2020 17 పురుష సూక్తం
పురుష సూక్తం లో ఉన్నచాతుర్వర్నాలు ఏమి చెపుతున్నాయి
చాలా మంది హిందూ వ్యతిరేకులు పురుష సూక్తం లో ఉన్న చాతుర్వర్నాల గురించి భౌతికంగా ఆలోచించి తప్పుగా మాట్లాడుతారు ... నిజానికి అక్కడ పురుషుడు అనేది సమాజానికి ఉపమానంగా చెప్పబడింది ...ఒక సమాజం సజావుగా నడవాలి అంటే జ్ఞానం , శౌర్యం ,ఆర్ధిక పరిపుష్టి , ఎటువంటి కార్యాన్ని అయినా చేయగల కండ బలం ఎంతో అవసరం ... అటువంటి జ్ఞానం కలిగిన వారు బ్రాహ్మణులు , శౌర్యం కలిగిన వారు క్షత్రియులు ,ఆర్ధిక బలం కలిగించే వారు వైశ్యులు ,కండ బలంతో కార్యాన్ని సాధించే వారు సూద్రులు ...ఇవి అన్నీ వ్యక్తి గుణాలు ,తరువాత వారి వృత్తి ని బట్టి వర్ణం ఏర్పడుతుంది అని వేద వాక్కు ...అంతే గాని జన్మ వలన కాదు ... శిరస్సు ,భుజాలు , ఊరువులు ,పాదాలు అనేవి కేవలం ఉపమానాలు మాత్రమే ...మనిషి నడవడానికి పాదాలు ఎంత అవసరమో , సమాజం నడవడానికి సూద్రులు కూడా అంతే అవసరం అని అక్కడ అర్ధం ...ఎక్కడైనా పాద పూజ ఉంటుంది కాని ,శిరస్సు పూజ ఉండదు ...వీటిని భౌతికంగా ఆలోచించి అంధకార మతాల్లోకి వెళుతున్నారు చాలా మంది ... అలాగని హిందూ సమాజం లో కుల వివక్ష లేదు అని అనడం లేదు ...ఆ వివక్ష కి కారణం వ్యక్తలే కాని ధర్మం కాదు .... కాబట్టి వివక్ష చూపిన వ్యక్తిని విడిచి పెట్టండి ...ధర్మాన్ని కాదు ...
శ్రీరామ సౌజన్యముతో
Comments
Post a Comment