2020 16 విశేషం లేని విషయాలు
గృహవైద్య రహస్యాలు - 7.
* సంపెంగ చెట్టు -
సంపెంగచెట్టు పై బెరడు కషాయమును 30ml చొప్పున తాగించుచున్న యెడల పిల్లలు పక్కలో మూత్రము పోవు వ్యాధి తగ్గును.
సంపెంగచెట్టు బెరడు, మిరియాలు కలిపినూరి శనగల వలే మాత్రలు చేసి పూటకొక మాత్ర చొప్పున ఇచ్చుచుండిన యెడల మలేరియా జ్వరం మూడుపూటల్లో హరించును .
* అవిసె చెట్టు -
అవిశె పువ్వుల కూర కాని , అవిశె కాయల కూర కాని తినుచుండిన యెడల రేజీకటివ్యాధి మూడువారాలలో కుదురును.
* బంతిచెట్టు -
బంతి ఆకులను రసము పిండి కొంచం వెచ్చచేసి చెవులలో పోయుచున్న యెడల చెవిపోటు , చెవిలొ నుంచి చీము కారుట , చెవిలోని కురుపులు హరించిపోవును .
శరీరం తెగి రక్తము కారుచున్న యెడల గాయము పైన బంతిచెట్టు ఆకు రసమును పూసిన యెడల రక్తము కారుట వెంటనే నిలిచిపోవును.
* సన్నజాజి -
సన్నజాజి ఆకులు ని నూరి ముద్ద చేసి తేనె కలిపి నాలుకకు పట్టించుచున్న యెడల నోటిపూత మూడురోజుల్లొ పోవును .
* గులాబి -
గులాబి పువ్వుల కషాయంలో తేనె కలిపి తాగుచున్న మలబద్దకం హరించును .
ఈ కషాయాన్ని సేవించుట వలన కండ్లమంటలు , గొంతు , ముక్కు ఎండిపొవుట తగ్గును.
* గానుగ చెట్టు -
గానుగ గింజలలో పప్పు, మిరియాలు సమభాగాలుగా కలిపి నూరి మాత్రలుగా చేసి పూటకు ఒక మాత్ర చొప్పున ఇచ్చుచున్న యెడల మలేరియా జ్వరం హరించును .
గానుగ గింజల పప్పు నీళ్లతో నూరి తలకు రుద్దుకొనిన యెడల తలయందలి మురికి , తలలో పేలు , కురుపులు పోవును .
* ఖర్జురము -
ఖర్జురపు గింజను పోకచెక్క మాదిరి బుగ్గన పెట్టుకుని నములుతూ రసం మింగుచున్న కడుపు ఉబ్బరం , కడుపులో బంధించిన వాయువు హరించును .
* మేడిచెట్టు -
మేడిపాలు గాయము పైన నాలుగైదు చుక్కలు వేసిన యెడల గాయములు మానిపోవును .
మేడిపండ్లు ఎండబెట్టి చూర్ణము గావించి ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు అరతులం చూర్ణం ను తిని అరకప్పు మంచినీరు తాగుచున్న యెడల స్తీలకు కలుగు తెల్లబట్ట వ్యాధి మరియు యోని దోషాలు నివారణ అగును.
* మోదుగచెట్టు -
నీళ్ల విరేచనాలు , జ్వరముతో వచ్చిన విరేచనాలు కట్టుటకు మోదుగాకుల రసం 15ml తాగించుచున్న యెడల మూడు రోజుల్లో పైన చెప్పిన సమస్యలు నివారణ అగును.
* బూరుగచెట్టు -
బూరుగు పువ్వుల రసం 40ml , ఆవుపాలు లేక మేకపాలు 40ml , పంచదార 20 గ్రాములు కలుపుకుని ప్రతినిత్యం తాగుచున్న స్త్రీలయొక్క తెల్లబట్ట , ఎర్రబట్ట వ్యాధులు హరించును .
* తిప్పతీగ -
తిప్పతీగ రసము , నువ్వులనూనె సమాన బాగాలుగా తీసుకుని కాచి ఆ తైలమును వెంట్రుకలకు పట్టిస్తున్న యెడల తెల్లవెంట్రుకలు నల్లబడును.
శిరస్సుకి చలువచేయును .ఈ నూనెని వొళ్ళంతా మర్దించుకున్న యెడల వొంటి దురదలు తగ్గును.
* కుసుమచెట్టు -
కుసుమచెట్టు పువ్వులను చూర్ణం గావించి పూటకు రెండున్నర గ్రాముల చూర్ణము చొప్పున మంచినీటి అనుపానంతో ఇచ్చుచుండిన యెడల కామెర్ల వ్యాధి మూడువారాల్లో కుదురును .
....
*✳భార్య.. భర్త కాళ్ళు ఎందుకు పట్టాలి .???*
*👉"పురుషులకు కాళ్ళ వేలినుండి*
*మోకాళ్ళ వరకు ఉన్న భాగం శనిది..*
*స్త్రీల వేళ్ళ కొనలనుండి అరచేయి*
*వరకు ఉన్న భాగం శుక్రుడిది..*
*👆కాళ్ళు పట్టడం ద్వారా శనిపై*
*శుక్రుడి ప్రభావం పడి..*
*డబ్బు, ధనప్రాప్తి కలుగుతుంది"..*
*👆E మెసేజ్ పంపిన మిత్రుడిని*
*అభినందిద్దామని ఫోన్ చేస్తే*
*హాస్పిటల్లో ఉన్నాడని తెల్సింది..*
😇😬😇🤔
...
మ " గుణింతంతో ఓ అందమైన కంద పద్యం !
.
మామా మోమౌ మామా
మామా! మి మ్మోమ్మో మామ మామా మేమా
మే మోమ్మము మి మై మే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా!!
చంద్రుని వంటి ముఖముగల దేవా! మా బుద్ధి మీకు అనుకూలించును.
గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము.
సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం. ఏకాక్షర నిఘంటువులు చూస్తే కాని ఇలాంటి పద్యాలు అర్థం కావు.
కాని చదువుతుంటే సరదాగా ఉంటాయి.
....
శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీగణపతి యాగ, సౌర యాగ, నక్షత్ర యాగ, రుద్ర యాగ సహిత త్రిశత చండీయాగం ఆ అమ్మ వారి ఆశీస్సులు,లోకానికి క్షేమం కలగాలని కోరుతూ
....
"తీక్ష్ణకామాస్తు గంధర్వాః
తీక్ష్ణకోపా భుజంగమాః
మృగాణాంచ భయం తీక్ష్ణం
తత స్తీక్ష్ణక్షుధా వయం
గంధర్వులకు కామవాంఛ ఎక్కువ. పాములకు కోపం ఎక్కువ. మృగాలకు భయం ఎక్కువ. పక్షులకు ఆకలి ఎక్కువ. మరి మానవులకో ? అదే వాల్మీకి మహర్షి కవిత్వంలో ధ్వని పైకి చెప్పడు. మానవులకు ఈ నాలుగూ ఎక్కువే.
....
➖➖➖➖➖➖➖➖➖➖
*మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు..*
➖➖➖➖➖➖➖➖➖➖
★నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు:
నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?
క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండాపోయాయా? అని ఆశ్చర్యం కలుగక మానదు.
*1.అక్షరలక్ష:*
ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం,గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.
*2.శబ్దశాస్త్రం:*
రచయిత ఖండిక ఋషి.సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.
*3.శిల్పశాస్త్రం:*
రచయిత కశ్యపముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు.గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి.ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,
మయుడు,మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.
*4.సూపశాస్త్రం:*
రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు,పిండివంటలు
,తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి,ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.
*5.మాలినీ శాస్త్రం:*
రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.
*6.ధాతుశాస్త్రం:*
రచయిత అశ్వినీకుమార.సహ
జ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.మిశ్
రలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.
*7.విషశాస్త్రం:*
రచయిత అశ్వినీకుమార.32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.
*8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం):*
రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి.సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు.ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.
*9.మల్లశాస్త్రం:*
రచయిత మల్లుడు. వ్యాయామాలు,ఆటలు,వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.
*10.రత్నపరీక్ష:* రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూ
పం,బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.
*11.మహేంద్రజాల శాస్త్రం:* సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత.నీటిపై నడవడం,గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.
*12.అర్థశాస్త్రం:*
రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో వివరించారు.
*13.శక్తితంత్రం:*
రచయిత అగస్త్యముని.ప్ర
కృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి.అణువిచ్చేదనం ఇందులోని భాగమే.
*14.సౌధామినీకళ:*
రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.
*15.మేఘశాస్త్రం:*
రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.
*16.స్థాపత్యవిద్య:*
అదర్వణవేదం లోనిది. ఇంజనీ రింగ్,ఆర్కిటెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.
ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,సామ
ుద్రిక శాస్త్రం,అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,కుమారస్వామి రచించిన గజశాస్త్రం,భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.
నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?
వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు.
......
Comments
Post a Comment