2020 ఆధ్యాత్మికం

ప్రతి మనిషి మూడు సమస్యలతోనే ఎక్కువగా సతమతమవుతూ ఉంటాడు.
శత్రు, రోగ, రుణబాధ నివారణ కారకుడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి.  వీటిని ఏకకాలంలో నివారించగలిగే దేవునిగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని భక్తులు కొలుస్తారు. ఆయనకు ముడుపు కట్టి మొక్కితే సకలరోగాలు పటాపంచలై అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనేది భక్తుల విశ్వాసం.

సకల దోషాలకు నివారణ ...
జాతకరీత్యా, కుజ, శని, రాహు, కేతు దోషాలు, కాలసర్ప దోషాలు, నాగదోషాలు పరిహారమవుతాయి. ఆలస్యవివాహాలు, కుటుంబ కలతలు, దాంపత్య అనుకూలత లేకపోవడం, సంతానం లేనివారు, ఉన్న సంతానం సక్రమంగా ఉండాలనుకునేవారు, ఉద్యోగం లేనివారు, ఉద్యోగ సంబంధ సమస్యలు, ఉద్యోగ ప్రమోషన్లకు స్వామివారికి మొక్కుతారు. వృత్తి, వ్యాపార  వ్యవహార అనుకూలతకు, కుటుంబ వృద్ది, గృహ సౌఖ్యం, రాజకీయ అభివృద్ధికి స్వామివారికి పూజలు చేయిస్తుంటారు.  విద్యార్ధులకు విద్యాభివృద్ధికి, శత్రువుల నుంచి రక్షణకు, రుణ విమోచనకు, శరీర అనారోగ్య నివారణ, జాతకరీత్యా, నవగ్రహ దోష నివారణకు స్వామివారి పూజలు నిర్వహించడం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగిస్తుంటారని భక్తుల ప్రగాడ విశ్వాసం.
.....

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: