2020 calander

పులిమీద పుట్రలా ఉరుముతున్న కరవును కొత్త ప్రభుత్వం తక్షణ ప్రాధాన్యాంశంగా గుర్తించక తప్పదు. మొన్న ఫిబ్రవరి నాటికే ఎనిమిది రాష్ట్రాల్లోని 130 జిల్లాలు కరవువాత పడ్డాయని,

దేశంలో 42శాతం పరగణా క్షామం కోరల్లో చిక్కుకోగా 50 కోట్లమంది ప్రజలు దురవస్థలపాలవుతున్నట్లు కరవుపై ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏప్రిల్‌ తొలి వారంలోనే ప్రకటించింది.

దేశవ్యాప్తంగా 91 రిజర్వాయర్లలో నీరు అడుగంటి సంక్షుభిత పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర జలసంఘమే ప్రకటించగా- కాటక పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి రాష్ట్రాలు తమ స్థాయిలో కిందా మీదా పడుతున్నాయి. దుర్భిక్ష పరిస్థితుల్లో కూలీనాలీ చేసుకొనే పేదలకు అక్కరకొచ్చేలా రూపొందించిన గ్రామీణ ఉపాధిహామీ పథకమూ పలు కారణాలతో ప్రభావశూన్యం అవుతుండటంపై మోదీ ప్రభుత్వం అత్యవసరంగా దృష్టి సారించాలి.

మౌలిక సదుపాయాల అభివృద్ధి, అవినీతి నిర్మూలన, జాతీయ భద్రత, స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల వంటివాటిని మోదీ సర్కారు సాధించిన ఘనతలుగా పేర్కొన్న పారిశ్రామికాధిపతులు-

నిరుద్యోగిత, వ్యవసాయ సంక్షోభం, మతపర అసహనాల్ని వైఫల్యాలుగా ప్రస్తావించారు.

  మందగమనం ఊబినుంచి ఆర్థిక వ్యవస్థను బయటకు లాగి ప్రైవేటు పెట్టుబడుల దన్నుతో మార్కెట్లలో కొత్త ఉత్సాహం నింపడం వంద రోజుల అజెండాలో కీలకాంశంగా మారింది.

లక్షా 44వేల కోట్ల డాలర్ల(దాదాపు నూరు లక్షల కోట్ల రూపాయల)తో రోడ్లు, రైల్వేలతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి ఎగుమతుల్ని రెట్టింపు చేస్తామని భాజపా ఎన్నికల ప్రణాళిక వాగ్దానం చేసింది.

కట్టుతప్పిన ద్రవ్యలోటును నియంత్రించాలంటే, ఎగుమతుల్లో వృద్ధి నమోదై వాణిజ్య లోటు తగ్గాలి.

కానీ వాణిజ్య మిగులు చివరగా నమోదైంది 2002 సంవత్సరంలో కాగా, దిగుమతుల్లో పెద్ద పద్దుగా ఉన్న ముడి చమురు- ఇరాన్‌పై ఆంక్షల నేపథ్యంలో మరింతగా భగ్గుమనే ప్రమాదం పొంచే ఉంది.

అయిదేళ్లుగా ద్రవ్యోల్బణాన్ని జాగ్రత్తగా నియంత్రిస్తూ వస్తున్న మోదీ ప్రభుత్వానికి చమురు ధరల రూపేణా అతిపెద్ద సవాలు ఎదురుకానుంది. అమెరికా చైనాల వాణిజ్య యుద్ధం ఎగుమతి అవకాశాల్ని సన్నగిల్లజేస్తున్న తరుణంలో- ఆర్థిక సంకటాలు మరింతగా తీవరించనున్నాయన్న ఆందోళనలు.

ఫ్రాన్స్‌ను తోసిరాజని ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన ఇండియా వచ్చే అయిదేళ్లలో అయిదు లక్షల కోట్ల డాలర్ల జీడీపీ సాధించనుందన్న అంచనాలున్నాయి.

గ్రామీణార్థికానికి వెన్నెముక అయిన వ్యవసాయాన్ని సంక్షోభంనుంచి బయటపడేసి,
ఆర్థిక వ్యవస్థకు మందభాగ్యం దాపురిస్తే పాతిక కోట్ల కుటుంబాల బడ్జెట్లు తలకిందులవుతాయన్న హెచ్చరికల దృష్ట్యా -

పీఎమ్‌ ఆవాస్‌ యోజన, ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టులు వంటివాటిలో విదేశీ పెట్టుబడుల్ని ఆకట్టుకోగలిగితే నయా ఇండియాకు గట్టి పునాదులు పడతాయి.
పారదర్శకత, జవాబుదారీతనాలు అన్ని స్థాయుల్లోనూ పాదుకొనేలా రాజకీయ సంస్కరణల్ని అమలు చేస్తే
- ఇనుమడించిన శక్తి సామర్థ్యాలతో ఇండియా పురోగమించగలుగుతుంది!

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: