2019 ఫలితాల దెబ్బ : పతనం
హీరో’ లాభం 25 శాతం డౌన్
78 లక్షల వాహన విక్రయాలు..
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,697 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం తగ్గి రూ.3,385 కోట్లకు చేరింది. ఆదాయం మాత్రం రూ.32,872 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.33,651 కోట్లకు పెరిగింది. వాహన విక్రయాలు రూ.75.87 లక్షల నుంచి 78.20 లక్షలకు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, రికార్డు విక్రయాలు సాధించామని ముంజల్ వ్యాఖ్యానించారు. మార్కెట్లో ఇబ్బందులున్నా, అగ్రస్థానాన్ని కొనసాగించామన్నారు.
కష్టాలు కొనసాగుతాయ్.....
దేశీయ మార్కెట్లో సమీప భవిష్యత్తులో కష్టాలు కొనసాగుతాయని ముంజల్ పేర్కొన్నారు. పండుగల సీజన్‌లో అమ్మకాలు పుంజుకుంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ప్రమాణాలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని, ఈ నిబంధనలు పాటించే బైక్‌లను, స్కూటర్లను అంతకంటే ముందే మార్కెట్లోకి తెస్తామని తెలిపారు. అయితే బీఎస్ సిక్స్ నిబంధనలు కఠినంగా ఉన్నాయని, ఈ నిబంధనల కారణంగా వాహన పరిశ్రమకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా సమస్యాత్మకమేనని పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటాయన్న అంచనాలతో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 0.5 శాతం నష్టంతో రూ.2,604 వద్ద ముగిసింది
పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ లాభం 88 శాతం డౌన్
పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ నికర లాభం (కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 88 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) నాలుగో క్వార్టర్‌లో రూ.3,944 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం అదే క్వార్టర్‌లో రూ.456 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. అనుబంధ సంస్థల విలీనం కారణంగా రూ.3,569 కోట్ల పన్ను వాయిదా ప్రయోజనం లభించడంతో అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి బాగా ప్రయోజనం లభించింది. గత ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.28 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కంపెనీ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,991 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.3,680 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. నికర లాభం భారీగా తగ్గడంతో బీఎస్‌ఈలో పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ షేర్ 5.7 శాతం తగ్గి రూ.2,410 వద్ద ముగిసింది.
ఫలితాల దెబ్బ : ఎస్‌బ్యాంకు షేరు పతనం
ప్రయివేటు రంగ బ్యాంకు ఎస్ బ్యాంకునకు ఫలితాల సెగ భారీగా తాకింది. మార్చి30తో ముగిసిన గత ఏడాది నాలుగవ త్రైమాసిక ఫలితాలు ప్రకటనతో ఎస్ బ్యాంకు కౌంటర్లో అమ్మకాల వెల్లువెత్తింది. దీంతో ఏకంగా షేరు 30శాతం కుప్పకూలింది. 2005 తర్వాత ఎస్ బ్యాంక్ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి.
బ్యాడ్‌లోన్ల బెడదతో త్రైమాసికంలో 1506 కోట్ల రూపాయలను నికర నష్టాలను చవి చూసింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఆదాయం 16.29శాతం పుంజుకుని రూ. 2505 కోట్లు సాధించింది. ప్రొవిజన్లు 9 రెట్లు ఎగబాకి రూ.3661 కోట్లగా ఉన్నాయి. గత ఏడాది ఇదే క్వార్టర్లో ఇది రూ.399 కోట్లు మాత్రమే.
క్షీణించిన మారుతి లాభాలు
దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా క్యూ4 ఫలితాల్లో నిరాశపర్చింది. విశ్లేషకులు అంచనావేసినట్టుగా మార్చి 30తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో 5శాతం (4.6 శాతం)పడిపోయాయి. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 0.7 శాతం క్షీణించాయి.
ఈ త్రైమాసికంలో నికర లాభం రూ .1,795.6 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో రూ .1,882.1 కోట్లు.స్టాండలోన్ ఆదాయం 1 శాతం పుంచుకుని 21,459. కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో 25 శాతం తక్కువగా రూ. 2263 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. కాగా.. ఇబిటా మార్జిన్లు 14.22 శాతం నుంచి 10.55 శాతానికి బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో మారుతీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 1.8 శాతం నష్టంతో రూ. 6880 వద్ద ట్రేడవుతోంది.
ప్రతికూల విదేశీ మారక ద్రవ్యం, వస్తువుల ధరలు, లాభాలను ప్రభావితం చేశాయని ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ పేర్కొంది.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 80 రూపాయల డివిడెండ్ ను చెల్లించనుంది.
Comments
Post a Comment