2020 18 *తంత్ర మార్గం:-*

*తంత్ర మార్గం:-*

*చక్ర విజ్ఞానం:-*

*విశుద్ధ చక్రం-1 - :-*

*మెడ వెనుక, కంఠం మధ్య భాగం           ఈ విశుద్ధ చక్ర స్థానం.!*

*ఇది "థైరాయిడ్" గ్రంథికి సంబంధించి యున్నది...*

*ఆకాశ తత్వం       ఈ చక్ర లక్షణం...*

*ఇది వినికిడికి సంబంధించిన జ్ఞానేంద్రియం తో అను సంథాన మై ఉన్నది...*

*దీనికి సంబంధించిన కర్మేంద్రియాలు "స్వర పేటికలు"...*
*ఈ విశుద్ధ చక్రం పంచ వాయువు లలో ఒకటైన ఉదాన వాయువు తో అనుసంథాన మై యున్నది...*

*ఇక్కడి అధిష్ఠాన దేవత "సదాశివుడు". ఇక్కడి ప్రతికూల శక్తి "శాకిని...*

*ఈ చక్రం నేరుగా మెదడుతో అను సంథానమై యుంటుంది...*

*ఇక్కడ 16 దళాల పద్మం కలదు...*

*ఈ దళాలలో ఒక్కొక్క దళానికి వాగ్దేవి శబ్దాలయిన అచ్చులు ఉంటాయి...*

*అవి... అం,  ఆం, ఇం, ఈం, ఉం, ఊం, ఋం, ౠం, లుం, లూం, ఎం, ఐం,ఓం, ఔం, అం, అః. ఈ 16 దళాలు అమావాస్య నుండి పౌర్ణమి వరకు వచ్చే 16 తిథులకు ప్రతీక...*

*అమావాస్య అంటే 'లయం' చెందడం. "పౌర్ణమి అంటే" వెలుగు...*

*చేతన త్వానికి సూచికగా ఈ విశుద్ధ చక్ర స్థానం లో "ఐరావతం" చూపించ బడినది..*

*ఈ చక్రపు బీజ మంత్రం "హం".        ఈ చక్రం జాగృత మైనప్పుడు కాల జ్ఞానం పెరుగు తుంది...*

*భూత భవిష్యత్తులను చెప్పగల శక్తి వస్తుంది...*

*ఆహారం తీసు కోక పోయినా జీవించి ఉండగల శక్తి వస్తుంది...*

*ఇతరుల ఆలోచనలను గ్రహించ గల శక్తి వస్తుంది...*

*చల్లదనం, వెచ్చదనం లాంటి అనుభూతులు కలుగుతాయి...*

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: