ర గ్రహమునకు లగ్నము నకు, సంబంధం ఉండాలి.  గురుదృష్టి వుండాలి.

ఉ౹౹. రాముడు, కృష్ణుడు, రామకృష్ణ పరమహంస వంటి దేవతలు, గురువుల జాతకములందు లగ్నమునకు చంద్ర గురు గ్రహముల సంబంధములు కనపడతాయి.

*జతక చక్రములో గురువు స్థతి తిరోగమనంలో ఉంటే జాతకులు మంచి వక్తలు, ఉపాధ్యాయులుగా
రాణిస్తారు.

*సూర్య మండలం, సూర్యునిపై ఆధారపడిన ఇతర గోళముల నుంచి వెలువడుచున్న తరంగ రూప  శక్తులు వాటివలన ప్రకృతిలో పర్యవరణలో మానవులలో ఏర్పడే మార్పులు ఏ విధంగా ప్రభావాన్ని కలిగిస్తుందో తెలియచేసేదే జ్యోతిష్యం.

అంతరిక్షంలో నక్షత్రములు వివిధ గ్రహాల నుండి వెలువడే కిరణాలు  భూమిపై ప్రసరించి జీవజాలముపైనా, మానవులపై (మానవ మస్తిష్కములోని నాడులపై) ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ తరంగాల ప్రభావం మానవుని ఆలోచన, మాట, నడత మరియు చేసే పనుల రూపంములో ప్రతిబింబిస్తుంది.

అంతరిక్షం నుండి వెలువడు వివిధ రకాల శక్తి తరంగాలు మానవ దేహం నుండి వెలువడే శక్తి తరంగాలతో కలిసి అనుకూల ప్రభావాన్ని కలిగించగల ఖచ్ఛితమైన సమయాన్నే 'ముహూర్తం' అంటారు.
సూర్య బలం: జన్మరాశ్యాది సూర్యుడున్న రాశి  వరకు ఎంచగా 3,6,10,11.స్థానములందు సూర్యుడు శుభుడు. 2,2,4,5,7,8,9,12 స్థానములందున్న సూర్యుడు అశుభుడు.

చంద్ర బలం: జన్మరాశ్యాది చంద్రుడున్న రాశి  వరకు ఎంచగా 1,3,6,7,10,11. స్థానములందు చంద్రుడు ఉభయ పక్షములలో శుభుడు.శుక్లమందు 2,5,9.స్థానములందు, కృష్ణపక్షమందు 4,8,12.  స్థానములందున్న సూర్యుడు శుభుడు.

గురు బలం: జన్మరాశ్యాది గురువున్న రాశి  వరకు ఎంచగా 2 ,5,7,9,11. స్థానములందున్న గురువు శుభుడు. 1,3,4,6,8,10,12 స్థానములందున్న

గురుడు శుభుడు

రాజకీయలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులు,

అల్పపీడనాల వలన ఎడాతెరిపి లేని భారీ వర్షాలు వల్ల అనేక ప్రాంతలు అత్యధిక జలపాతం వలన  జలమయం అగుట,
గట్టి వర్షాలు లేకపోవడంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి బోర్లు, బావులు, కుంటలు ఎండిపోవడం, ఎండ ఎక్కువగా వుండటంతో పంటలు ఎండిపోయి
రైతుల నష్టపోతున్నారు.

ఈశాన్య రుతుపవనాలు,  నైరుతీరుతుపవనాలు,
జున్-సెప్టెంబరు
ఆసించిన వర్షాలు కురిపించక పోవడంతో,
రెండు రుతుపవనాలు అంతంత మాత్రంగా ప్రభావం చూపడంతో.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: