ప్రధాని_మోడీజీ #కేదార్_నాథ్ వెళ్ళటం ,
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందునుండే తన జీవితాన్ని హిమాలయాలలోని గుహలలో గడిపారు.
ఇక్కడ కొన్ని సంవత్సరాలు జపతపాదులలో వెళ్ళబుచ్చారు.
నిస్వార్థమైన కర్మయోగిగా 5 ఏళ్ళు ప్రధానిగా రాజ్యపరిపాలన చేసి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసిన పాలకుడాయన.
ఇటీవలే అక్షయకుమార్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీయే స్వయంగా చెప్పటం జరిగింది తాను దీపావళి పండుగప్పుడు కేవల జలాహారం తో 5 రోజులపాటు అడవులలో, గుహలలో ఒంటరిగా ధ్యానంలో గడుపుతానని.
అదే ఇంటర్వ్యూలో మోడీని - మీరు జలుబు చేసినపుడు ఏంచేస్తారు? అని అడిగితే , తగ్గేవరకూ కేవలం వేడినీళ్ళు మాత్రమే తీసుకుంటానని సమాధానమిచ్చారు మన ప్రధాని.
రోజుకి 3 1/2 గంటలు మాత్రమే పడుకుంటాను అని కూడా ఆయన చెప్పటం జరిగింది.
యోగసాధన బాగా అలవాటైనవారికి నిద్ర తగ్గిపోతుంది.
మనసులో తమోగుణం అధికంగా ఉన్నవారికి నిద్ర ఎక్కువసేపు అవసరం గానీ, యోగధ్యానాదులవలన చిత్తాన్ని శుద్ధిపరచుకున్న వారికి నిద్రావశ్యకత అల్పమే కదా !
నిన్న కేదారనాథ్ లోని కనిష్ట ఉష్ణోగ్రత 3℃. అందుకనే దానికి అనువుగా పహాడీ ( కొండప్రాంతపు) దుస్తులు ధరించి ఆయన వెళ్ళారు.
నేటి రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత -5℃ ఉంటుంది అని AccuWeather వాడి forecast.
70 ఏళ్ళ వయసులో నువ్వు అసలు కేదారనాథ్ నుండి రుద్రగుహ కు 2కిమీ దూరం నడువగలవా?
ఈరోజు Lt.Gen.DP Sehgal ట్వీట్ చేస్తూ - " మోడీజీ! 12వేల అడుగుల ఎత్తులో 2 కిమీ ట్రెక్కింగ్ ని 70ఏళ్ళ వయసున్న మీరు చేసారంటే అది నిజంగా శివానుగ్రహమే" అని ఊరకనే అన్నారా?
2013 లో కేదారనాథ్ లోని వరదలని ప్రతీ ఛానల్ వాడూ పదే పదే చూపించాడు.
అందుకనే మోడీజీ ఆపనిని మీద వేసుకున్నారు. ఈరోజున కేదారనాథ్ వైపు ప్రతీ భారతీయుడీ దృష్టి మళ్ళింది. యువత కూడా గమనిస్తున్నారు.
మోడీజీ కూడా ఉదయం కేదారనాథ్ లో మీడియా వారితో మాట్లాడుతూ - "మనవాళ్ళు విదేశాలకు వెళ్ళటం కాదు. భారత్ లో ఎన్నో చూడవలసిన ప్రదేశాలున్నాయి. చూడండి" అని పిలుపునిచ్చారు.
Comments
Post a Comment