నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 30 Apr, 2019 14:24 IST|Sakshi
నష్టాల్లో స్టాక్‌మార్కెట్ల
30 Apr, 2019 14:24 IST|Sakshi
దేశీయ స్టాక్‌మార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. బ్యాంక్స్, ఆటో, రియాల్టీ స్టాక్స్ భారీ ఒత్తిడితో సెన్సెక్స్ ఒక దశలో 300పాయింట్లు పతనమైనంది. నిఫ్టీ కూడా 11700 స్థాయిని కోల్పోయింది. ప్రస్తుతం 130 పాయింట్లు క్షీణించి 38937వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 11707 వద్ద కొనసాగుతోంది. ఎస్ బ్యాంక్ టాప్ లూజర్‌గా ఉంది. దీంతో నిప్టీ బ్యాంకు ఇండెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 400 పాయింట్లకు పైగా నష్టపోయింది.
ఇండస్ ఇండ్, రిలయన్స్, ఇండియా బుల్స్, భారతి ఇన్‌ప్రాటెల్, హీరో మోటోకార్ప్, మారుతి నష‍్టపోతున్నాయి.
కొనుగోళ్ల జోరు : సెన్సెక్స్ 350 పాయింట్లు జంప్
సాక్షి, ముంబై: మూడురోజుల నష్టాల తర్వాత సానుకూలంగా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు మిడ్ సెషన్‌తరువాత మరింత జూమ్ అయ్యాయి. ఆరంభంలో ఊగిసలాడిన కీలక సూచీలకు ప్రస్తుతం కొనుగోళ్ల మద్దతు భారీగా లభిస్తోంది. దీంతో సెన్సెక్స్ 351పాయింట్లు జంప్ చేసి 38,915 వద్ద, నిఫ్టీ లాభాల సెంచరీ సాధించి (+113) 11689 వద్ద ఉత్సాహంగా దౌడు తీస్తోంది. దాదాపు అన్ని రంగాలు లాభపడుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీగా లాభపడుతున్నాయి.
బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, ఐవోసీ, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్, ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, గెయిల్, టైటన్ లాభపడుతున్నాయి. అయితే టాటా మోటార్స్ అల్ట్రాటెక్, హీరో మోటో,వేదాంతా, గ్రాసిమ్, యాక్సిస్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, టాటా స్టీల్ నష్టపోతున్నాయి. ఫలితాల ప్రకటించిన మారుతి నష్టపోతోంది.
Comments
Post a Comment