2019ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ ఫలితాల వెల్లడి
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ ఫలితాల వెల్లడి
అంబుజా సిమెంట్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, కెన్ ఫిన్ హోమ్స్, టీవీఎస్ మోటార్ కంపెనీలు గత ఆర్థిక సంవత్సర(2018–19) చివరి త్రైమాసిక ఫలితాలను మంగళవారం (30న) ప్రకటించనున్నాయి. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలైన బ్రిటానియా (బుధవారం), డాబర్ (గురు), హిందూస్తాన్ యూనిలివర్ (శుక్ర) ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక ఇదేవారంలో రిజల్స్ ప్రకటించనున్న ఇతర ప్రధాన కంపెనీల్లో.. టాటా కెమికల్స్, టాటా పవర్, ఫెడరల్ బ్యాంక్, గోద్రేజ్ ప్రాపర్టీస్, అజంతా ఫార్మా, ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనా¯Œ్స, రేమండ్, బంధన్ బ్యాంక్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. ఈ ఫలితాలు మార్కెట్ ట్రెండ్‌కు అత్యంత కీలకంకానున్నాయని ఎడెల్వీజ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ అన్నారు.
కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ
భారత్ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారీగా పెట్టుబడులు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్ 1–26 కాలంలోనూ రూ.17,219 కోట్లను పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది.
Comments
Post a Comment