20-21 C1 కామాక్షి చంద్రశేఖర స్వామి కాలండర్ గరుడపురాణం
గరుడపురాణం
తప్పు దాగదు లెక్క తప్పదు!
న్నే...నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా...ఏం చేసినా ఫర్వాలేదులే అనుకుంటే కుదరదు...ప్రతి పనికీ ఓ లెక్క ఉంటుంది... దానికి ఫలితం ఉంటుంది...ఎందుకంటే మనిషి సంఘజీవి. అందరితో, అన్ని ప్రాణులతో సహజీవనం సాగించాలి. ఈ క్రమంలో నియమబద్ధమైన జీవితమే సదా అనుసరణీయం... అలా జీవించడాన్నే క్రమశిక్షణ అంటాం. ఆ గీతను దాటడమే అనేక సమస్యలకు మూలకారణం. అలా చేయడం అనేకమంది జీవితాలకు శాపం అవుతుంది. దాన్నే పాపం అంటారు. అలా ఈ లోకంలో చేసే పాపాలకు పరలోకంలో శిక్షలుంటాయని దాదాపు అన్ని ధర్మశాస్త్రాలూ చెబుతాయి. ఇక్కడ మనిషి చేసే పొరపాట్లేంటి...దానికి యమలోకంలో ఎలాంటి శిక్షలు విధిస్తారనే విషయాన్ని గరుడ పురాణం చర్చిస్తుంది. ఈ పురాణం మరణం తర్వాత శిక్షల గురించి వివరించినా... పరోక్షంగా క్రమశిక్షణను ఉద్బోధిస్తుంది. నైతికతను, సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది. సంఘ జీవిగా నువ్వేం చేయాలో, ఎలా జీవించాలో వివరిస్తుంది. అందుకే అది జీవన వికాస పురాణంగా భావించవచ్చు.
గరుడ పురాణం చెప్పేదిదే...
గరుడ పురాణం చదవవచ్చా?
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోకూడదని... చదవ కూడదని ప్రచారం లో ఉంది. ఇది కేవలం అపోహమాత్రమే. సంక్రాంతి, అమావాస్య, పౌర్ణమి, గరుడ పంచమి, పితృదేవతల పుణ్య తిథుల్లో ఈ పురాణాన్ని చదవాలని శాస్త్రవచనం. ఇది ఒక విజ్ఞాన సర్వస్వం అని గుర్తు పెట్టుకుని దాన్ని అధ్యయనం చేసి అందులోని తప్పులు చేయకుండా సక్రమమైన మార్గంలో జీవిస్తే జీవితం సుఖమయం అవుతుంది. సమాజం వర్ధిల్లుతుంది.
నమ్మించి మోసం చేసేవారికి
వింభుజ నరకంలో శిక్ష ఉంటుంది. ఇక్కడ తల్లకిందులుగా వేలాడదీసి క్రూర జంతువులకు వదిలేస్తారు
అలా చేస్తే... ఇలా జరుగుతుంది...
పరస్పర విశ్వాసం వల్లనే మనిషి మనుగడ, సమాజ మనుగడ సాగుతుంది. అయితే అనేక కారణాల వల్ల అది సన్నగిల్లుతోంది. చివరకు విశ్వాసఘాతుకానికి కారణమవుతోంది. నమ్మినవారిని మోసగించడం, ఆశపెట్టి మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం, ఆహారంలో విషం పెట్టి సంహరించడం వంటివి విశ్వాసఘాతుకమైన చర్యలు. ఇవన్నీ పాప కార్యాలు... మనసును అదుపులో ఉంచుకోవడం, మంచి ఆలోచనలు చేయడం, భగవంతుడిపై భక్తి పెంచుకోవడం మనిషిలో విశ్వాసగుణాన్ని పెరిగేలా చేస్తాయి.
ఇతరులను మాటలతో హింసించేవారికి, దుర్భాషలాడేవారికి
శీతమనే శిక్ష విధిస్తారు. అంటే అత్యంత చల్లగా ఉండే చీకటి కూపంలోకి విసిరేస్తారు.
మాటే మంత్రం... లేదంటే నరకం...
కఠినమైన మాటలతో ఇతరులను హింసించడం అత్యంత పాపకార్యమని నిర్వంచించింది గరుడ పురాణం. హిత భాషణం, వినయ భాషణం... అంటే మంచిగా మాట్లాడడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మంచి మాటలతో ఎవరినైనా ఆకర్షించవచ్చు. ఎలాంటి పనులైనా సాధించవచ్చు. ఇతరులను ప్రోత్సహించేలా సానుకూలమైన మాటలు చెప్పాలి. ఇతరులు కష్టాల్లో ఉంటే వారిని తక్కువగా మాట్లాడడం కూడా హింసిచడమే. అది శిక్షకు కారణమవుతుంది.
చుట్టు పక్కల చూడరా... చిన్నవాడా...
భూమిని చరాచర జీవరాశులు జీవించేందుకు అనువుగా సృష్టించాడు భగవంతుడు. జీవులన్నీ పరస్పరం ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అలాంటి ప్రకృతిని రక్షించుకోడమంటే భగవంతుని సేవించుకోవడమే. చెట్లను నరకడం, ఇళ్లను కూల్చడం, చెరువులు పూడ్చడం, దేవాలయాలు కూల్చడం వంటివి ప్రకృతికి నష్టాన్ని కలిగించే అంశాలు శిక్షార్హమైనవి.
ప్రకృతికి నష్టం చేసి, ఇతర జీవుల మనుగడను దుర్భరం చేస్తే
యమపురి దక్షిణ ద్వారం దగ్గర ఉన్న వైతరణి నదిలో పడేస్తారు. తర్వాత దాని తీరంలో ఉన్న బూరుగు చెట్టుకు కట్టేసి కొడతారు.
- ఐ.ఎల్.ఎన్.చంద్రశేఖర్
వినయమే భూషణం
వినయం జ్ఞాన లక్షణం. దాన్ని అలవర్చుకుంటే అహంకారం తొలగిపోతుంది. సీతాన్వేషణకు లంకకు బయల్దేరిన హనుమంతుడు సీతాదేవితో వానర సైన్యంలో నాకంటే శక్తివంతులు, బలవంతులైన వానరులే ఉన్నారు. అని అన్నాడు. మహాబలశాలి అయిఉండీ తనను తాను తగ్గించుకుని మాట్లాడుతున్న హనుమంతుని అప్పుడే జ్ఞానిగా గుర్తించింది... సమాదరించింది సీతామాత. డబ్బు, బలం ఎక్కువగా ఉన్నాయని ఇతరులను అవమానించడం పాప కార్యమని గరుడ పురాణం చెబుతుంది.
అహంకారంతో అందరినీ చిన్నచూపు చూసినవారికి
సూచీముఖి అనే నరకంలో శిక్ష ఉంటుంది. అక్కడ సూక్ష్మ శరీరాన్ని సూదులతో గుచ్చి హింసిస్తారు.
ధర్మ ధిక్కారానికి
మహాజ్వాల అనే నరకంలో శిక్ష ఉంటుంది. పెద్దగా మండుతూ ఉన్న అగ్ని జ్వాలల్లో వేస్తారు.
ధర్మమే రక్షిస్తుంది...
ధర్మో రక్షతి రక్షితః అంటారు. ప్రజల జీవితాన్ని క్రమ పద్ధతిలో పెట్టే ధర్మాలను ధ్వంసం చేయడం అత్యంత పాపకార్యం. ధర్మాన్ని సదా అనుసరించాలి. అధర్మాన్ని ప్రోత్సహిస్తే శిక్ష తప్పదు.
భావోద్వేగాలు అదుపులో ఉన్నాయా?
మనిషి ప్రవర్తనకు ప్రధాన కారణం అతనిలో కలిగే భావావేశాల పరంపర. ఆవేశం, కోపం వంటి గుణాలు మనిషిలోని విచక్షణను నశింపజేస్తాయి. ఆలోచనలు రాకుండా చేస్తాయి. అలాంటి ఆవేశమే హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతుంది. క్షణికావేశం కలిగినప్పుడు నిభాయించుకోగలిగితే అనేక అనర్థాలకు అడ్డుకట్టవేయవచ్చు. విచక్షణ వల్లనే బ్రహ్మహత్య, గోహత్య, శిశుహత్య, స్త్రీ హత్య వంటి అత్యంత పాపకార్యాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి భావోద్వేగాలు అదుపులోపెట్టుకోవాలి. అది సాధనతో చేకూరుతుంది.
హత్య చేసిన వారికి
తప్తకుంభ నరకంలో శిక్ష ఉంటుంది. పెద్ద బానల్లో నూనె, ఇనుప రజను వేసి అవి సలసలా కాగుతున్నప్పుడు అందులో వేయిస్తారు.
పరుల సొమ్ము పామే...
మనిషి ఆశాజీవి. కానీ హద్దుల్లేని ఆశ అనర్ధాలకు కారణమవుతుంది. మనిషిలోని విచక్షణను చంపేస్తుంది. తప్పు చేయించేందుకు కూడా వెనకాడదు. ఇతరుల ఆస్తి, సొమ్మును ఆశించేలా చేయడంతో పాటు అపహరణ వంటి పనులు కూడా చేయిస్తుంది. పర స్త్రీ, ఇతరుల ధనం కోసం ఆశ పడడం శిక్షార్హమని చెబుతుంది గరుడ పురాణం.
ఇతరుల ఆస్తిపాస్తులు కాజేసిన, సొమ్ము అపహరించిన వారికి
తమిశ్రం అనే శిక్ష ఉంటుంది. కాలపాశంతో కట్టేసి జీవుడి స్క్ష్మూ శరీరం నుంచి రక్తం కారేలా యమభటులు కొడతారు.
అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. పురాణాలన్నీ రచించిన వ్యాసమహర్షే దీన్ని కూడా రచించారు. ధర్మ, కర్మ, పాపాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని తన వాహనమైన గరుత్మంతుడి కోరిక మేరకు శ్రీమహావిష్ణువు బోధించాడు కాబట్టి దీనికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది. నైమిశారణ్యంలో శౌనకాది మునులకు సూత మహాముని దీనిని కూడా వివరించాడు. ఇందులో మొత్తం 18 వేల శ్లోకాలున్నాయి. పురాణాల్లో సాత్త్విక, రాజస, తామస అనే మూడురకాలు ఉంటాయి. గరుడ పురాణం సాత్విక పురాణం. ఇందులో పూర్వఖండం, ఉత్తరఖండం అనే రెండు భాగాలు ఉంటాయి. పూర్వఖండంలో విష్ణువును ఎలా ఆరాధించాలి, తులసీ మాహాత్మ్యం, ఏకాదశి వ్రతవిధానం, నామ మహిమ, సదాచార విధానం మొదలైన అంశాలు ఉంటాయి. ఉత్తరఖండాన్ని ప్రేతకల్పం అంటారు. ఇందులో మరణించిన తర్వాత మనిషి పొందే అవస్థలు, యమలోకంలో మనిషికి విధించే శిక్షలు మొదలైన వివరాలు ఉంటాయి
గరుడ పురాణం ప్రకారం మరికొన్ని శిక్షలు ఉన్నాయి. ఇక్కడ ఏ పాపం చేసిన వారికి ఆ నరకంలో శిక్ష అమలవుతుంది. వీటన్నిటినీ సూక్ష్మశరీరంతో జీవుడు అనుభవించాల్సి ఉంటుందని ఈ పురాణం చెబుతుంది.
*కల్తీ వంటి తప్పులకు పాల్పడేవారికి కుంభీపాకం అనే శిక్ష విధిస్తారు. అందులో సలసల కాగే నూనెలో పడేస్తారు
* వేదాల్ని ధిక్కరించిన వారికి కాలసూత్ర నరకం ప్రాప్తిస్తుంది. ఇందులో జీవుడి సూక్ష్మశరీరాన్ని కత్తులతో కోస్తారు. కొరడాలతో బాదుతారు
* అతిథులకు భోజనం పెట్టనివారికి, వారిని సమాదరించని వారికి క్రిమి భోజనం అనే నరక శిక్ష ఉంటుంది. క్రిములతో నిండిన కుండల్లో పాపిని పడేస్తారు
* శుచి, ఆచారం పాటించనివారిని పూయోద అనేక నరకంలో శిక్ష విధిస్తారు. ఇందులో మలమూత్రాలు నిండిన సముద్రంలో పడేస్తారు
* అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవారిని పర్వతశిఖరాల నుంచి కిందకు పడేస్తారు. దీన్ని అవీచిమీంత నరకం అంటారు.
* ఇతర ప్రాణులను హింసించే ఉగ్రస్వభావం కలిగినవారికి దండసూకర నరకంలో శిక్ష ఉంటుంది. ఇక్కడ పాములు ఎలుకల్ని హింసించినట్లు హింసిస్తారు
* గ్రామాలకు కీడు చేసేవారిని వజ్రాల వంటి కోరలు ఉన్న జాగిలాల చేత కరిపిస్తారు. దీన్ని సారమేయోదన నరకం అని అంటారు.
* జూద వ్యసనపరులకు రౌరవ నరకం తప్పదని గరుడ పురాణం చెబుతుంది. ఇక్కడ పాపిని జంతువులతో కరిపిస్తారు.
* గదుల్లో, నూతుల్లో ఇతరులను బంధించేవారిని విషపు పొగలు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. దీన్ని అవధ నిరోధక నరకం అంటారు.
Tags :
మరిన్ని
తప్పు దాగదు లెక్క తప్పదు!
నిన్నే...నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా...ఏం చేసినా ఫర్వాలేదులే అనుకుంటే కుదరదు...ప్రతి పనికీ ఓ లెక్క ఉంటుంది... దానికి ఫలితం ఉంటుంది...ఎందుకంటే మనిషి సంఘజీవి. అందరితో, అన్ని ప్రాణులతో సహజీవనం సాగించాలి. ఈ క్రమంలో నియమబద్ధమైన జీవితమే సదా అనుసరణీయం... అలా జీవించడాన్నే క్రమశిక్షణ అంటాం. ఆ గీతను దాటడమే అనేక సమస్యలకు మూలకారణం....
కాముని జయించి రంగులు పూయించి
హోలీ... రంగుల పండగ... ఉగాదికి కాస్తముందు... వసంతం ఆగమించిన శుభవేళ... రకరకాల వర్ణాలను వెదజల్లుకుంటూ సంబరాలు చేసుకోవడం ఆనవాయితీ... అంతేనా... ఈ పండగ మనిషిలోని వికారాలను దూరం చేసుకోమంటుంది... కల్మషాలను కడిగేయమంటుంది... అంతరంగాన్ని వర్ణశోభితం చేసుకోమంటుంది.. ఈ అద్భుతమైన పర్వదినానికి నేపథ్యంగా వివరించే కథలు అదే విషయాన్ని చెబుతాయి...
ధర్మమేవ జయతే!
అసలీ సృష్టి అంతా ఎలా నిలువగలుగుతుంది?నిరంతరం తిరుగుతూ ఉండే గ్రహాలు ఏమాత్రం ఆగకుండా అలా పరిభ్రమిస్తూనే ఎలా ఉండగలుగుతున్నాయి? అనే ప్రశ్నలకు సూటిగా దొరికే సమాధానం ధర్మమే వాటికి ఆధారం అని. ఆసరాగా ఉన్న వస్తువు బలహీనపడితే ఇక దానిపై ఆధారపడినవన్నీ ఎక్కడివక్కడ కిందపడిపోతాయి. చెల్లాచెదురవుతాయి.....
పరిపూర్ణతకు స్త్రీకారం
కరుణతో లాలించినా...కర్తవ్య దీక్షతో పాలించినా...తల్లిగా దీవించినా...ధర్మపత్నిగా నడిపించినా...ఆమెకు ఆమే సాటి...అందుకే సృష్టిమొత్తం ఆమె కనుసన్నల్లోనే నడుస్తోంది.విశ్వమంతా వ్యాపించి, నిర్వహించే పరమ చైతన్యాన్ని స్త్రీ శక్తిగా, జగదాంబగా కొలుచుకునే సంప్రదాయం మనది. అడుగడుగునా ఆమెకు నీరాజనాలు పట్టే సంస్కృతి మనది....
భజే విశ్వనాదం
మార్చి 4 మహా శివరాత్రి ధీ అంటే బుద్ధి... యానం అంటే ప్రయాణం...బుద్ధితో కలిసి ప్రయాణించడమే ధ్యానం. తుమ్మెదలు తమ చుట్టూ తిరిగే కీటకాలన్నిటికీ తమ లక్షణాన్నే ఆపాదిస్తాయి. దాన్నే భ్రమరకీటన్యాయం అంటారు. శివభక్తి కూడా అలాంటిదే... బుద్ధిని శివుడిలో నిలిపి ధ్యానం చేసేవాడు సాక్షాత్తు శివుడే అవుతాడని చెబుతారు పెద్దలు.....
భ్రమరమై తల్లి ప్రణవమై తండ్రి
శ్రీశైలం మహాక్షేత్రం. స్వయం శక్తి సమన్వితం. ఇక్కడ ఉద్భవించే శక్తి నలుదిక్కులకూ వెదజల్లుతుందని మహర్షులు దర్శించారు. స్కాంద పురాణంలోని శ్రీపర్వత ఖండం శ్రీశైలాన్ని అష్టదళపద్మం అని వర్ణించింది. అంటే ఎనిమిది రేకలున్న పద్మం అని అర్థం. ఎనిమిది దళాలు ద్వారాలు, ఉపద్వారాలుగా, పద్మానికి మధ్యలో ఉన్న కర్ణిక శ్రీశైలంగా భావిస్తారు....
ప్రేమ...ఎంత మధురం?
నిజమైన ప్రేమ శారీరక వాంఛలకు, కోరికలకు భిన్నమైంది. దాని కోసం మనుషులు ఉదాత్త చరితులుగా మారతారు. త్యాగజీవులుగా మిగులుతారు. ప్రేమలో ఉన్నప్పుడు మనసంతా వసంతరుతువులా ఉంటుంది. ఫలితంగా కనిపిస్తున్నదంతా ప్రేమతో చూడడం అలవాటవుతుంది. ఇది ఆధ్యాత్మికతలో ఓ అత్యున్నత స్థితి. యోగికమైన దృక్పథమది. తనకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసే హృదయ వైశాల్యాన్ని ప్రేమ మనిషికి ఇస్తుంది. ద్వేషాన్ని, కసిని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. ఈ ప్రేమ ప్రియురాలికో, ప్రియుడికో పరిమితం కాదు. అది ఆధ్యాత్మికతలోకి పర్యవసించినప్పుడు ఈ ప్రపంచం అంతటిపై మమకారం వ్యక్తమవుతుంది. దానికి ఉదాహరణ బుద్ధుడు. నిజానికి రుషులంతా ప్రపంచంపై వివిధ రూపాల్లో ప్రేమను వ్యక్తం చేసినవాళ్లే....
వీణాపాణి వేద వాణి!
ఆమె అక్షరం... ఆమె అక్షయం... ఆమె గీర్వాణి... ఆమె సకల శాస్త్రాలకూ రారాణి ఆమె జ్ఞానం.. ఆమె సర్వవిద్యలకూ మూలం... వాల్మీకి నోట ఆది కావ్యాన్ని పలికించిన తల్లి ఆమె. వ్యాసభగవానుడి చేత ఆపార సాహిత్యాన్ని రాయించిందీ ఆ తల్లే. యాజ్ఞవల్క్యుడు, ఆదిశంకరులు, ఆదిశేషువు, బృహస్పతి అందరూ ఆమె అనుగ్రహంతోనే అనంతమైన జ్ఞానాన్ని వరప్రసాదంగా అందుకున్నారు.
వస్తే వెళ్లని వసంతం!
సంపూర్ణ భక్తికి, సంపూర్ణ వైరాగ్యానికి సంపూర్ణ తత్త్వ వివేచనకు నిలువెత్తు నిదర్శనం ఆయన... ‘నేనే రాముడు... నేనే కృష్ణుడు...’ అని తన అంతిమ ఘడియల్లో అనిర్వచనీయమైన రీతిలో ప్రకటించిన ధీశాలి ఆయన... అయిదు వేల సంవత్సరాల భారతీయ ఆధ్యాత్మిక సంపద, సాధనలు మూర్తీభవిస్తే అది ఆయన వ్యక్తిత్వమవుతుంది.
శివా నమామి... సదాస్మరామి
మన భారతీయ సంస్కృతిలోనే కాదు మానవ మనుగడలోనే అమ్మతనానికి ఎంతో విలువ ఉంది. అందుకే అత్యున్నత ప్రేమను అందించే దేన్నైనా తల్లి హృదయంతో పోల్చుతారు. అలాంటి తల్లి హృదయం పురుషుడికి కూడా ఉంటుంది. ‘‘ ...యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా.. నమస్తస్యై, నమస్తస్యై నమస్తస్యై నమోనమః’’ ఏ అమ్మవారైతే సర్వ భూత(జీవుల) హృదయాలలో మాతృరూపంలో ఉందో ఆ దేవికి మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను.
తెలుసుకున్నారా... కాల గమనం!
ఈ పుస్తకం ఎలా ఉందంటే చెప్పగలం... కంప్యూటర్ ఎలా ఉంటుందంటే చూపగలం... ఆ భవనం ఇలా ఉంటుందనీ వివరించగలం.. మరి రేపు... ఎలా ఉంటుంది? గత ఏడాది ఏమైపోయింది? ఈ రోజు ఎక్కడ కలిసి పోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరూ చెప్పలేదు. ఎక్కడా వివరించలేదు. ఎందుకంటే అదొక్కటే అనంత శక్తి సంపన్నం కాబట్టి ఆ కాలానికంటే ముందు పరుగెత్తుకెళ్లి అదెక్కడికెళుతుందో తెలుసుకోవడం మాత్రం సాధ్యంకావడం లేదు. అదో అనంత వాహిని. ఎక్కడ పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో అంతుచిక్కని...
గురువై ఇలలో జ్ఞానమై మనలో
త్యజించడం దత్తం... జయించడం దత్తం... మనస్సును దేదీప్యమానం చేయడం దత్తం... సాక్షాత్తు దైవం గురువుగా మారితే, మానవుడికి ముక్తి మార్గాన్ని చూపితే... జ్ఞాన దీపాలు వెలుగుతాయి, చిమ్మ చీకట్లు తొలగుతాయి... దత్తుడి అవతరణ, కార్యాచరణ ...
మనదే పాశురాస్త్రం
తనువు, మాట, మనసు... అన్నిట్లోనూ నువ్వే నిండిపోవాలి. నన్ను నేను మర్చిపోవాలి. చివరకు నీలో ఐక్యం చెందాలి. ఇంతకన్నా నాకు మరే కోరికా లేదు స్వామీ... అంటూ పరిపూర్ణమైన భక్తిని ప్రకటిస్తుంది గోదాదేవి తన తిరుప్పావై పాశురాల్లో.
నీరాజనం
ఆమె కరుణాంతరంగ... శ్రీవారి హృదయాంతరంగ... తన బిడ్డలకు వరాలిచ్చేందుకు ఆమె ఏడు కొండలూ దిగివచ్చారు... అల్లంత దూరంలో ఉండి వారి కోరికలను తన పతిదేవుడికి నివేదిస్తున్నారు... అంత ప్రేమ చూపుతారు కాబట్టే ఆమె దేవదేవుడి గుండెల్లో నిక్షిప్తమయ్యారు...
అగ్ని రూపం నిశ్చల దీపం
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అగ్ని లింగేశ్వరుడుగా ఆదిదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ‘స్మరణాత్ అరుణాచలే’ అంటారు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం...
అగ్ని రూపం నిశ్చల దీపం
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అగ్ని లింగేశ్వరుడుగా ఆదిదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ‘స్మరణాత్ అరుణాచలే’ అంటారు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం...
శివకేశవులను కీర్తించె
కార్తికం హరిహరాత్మకం. శివకేశవులిద్దరికీ ప్రీతికరం... ఆధ్యాత్మిక సాధనకు అద్భుత సమయం... అందుకే కార్త్తికాన్ని మించిన మాసం లేదు... నకార్తీక సమో మాసః అని స్కాంద పురాణం చెబుతోంది... పూజల్లో శివకేశవులకు సమాన ప్రాధాన్యం దక్కే మాసమిది. ఈ కాలంలో మహావిష్ణువుకు కార్త్తిక ...
ఆ వెలుగు నీదే!
దీపావళి వెలుగులు మనిషిని నిర్వచించాలి. మనిషిలోని రాక్షస ప్రవృత్తికి నిదర్శనమైన నరకాసురుని వధించినప్పుడు అది దీపావళి. దురహంకారానికి ప్రతీక అయిన బలి తలను పాతాళానికి అణచి వేసినప్పుడు... అజ్ఞానం మటుమాయమై జ్ఞానం విరజిమ్మినప్పుడు వెలుగుల పండగ ఆవిష్కృతమైంది. అధర్మంపై ధర్మం...
శరత్ చంద్రికలు
ఏడాదిలో వచ్చే ఆరు రుతువుల్లోనూ వసంత, శరదృతువులు చాలా ప్రధానమైనవి. ఇవి ఆయా కాలాల్లో వచ్చే ప్రాకృతిక మార్పుల్ని సూచిస్తూ, అందుకు అనుగుణంగా మనిషి తన జీవనగమనాన్ని తీర్చిదిద్దుకునేందుకు అవసరమైన సంకేతాలను ఇస్తాయి. వీటిలో వసంత రుతువు సుమ వికాసం కలిగిస్తే, శరదృతువు సోమ వికాసం కలిగిస్తుంది. సోముడు అంటే చంద్రుడు..
మంచికి మణిద్వీపం
సృష్టి నియమాలకు వ్యతిరేకమైన స్వార్థం కావచ్చు... అహంకారం కావచ్చు... మనసులోని మాలిన్యాలు కావచ్చు... చెడు మీద మంచికి యుద్ధం అనివార్యం. వాటి మధ్య జరిగే సంఘర్షణలో చివరకు మంచి గెలిచి తీరుతుంది. అందుకు ప్రతీక విజయదశమి.
జిల్లా వార్తలు
ఏ జిల్లా ఆదిలాబాద్భద్రాద్రి హైదరాబాద్జగిత్యాల జనగామ జయశంకర్ జోగులాంబ కామారెడ్డి కరీంనగర్ఖమ్మంకుమ్రం భీంమహబూబాబాద్ మహబూబ్ నగర్మంచిర్యాల మెదక్ములుగునాగర్ కర్నూల్ నల్గొండనారాయణపేటనిర్మల్ నిజామాబాద్పెద్దపల్లి రాజన్నసంగారెడ్డి సిద్దిపేటసూర్యాపేటవికారాబాద్వనపర్తివరంగల్ రూరల్వరంగల్ అర్బన్ యాదాద్రి అమరావతిఅనంతపురంచిత్తూరుతూర్పు గోదావరిగుంటూరుకడపకృష్ణకర్నూలుశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుప్రకాశంశ్రీకాకుళంవిశాఖపట్నంవిజయనగరంపశ్చిమ గోదావరి కర్ణాటక ఒడిశా తమిళనాడు
వారెవ్వా!చదువుసుఖీభవఈ-నాడుమకరందంరయ్.. రయ్సిరివిజేతఈ తరంహాయ్!ఆహాహాయ్ బుజ్జీస్థిరాస్తిరుచులువిహారి
దేవతార్చన
సాయి సందేశం ‘సబ్‌కా మాలిక్ ఏక్’
సబ్‌కా మాలిక్ ఏక్ అన్న సందేశంతో యావత్ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్ మందిరం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా షిర్డిలో వుంది. ఫకీర్ అవతారంలోఅనేక మహిమలు ప్రదర్శించిన సాయినాధుడు ఇప్పటికీ సమాధి నుంచే భక్తులకు అభయమిస్తాడని అసంఖ్యాక సాయి భక్తుల...
మెంతి తెప్లా
గోధుమ పిండి: 2 కప్పులు, మెంతికూర తురుము: ముప్పావుకప్పు, పచ్చిమిర్చి ముద్ద: టీస్పూను, వెల్లుల్లి ముద్ద: 2..
బనానా పూరీ
అరటిపండ్లు: రెండు, పంచదార: 4 టేబుల్‌స్పూన్లు, జీలకర్రపొడి: అరటీస్పూను...
+
© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Comments
Post a Comment