2020. పిల్లలు- పెంపకం

పాఠశాలలు, కళాశాలల్లో డాన్స్‌ ప్రాముఖ్యం ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏ వేడుక జరిగినా ఆనందంతో చిందులేయాల్సిందే. మరి మన పిల్లలు అందరితో భేష్‌ అనిపించుకోవాలంటే.

నృత్య శిక్షణ, పాటలు, చిత్రలేఖనం, ,ఇంకా చిన్నారుల మేథస్సును పెంచేలా  రోబోటిక్స్‌, ఫొటోగ్రఫీ, అబాకస్‌.. అన్నీ ఆకట్టుకునేవి నైపుణ్యాలు పెంచేవి.  వాళ్ల భవిష్యత్తుకు కూడా ఉపయోగపడేవి.

శరీరం కూడా దృఢంగా మారుతుంది. నలుగురితో కలిసి సాధన చేస్తారు కాబట్టి... క్రమశిక్షణ కూడా వస్తుంది. 

పెద్దయ్యేకొద్దీ చదువు, ఉద్యోగం పేరుతో పిల్లలు విడిగా ఉండాల్సి రావచ్చు

 ఈ రోజుల్లో పిల్లలకు చిన్నవయసు నుంచీ ఎంతోకొంత వంట  రావడం అనేది ప్రాథమిక అవసరం అంటున్నారు  నిపుణులు.

సెలవుల్లో పిల్లలకు చిన్నచిన్న వంటలు ఇంట్లోనే నేర్పించండి.  

చాలా మందికి అవసరం అయిన కళల్లో ఫొటోగ్రఫీ కూడా ఒకటి. 
ఫొటోలు తీయడం, లైటింగ్‌ సరిదిద్దుకోవడం... వంటివి తెలిస్తే చాలు ఎవరైనా ఫొటోలు తీయొచ్చు.
ఇది వారిలో సృజనాత్మకతనూ పెంచుతుంది. సహనం అలవడుతుంది. ఏకాగ్రత కూడా పెరుగుతుంది. 

పిల్లలు చదువుల్లో రాణించాలని కోరుకుంటున్నారా.... అలాంటివారికి వేదిక్‌ మ్యాథ్స్‌, అబాకస్‌ వంటివాటిల్లో శిక్షణ ఇప్పించండి. వేదిక్‌ మ్యాథ్స్‌లో కఠికంగా ఉండే లెక్కలను ఎంత వేగంగా చేయాలో చెబుతారు.

సమస్యను పరిష్కరించేలా ఆలోచనా విధానం మెరుగవుతుంది. ఏకాగ్రతను, దేన్నైనా క్షుణ్నంగా గమనించే తత్వం కూడా సొంతమవుతుంది. మానసిక దృఢత్వం పెరుగుతుంది. క్రిటికల్‌ థింకింగ్‌ వస్తుంది.

కొంతమంది పిల్లలకు  రోజుకో కథ చదువుకోవచ్చు. లేదా పెద్దవాళ్లనే చెప్పమని అడగొచ్చు. . నిద్రపోయేటప్పుడు మెదడును పదునుపెట్టే ఓ పజిల్   వంటివీ ఎంతో మేలు చేస్తాయి. 

 
వీటి వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది.


వేసవి రాగానే అన్ని నగరాలు, పట్టణాల్లో క్రీడల శిక్షణా శిబిరాలు ఏర్పాటవుతాయి. పిల్లల్లో మంచి నైపుణ్యం ఉంటే సచిన్‌ తెందుల్కర్‌, సైనా నెహ్వాల్‌, సానియా మీర్జాలాంటి ఆటగాళ్లు తయారుకావడం పెద్ద కష్టమేమీ కాదు. క్రీడల్లో రాణిస్తే గనుక.. భవిష్యత్తు తిరుగుండదనే ఉద్దేశంతో ఇలాంటివి అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటవుతున్నాయి. ఈత, విలువిద్య, క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, హాకీ వంటి క్రీడల్లో పిల్లలు తర్ఫీదు పొందవచ్చు. ఆసక్తి ఉంటే జిమ్నాస్టిక్స్‌, యోగా వంటివాటిల్లోనూ చేరొచ్చు. ఇన్నాళ్లు డిజిటల్‌ గేమ్స్‌కు అలవాటు పడిన పిల్లలను ఇప్పుడైనా ఫిజికల్‌ గేమ్స్‌వైపు నడిపిస్తే ఎంతో మంచిది. 
చాలానే లాభాలు: శారీరక శ్రమ పెరగడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి వస్తుంది. సృజనాత్మకత, సానుకూల దృక్ఫథం పెరుగుతాయి. ఇతరులతో స్నేహంగా మెలిగే సామాజిక నైపుణ్యాలు అలవడుతాయి. చిన్నచిన్న విషయాలకు కుంగిపోకుండా ఉంటారు. గెలుపు ఓటములను సానుకూలంగా తీసుకుంటారు. కష్టపడేతత్వం కూడా నేర్చుకుంటారు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: