🕉లలితారహస్య నామ భాష్యము🕉
🕉లలితారహస్య నామ భాష్యము🕉
🕉లలితారహస్య నామ భాష్యము 🕉
నేటి నామపారాయణ
8 రాగ స్వరూప పాశాఢ్యా
రాగరూపమైన పాశాన్ని ఎడమ చేతిలో ధరించిన తల్లికి నమస్కారము
Ragha Swaroopa pasadya
She who has loves rope in her left hand. salutations to the mother
------------------------------------------------------------------------------------------------------------------
8. రాగస్వరూపపాశాఢ్యా
పరమేశ్వరి చతుర్చాహు సమన్విత. అంటే ఆమెకు నాలుగుబాహువులుంటాయి
అని చెప్పటం జరిగింది. ఇప్పుడు ఆ బాహువులలో ఉండే ఆయుధాలను వివరిస్తున్నారు.
మొట్టమొదటగా పాశము.
రాగోల౭ నురక్తిః చిత్త వృత్తి విశేషః
రాగము అంటే అనురాగము. ఇది మనోవ్యాపారవిశేషము లేదా కోరిక. ఒకరి
మీద లేదా ఒక వస్తువు మీద ఉండేటటువంటి ఇష్టత. అదే ఆప్యాయత, అనురాగము,
ఇష్టము, ప్రేమ ఈ రకంగా అనేక పేర్లతో పిలువబడుతుంది. అనురాగము అనేది
పాశం వంటిది. కట్టిపడేస్తుంది. ఎవరిమీదనైనా ఇష్టత పెంచుకున్నట్ల ఐతే అది వారియందు
బద్ధులను చేస్తుంది. దానివల్ల వారిని విడిచి ఉండలేము. వారిని చూడందే ఉండలేము.
ఆ వస్తువు లేదా ఆ మనిషి లేకుండా మనం జీవించలేము అనిపిస్తుంది. దానికోసం
మనం ఏపనైనా చేస్తాం. ఎంతకైనా తెగిస్తాం. ఈ రకంగా అనురాగం పెంచుకున్నవాడికి
మనస్సు ఇతర విషయాలమీదకిపోదు. దైవచింతన గుర్తుకురాదు. అంతగా మోహంలో
పడిపోతాడు. జడభరతుడి కథ ఇందుకు చక్కని ఉదాహరణ.
పూర్వకాలంలో భరతుడు అని ఒకరాజుండేవాడు. చాలాకాలం రాజ్యం చేసిన
తరువాత, రాజ్యాన్ని కుమారులకప్పగించి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. అతడు
చాలాగొప్పవాడు. వేదవేదాంగవిదుడు. తపోనిష్టాగరిష్టుడు. ఒకరోజున స్నానం చెయ్యటానికి
నదీతీరానికి వెళ్ళాడు. అక్కడ నిండుగర్భిణి అయిన లేడి ఒక పిల్లనుకని ప్రాణాలు విడిచింది.
ఈ రాజర్షి ఆ లేడిపిల్లను తెచ్చి చాలా జాగ్రత్తగా పెంచసాగాడు. దానికి ప్రతిరోజూ
క్రమం తప్పకుండా పాలుపట్టేవాడు. అది కూడా అతణ్ణి వదిలి ఎక్కడికీ వెళ్ళేదికాదు. ఈ
రకంగా ఆ లేడిపిల్ల పెరిగి పెద్దదవుతున్నది. రాజుకు వయసు మీరుతున్నది. రాజుకు
అవసానకాలం సమీపించింది. ఆఖరుస్థితిలో కూడా దైవచింతనలేదు. తను లేకపోతే ఈ
లేడిపిల్ల ఏవిధంగా బ్రతుకుతుంది అన్న ఆలోచనే. ఎప్పుడూ అదే ఆలోచన. ఆ లేడిపిల్లను
చూడకుండా క్షణం కూడా గడవని స్థితి. అలాగే కళ్ళు ముశాడు రాజు. పర్యవసానం ?
మరుజన్మలో లేడిఅయిపుట్టాడు. ఆ లేడిమీద ఉన్న ప్రేమతో, వానప్రస్థానికి పోయినవాడు
కూడా మళ్ళీ లేడిగా జన్మించవలసిన దుర్గతి పట్టింది. ఇదే రాగము.
పరమేశ్వరి ఎడమచేతి వైపున గల పైచేతిలో ఈ పాశము ఉంటుంది. ఈ పాశము ప్రేమస్వరూపమయిన ఆయుధము. జీవిని కట్టపడేస్తుంది.
మనోవృత్తులు బాధాకరమైనవి. అందుకే ఆయుధాలుగా చెప్పబడ్డాయి. రాగము అనేది అరిషడ్వర్గాలకు మూలమైనది. అనురాగాన్ని గనక జయించినటైతే ముక్తి లభిస్తుంది.సుషుప్తిలో రాగము ప్రాణమునందు లయం చెందుతుంది. జాగ్రదవస్థలో బుద్ది
జాగ్రదమవుతుంది. అందుచేత అది మనసులోఉంటుంది. గాఢమైన సుపుప్తిలోను,
లేదా తురీయావస్థలోను తప్ప అనురాగానికి అంతమనేది లేదు. ఇది అనంతమైనది.
పూర్వజన్మలో తెలిసిన విషయాలను మాత్రమే జీవికోరతాడు. అంతేగాని తెలియని పదార్థాల
జోలికిపోడు. ఎవరైనా కొత్తవ్యక్తులను చూసినప్పుడు వారిని ఎక్కడో చూసినట్లు, వారితో
మనకు బాగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి వారితో మనకి ఏరకమైన
పరిచయం లేదు. కాని గతజన్మలలో ఎప్పుడో వారితో బాగా పరిచయం ఉందన్నమాట.
అందుకే మనకు అలా అనిపిస్తుంది. అందుచేతనే రాగోనురక్తిః చిత్త వృత్తి విశేషతః
రాగము అనేది బుద్ధికి సంబంధించిన విషయము. చిత్తవృత్తి విశేషము. మాయలేదా
అజ్ఞానము అనేవి ఇచ్చాజ్లాన క్రియాశక్తుల సమాహారము. ఈ మూడింటినీ విడదీయలేము.
ప్రాపంచికమైన ఈ అనురాగాలను అరికట్టే పరమేశ్వరి శక్తియే పాశము. పైన
చెప్పినటువంటి ఇచ్చాజ్డానక్రియాశక్తులలో
జ్ఞానశక్తి ఎక్కువపాలుంటే - ఉత్తమజన్మ ఇచ్చా, క్రియాశక్తులపాలు ఎక్కువ ఉంటే
- పశుపక్ష్యాదుల జన్మ కలుగుతుంది. జ్ఞానశక్తి ఎక్కువగా ఉన్నటువంటి వారు బుషులు,
గంధర్వులు, సిద్ధులుగ జన్మిస్తారు. సాధకుడు పరమేశ్వరిని అర్చించేటప్పుడు ఈ రాగము
అనే దాన్ని పూర్తిగా వదిలివేసి, అంటే రాగాన్ని పరమేశ్వరికి అర్చించి, ఆవిడచేతిలో
పాశరూపంలో ఉంచి అర్చించాలి. అప్పుడే అతడికి ముక్తి లభిస్తుంది.
పరమేశ్వరి చేతిలో ఉన్నటువంటి పాశము వశీకరణము అని చెప్పబడుతోంది.
ఈ పాశాన్ని అర్చించినవారు ముల్లోకాలను వశం చేసుకోగలుగుతారు. అందుకే నవావరణ పూజ చేసేటప్పుడు ఎనిమిదవ ఆవరణ అనగా త్రికోణంలో ముందుగా దేవి యొక్క
ఆయుధాలను అర్చించటం జరుగుతుంది.
ఓంఐంహ్రీం శ్రీం హ్రీం ఆం సర్వవశీకరణా భ్యాం
కామేశ్వరీ కామేశ్వర పాశాభ్యాం నమః పాశశక్తి
శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః
దుర్వాసుడు తన శ్రీదేవీ మహిమ్మః స్తుతి”లోని 43వ శ్లోకంలో
పాశం ప్రపూరిత మహా సుమతి ప్రకాశో
యో వా తవ త్రిపురసుందరి ! సున్దరీణాం ॥
ఆకర్షణేల ఖిలవశీకరణే ప్రవీణం
చిత్తే దధాతి స జగత్రయవశ్యకృత్స్వాత్ ॥
ఓ తల్లీ ! సౌందర్యవంతులైన సుందరీమణులను ఆకర్షించగల, సకలదుష్టశక్తులను
వశీకరించగల నీ పాశాయుధమును, పాశబీజమును ఉపాసించు వాడు ముల్లోకాలను
వశం చేసుకోగలుగుతాడు.
9 క్రోధాకారాంకుశోజ్వలా
క్రోధ రూప అంకుశాన్ని కుడిచేతిలో ధరించిన తల్లికి నమస్కారము
Krodhakarankusojwala
She who has anger in the form of Ankusam(an elephant-goad) –in her right hand. salutations to the mother (అంకుశము =ఏనుగు కుంభస్థలమునందు పొడిచెడి యాయుధము;)
9. కోధాకారాంకుశోజ్ఞ్వలా
క్రోధము అంటే ద్వేషము అనే పేరుకల మనోవ్యాపారము. మనకు ఇచ్చగనక
బాగా కలిగినట్లైతే, అంటే ఒక మనిషియందు మనకు అత్యంతమైన ప్రేమ, అనురాగము
ఉన్నాయి. ప్రతి విషయంలోనూ వారే ఉన్నతులుగా ఉండాలి అనుకుంటాం. అలాంటప్పుడు
ఒకవేళ మనం అనుకున్నట్లుగా గనకవారు రాలేకపోయినప్పటికీ దాన్ని మనం భరించలేం.
ఎదుటివారి గొప్పదనాన్ని ఒప్పుకోలేం. వారిమీద ఏదో కారణంగా కోపం పెంచుకుని
వారిని అసహ్యించుకుంటాం. దీనికి కారణము మనవారి పట్ల మనకున్న రాగము.
దీనివల్లనే మన వారు చేసిన తప్పులు కూడా ఒప్పులుగాను, ఎదుటి వారు చేసిన
ఒప్పులు కూడా తప్పులుగాను కనిపిస్తాయి. అంటే మితిమీరిన అనురాగమే క్రోధము
క్రింద మారుతుంది. మనమీద మనకు నమ్మకముంటుంది. ఆత్మాభిమానం ఉంటుంది.
అంతవరకు మంచిదే. కాని అది బాగా పెరిగిపోతే దురభిమానమవుతుంది. అదే
ఆవేశకావేశాలకు కారణం. అదే క్రోధం అందుకే
క్రోధో ద్వేషాఖ్యా చిత్త వృత్తిః
క్రోధము అనేది ద్వేషము అనే పేరుగల చిత్తవృత్తి. పరమేశ్వరికి కుడివైపున్నటువంటి
పైచేతిలో అంకుశమున్నది. అంకుశము బాధించేది. క్రోధము వల్ల ఇతరులకు
బాధకలుగుతుంది. ఇతరులను బాధించటమే క్రోధము యొక్క ముఖ్యలక్షణము. అంకుశము
అంటే ఏనుగును పొడిచి నడిపించే ఆయుధము. అనగా బాధించేది. కాబట్టే క్రోధానికి
గుర్తుగా దేవి కుడి చేతిలో అంకుశమున్నది.
ఇది భక్తులకు జ్ఞానరూపము. దుష్టుల ఎడ అంకుశము. క్రోధమనేది రజోగుణము.
అట్టి క్రోధాకారమైన అంకుశము చేతియందు గలది ఆ పరమేశ్వరి. చతుశ్శతిలో
చెప్పినట్లుగా
పాశాంకుశౌ తదీయౌ తు రాగద్వేషాత్మకే స్మృతౌ
దేవి పాశము అంకుశము ధరించి ఉంటుంది. అవి రాగద్వేషాలకు ప్రతీకలు.
యోగినీహృదయంలో
ఇచ్చాశక్తిమయం పాశం అంకుశం జ్ఞానరూపిణం
క్రియాశక్తిమయే బాణధనుషీ దధ దుజ్జ్వలమ్ ॥
పాశము - ఇచ్చాశక్తి. అంకుశము - జ్ఞానరూపము. ధనుర్బాణములు
క్రియాశక్తిమయాలు.
ఏదైనా జీవి హింసించబడేటప్పుడు, అది ఆ బాధ భరిస్తూ, ఎదిరించలేక “ఓ దేవీ!
నన్ను హింసిస్తున్నారు. వారిని ఎదిరించే సామర్ధ్యము నాకులేదు. ముందు జన్మలోనైనా
ఇటువంటి వారిని ఎదిరించే సాహసము నాకు కలుగజెయ్యవలసినది” అని ఏడుస్తూ
ప్రార్థిస్తుంది. ఈ జన్మలో దాని శరీరము నశించినప్పుటికీ ప్రతీకారజ్వాల మాత్రం దాని
మనసును అంటిపెట్టుకుని ఉంటుంది. అప్పుడు మరుజన్మలో ఆ జీవికి అది క్రోధము
అవుతుంది. ఈ విధంగా ప్రపంచంలో జరిగే ప్రతి హింసా ప్రవృత్తికీ గతజన్మలోని
అనుభవాలే కారణము. అదే పరమేశ్వరి చేతిలోని అంకుశశక్తి. పాపం చేసినటువంటి
వారికి ఇది అంకుశము. మిగిలినటువంటివారికి ఇది ఆభరణము. శ్రీచక్రంలోని ఎనిమిదవ
ఆవరణ అయిన త్రికోణంలో దీన్ని పూజిస్తారు.
ఓంఐంహ్రీంక్రోంక్రోం సర్వస్తంభనాభ్యాం
కామేశ్వరీ కామేశ్వరాంకుశాభ్యాం నమః అంకుశశక్తి
శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
దుర్వాసుడు శ్రీ దేవీ మహిమ స్తుతిలోని 44వ శ్లోకంలో అంకుశాన్ని ధ్యానిస్తూ
యః స్వాన్తే కలయతి కోవిద స్త్రీ లోకీ
స్తంభారంభణచణ మత్యుదారవీర్యం ।
మాత స్తే విజయమహాంకుశం స యోషా
న్దేవా స్పృమృయతి చ భూభుజోల న్యసైన్యమ్ |
తల్లీ ! ముల్లోకములను స్తంభింపచేయకల నీ అంకుశబీజమును ఉపాసన చేసేవాడు
సకల స్త్రీలను, దేవతలను, రాజులను, శత్రువులసైన్యాలను కూడా స్తంభింపచేయగలుగుతాడు.
10 మనోరూపేక్షు కోదండా
మనోహరమైన చెరకు విల్లును ఎడమ చేతి క్రింద ధరించిన తల్లికి నమస్కారము.
Mano Rupeshu Kodanda
She who has the bow of sugar cane in the lower left hand. salutations to the mother
------------------------------------------------------------------------------------------------------------------
10. మనోరూపేక్ష కోదండా
జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనేవి ప్రతిజీవికి ఉంటాయి. అందుచేతనే ఆహార
నిద్రామైథునాలు జీవులన్నింటికీ సమానంగానే ఉంటాయి. కాని సంకల్పవికల్పాలకు
కారణమైనది మనస్సు. ఇది పదకొండవ ఇంద్రియము. మానవుడికి మాత్రమే ఉంటుంది.
దీనివల్లనే మానవుడికి యుక్తాయుక్త విచక్షణ అనేది ఉంటుంది. ఏది ధర్మం. ఏది అధర్మం
అనే విషయాలు నిర్ణయించుకోగలుగుతాడు.
మనోరూపమైన చెరకువిల్లును ఎడమవైపు క్రిందిచేతితో ధరించి ఉంటుంది. బాణం
వెయ్యాలి అంటే ఎడమచేత్తో ధనుస్సును పట్టుకుని కుడిచేతితో నారిసారించి బాణం
వదలాలి. అందకని పరమేశ్వరి ఎడమచేతిలో ధనుస్సు ఉంటుంది. ఇది క్రియాశక్తి.
మన్మథుడి ఆయుధం చెరకు విల్లు. అందుచేతనే కాళిదాసు ఆ దేవిని స్తుతిస్తూ
పుండ్రేషుపాశాంకుళ పుష్పబాణ హస్తే
అంటాడు. అంటే చేతిలో చెరకు విల్లు, పాశము అంకుశము, ధరించినది. మన్మధుడు
అంటే మనసును మధించేవాడు. అతడి యొక్క విల్లు తీయనైన చెరకుతో చేయబడింది.
అదేవిధంగా పరమేశ్వరి చేతిలోని విల్లుకూడా చెరుకువిల్లే. ఆవిడ మనసు కూడా
మధురమైనదే. కోదండము శతృభయంకరము. మనసు చంచలమైనది. దానికి స్థిరత్వం
ఉండదు. అందుకే మనసు కోతిలాంటిది. కోతి ఒక కొమ్మ మీదనుంచి ఇంకొక
కొమ్మమీదకు ఏవిధంగా గెంతుతుందో, అదేవిధంగా మనసు కూడా ఒక విషయం
నుంచి ఇంకొక విషయం మీదకు వెడుతూ ఉంటుంది. మనసును నిశ్చలం చెయ్యగలిగితే
సమాధిస్థితి వచ్చినట్లే. ఎప్పుడైతే సమాధిలోకి వెళ్ళగలిగాడో, అప్పుడు అతడికి
ఆత్మసాక్షాత్కారమైందన్న మాటే. అటువంటివ్యక్తికి విశాలమైన ఈ విశ్వమంతా రజ్జు
సర్పబ్రాంతి అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే మనసును ఏకాగ్రం చెయ్యగలిగిన వాడికి
ఆత్మసాక్షాత్కారం త్వరగా జరుగుతుంది.
విషయమే ఆకారంగా గలది మనసు. జీవుల యొక్క మనోవృత్తియే దేవి చేతిలో
ఉన్న కోదండము. మనసు అనేది కామనాశక్తి
సంకల్పవికల్పాలనబడే పదకొండు మనోవృత్తులచేత ప్రభవించే కర్మాగారమే మనస్సు.
అవి :
1. కామము 4. శ్రద్ధ 7. అధృతి 10. భీః
2. సంకల్పము 5. సత్యము 8. శ్రీః 11. ధీః
3. వికల్పము 6. ధృతి 9. హ్రీం
ప్రతిజీవికి తన మనసులో ఉండే ప్రీతి విశ్వాసాలు ఇక్షుభావసూచితాలు. ఈ
పదకొండు మానసిక అవాంతర భేదములు. మనసులోని ఈ అవాంతరము ప్రాణి యొక్క
జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. ఇవి సామాన్యుడి యందు ఒక రకంగా ఉంటే ఉత్తముడియందు
ఇంకొక రకంగా ఉంటాయి. పామరుడికి నిత్యము సత్యము అనిపించే ఈ జగత్తు
జ్ఞానికి అనిత్యము అనిపిస్తుంది. అస్థిరము అనిపిస్తుంది.
జీవియొక్క స్థూలదేహము నశిస్తుంది. కాని సూక్ష్మదేహము నశించదు. అది
గతజన్మలో చేసిన పాపపుణ్యాలవల్ల లభించే స్వర్గనరకాలనుభవించి కర్మఫలశేషాన్ని
అనుభవించటానికి ఇంకొక జన్మ ఎత్తుతుంది. గత జన్మ చివరలో ఏ కోరికలుంటాయో,
దేన్ని గురించైతే మరణకాలంలో తీవ్రంగా ఆలోచిస్తుంటాడో వాటియొక్క వాసనలు ఈ
జన్మలో కూడా ఉంటాయి. వాటికి తోడుగా క్రొత్తవి కూడా వస్తాయి. వీటన్నింటినీ
ప్రవర్తింపచేసేవాడు పరమేశ్వరుడు. మనస్సు అనేది క్రియాశక్తి. అందుచేతనే క్రియాశక్తి
రూపమయిన ధనుస్సు మనస్సుగా చెప్పబడుతోంది. నవావరణ పూజలో ఎనిమిదవ
ఆవరణలో దేవి ఆయుధమయిన ధనుస్సును పూజిస్తారు.
ఓం ఐం హ్రీం శ్రీం థంధం సర్వసమ్మోహనాభ్యాం
కామేశ్వరీ రమేశ్వధనుర్భ్యాం నమః ధనుః శ్యక్తి
శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః
దుర్వాస మహర్షి శ్రీ దేవీ మహిమ స్తుతిలోని 41వ శ్లోకంలో దేవి ఆయుధమైన
ధనుస్సును ధ్యానిస్తూ
అథ తవ ధనుః పుండ్రేక్షూకృత్ ప్రసిద్ధ మతిద్యుతి
త్రిభువన వధూ ముద్య జ్యోత్స్నా కలానిధి మండలం
సకలజనని ! స్మారం స్మారం గతః స్మరతాం నరః
త్రిభువన వధూ మోహామ్మోధేః ప్రపూర్ణవిధు ర్భవేత్ |
తల్లీ నీ చేతిలో ఉన్న పుండ్రేక్షుచాపము లోకాలలోని సుందరీమణుల మనస్సులలో
విరహ బాధ కలిగిస్తుంది. అటువంటి నీ దుఃఖబీజాన్ని ఉపాసించే వాడు స్త్రీలను వశం
చేసుకోగలుగుతాడు.
11 పంచతన్మాత్ర సాయకా
పంచతన్మాత్రలుఅంటే శబ్ద , స్పర్శ, రూప రస గంధాలు.వాటిని పంచ బాణాలుగా ధరించిన తల్లికి నమస్కారము
Pancha than mathra sayaka She who has five bows of hearing ,touch , , sight , taste , and smell. Salutations to the mother
------------------------------------------------------------------------------------------------------------------
11. పంచతన్మాతసాయకా
ఈ నామంలో దేవి చేతిలోని బాణాలను వివరిస్తున్నాడు. పరమేశ్వరి చేతిలో
ఐదుబాణాలుంటాయి. అవి.
పంచసంఖ్యాని తన్మాత్రాణి శబ్దాదీని విషయాః, త దేవ తన్మాత్రమ్
తన్మాత్రలు ఇవి ఐదు. శబ్ద స్పర్శ రూప రస గంధాలు. పంచభూతాల యొక్క
సూక్ష్మరూపాలు. వీటివల్లనే భూతపంచకము సృష్టించబడింది. సృష్టి ప్రారంభం కాకముందు
కృతయుగానికి ఆరంభంలో నిరాకారుడు నిర్ణుణస్వరూపుడు అయిన పరబ్రహ్మ బిందు
రూపంలో ఉండేవాడు. గతంలో ప్రళయం సంభవించినప్పుడు కర్మ పరిపక్వము కాకుండా
తనలో లీనమైనటువంటి జీవరాసులన్నింటికి వాటి కర్మను క్షయం చేసి, వాటికి ముక్తి
కలిగించాలనే కోరికతో మళ్ళీ సృష్టి ప్రారంభించాలి అనుకున్నాడు. అప్పుడు తన నుంచి
కొంతశక్తిని బయటకు పంపాడు. అదేశక్తి. విమర్శాంశ. ఆ శక్తి నుండే ఈ జగత్తంతా
ఉద్భవించింది. ముందుగా శబ్ద స్పర్శ రూప రస గంధాలనబడే తన్మాత్రలు ఆవిర్భవించాయి.
వాటి నుంచి పంచభూతాలయిన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము ఉద్భవించాయి.
ఈ రకంగా పంచభూతాలు తన్మాత్రల నుంచి ఆవిర్భవించాయి. సృష్టి మొత్తం తన్మాత్రల
నుంచి ఆవిర్భవించింది. సృష్టి మొత్తం తన్మాత్రల ఆధారంగానే జరిగింది. అది ఎలాగంటే
పంచభూతాలు, తన్మాత్రలు కూడా పంచీకరణం చెందాయి. ఇవి గుణత్రయంతో కలియటం
చేత సృష్టి జరిగింది. ఈ రకంగా సృష్టికి ఆధారమైనవి తన్మాత్రలు. ఆ తన్మాత్రలు
బాణాలుగా పరమేశ్వరి కుడిచేతి యందు ఉంటాయి. వామకేశ్వరతంత్రంలో చెప్పినట్లుగా
శబ్ద స్పర్శా దయో బాణాః మన స్తస్యా౭. భవద్ధనుః
శబ్ద స్పర్శాదులే బాణాలు. మనస్సే ఆమె ధనుస్సు. కాదిమతంలో బాణాలు
మూడురకాలు అని చెప్పబడింది.
బాణా స్తు త్రివిధా ప్రోక్తాః స్థూల సూక్ష్మ పరత్వతః ।
స్థూలాః పుష్పమయాః సూక్ష్మాః మంత్రాత్మనః సమీరితాః
పరా శ్చ వాసనాయాం తు ప్రోక్తా
బాణాలు మూడురకాలు. 1. స్థూలములు 2. సూక్ష్మములు 8. పరములు
1 స్థూలములు పుష్పమయములు
2. సూక్ష్మములు గా మంత్రాత్మకములు
3. పరములు గ వాసనామయములు (ఆం ఈం ఊం)
కమలం కైరవం రక్తం కల్పారేస్టీవరే తథా ॥
సహకారక మిత్యుక్తం పుష్ప్రపంచక మీశ్వరీ!
కమలము - ఎర్రతామర
రక్తకైరవము - ఎర్రకలువ
కల్హారము - తెల్లకలువ
ఇందీవరము - నల్లకలువ
సహకారము మామిడిపూవు
ఇవి వసంత బూుతువులో తాపాన్ని రేకెత్తించేవి. కాలికాపురాణంలో ఈ బాణాలను
వివరిస్తూ
హర్షణం రోచనాఖ్యం చ మోహనం శోషణం తథా !
మారణం చే త్యమీ బాణా మునీనా మపి మోహదాః ॥
హర్షణము - హర్షము కలుగచేయునది
రోచనము - ప్రకాశింపచేయునది
మోహనము - మోహమును కలిగించునది
శోషణము - ఎండించునది, శోషిల్ల చేయునది
మారణము - నశింపచేయునది
ఇవి మునీశ్వరులకు కూడా మోహము చేకూరుస్తాయి.
జ్ఞానార్దవతంత్రంలో ఈ బాణాలను
క్రోభణం ద్రావణం దేవి ! తథాకర్షణ సంజ్ఞకం ॥
వశ్యోన్మాదౌ క్రమేణైవ నామాని పరమేశ్వరి! ॥
క్రోభణము - క్షోభమునకు సాధనమైనది
ద్రావణము పారద్రోలునది, కరిగించునది
ఆకర్షణము _ ఆకర్షణ సాధనమైన కర్మ విశేషము
వశ్యము - వశము చేసుకోతగినది.
ఉన్మాదము - ఉన్మధనము, పీడించునది, చంపునది
ఇవి శత్రుసంహారానికి ఉపయోగిస్తాయి. తంత్రరాజములో ఆ బాణాలను
మదనోన్మాదనౌ పశ్చా త్తథా మోహనదీపనౌ ॥
శోషణ శ్చేతి కథితా బాణాః పంచ వురోదితా ॥
మదనము న వసంతకాలము
ఉన్మాదము - పీడించునది, చంపునది
మోహనము గా మోహమును కలిగించునది
దీపనము గా రగుల్చునది, ప్రేరేపించునది
శోషణము _ ఎండించునది, శోషింపచేయునది
విరాగులకు కూడా తాపాన్ని కలుగచేసే సాధనాలు. పరమేశ్వరి చేతిలోని బాణాలు
మదనతాపాన్ని పెంచేవి. ద్రాం ద్రీం క్లీం బ్లూం సః అనేవి వీటి బీజాలు.
ఓం నమో భగవతే కామదేవాయ, ద్రాం ద్రాం ద్రావణ
బాణాయ, ద్రీం ద్రీం సందీపనబాణాయ, క్షీం క్షీం
సమ్మోహన బాణాయ, బ్లూం బ్లూం సంతాపనబాణా
య, సః సః వశీకరణబాణాయ, ట్రీం హ్రీం మదనా
వేశయావేశయ, సకలజనచిత్తం ద్రావయ ద్రావయ
కంపిత కపిత హుంఫట్ స్వాహా ॥
ఓంకారాన్ని ప్రణవము అంటారు. ప్రణవసహితమైన మంత్రాలే వైదికమంత్రాలు.
అవే మోక్షకారకాలు. ప్రణవంలేని మంత్రాలు తాంత్రికాలు
వైదికా ప్రణవైర్యు తాః । ప్రణవేన్యఃవిహీనం తు తాంత్రికా ఏవ ప్రకీర్తితాః
వేదమంత్రాలకు, మహామంత్రాలకు అన్నింటికీ ముందు ఓంకారముంటుంది. ఓం
నమశ్శివాయ, ఓం నమోనారాయణాయ. అయితే పరమేశ్వరి మంత్రమైన షోడశిలోగాని,
పంచదశిలోగాని ఓంకారముండదు. కాబట్టి ఇది మహామంత్రంకాదని, తాంత్రికమని
ఒక వాదన ఉంది. అది నిజంకాదు. శాస్త్రం తెలియకుండా చెప్పే మాటలవి. పంచదశీ
మహామంత్రానికి అర్ధం సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడు అని. షోడశిలో కూడా
పంచదశి మహామంత్రం పునరావృతమవుతుంది. కాబట్టి షోడశిమంత్రానికి కూడా అర్ధం
పరమేశ్వరుడు అనే. అదీగాక ఓంకారాన్ని ప్రణవము అంటారు. అలాగే శక్తిప్రణవాలు
ఐదున్నాయి. శ్రీం హ్రీం క్లీం ఐం సౌః పరమేశ్వరి మంత్రాలయిన బాల, షోడశిలలో
ఇవి ఉంటాయి. అందుచేతనే అవి మహామంత్రాలయినాయి. పంచదశి షోడశిమంత్రాల
మీద వివరణకు నా చే ప్రాయబడిన “శ్రీవిద్యా పంచదశి” చూడండి.
శ్రీచక్రంలోని ఎనిమిదవ ఆవరణలో బాణాలను పూజిస్తారు.
ఓంశ్రీంహ్రీంశ్రీయంరంలంవంసంద్రాంద్రీంక్షీంబ్లూంసః
సర్వజంభనేభ్యః । కామేశ్వరీ కామేశ్వరబాణేభ్యో నమః । బాణశక్తి శ్రీ పాదుకాం
పూజయామి నమః ॥
ఇక్కడ పరమేశ్వరి చేతిలోని ఐదు బాణాలు శ్రీం హ్రీం క్లీం ఐం సౌః అనేవి శక్తి
ప్రణవాలు. ఈ రకంగా పరమేశ్వరిచేతిలోని బాణాలను ఉపాసించే వాడు ముల్లోకాలను
వశం చేసుకోగలుగుతాడు. ఆ పరమేశ్వరి కృప ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.
వామకేశ్వరతంత్రంలో చెప్పినట్లుగా
పాశాంకుశా తదీయౌ తు రాగద్వేషాత్మకౌ స్మృతౌ
శబ్ద స్పర్శాదయో బాణాః మనః స్తస్యాభవ ద్ధనుః
కరణేంద్రియచక్రస్థాం దేవీం సంవిత్స్వరూపిణీం
విశ్వాహంకారపుష్పేణ పూజయే త్సర్వసిద్ధిభాక్ ॥
దేవి యొక్క పాశాంకుశాలే రాగద్వేషాలు. పంచతన్మాత్రలే బాణాలు. మనస్సే
ఆమెచేతిలోని ధనుస్సు. అంటే సాధకుడు రాగద్వేషాలను విడిచి, మనస్సును నిశ్చలంచేసి
అహంకారమనే పుష్ప్రంతో ఆ పరమేశ్వరిని అర్చించినట్లెతే అనగా అరిషడ్వర్గాలను జయించి
ఆ పరమేశ్వరిని ఆశ్రయించినట్లెతే సర్వసిదులూ పొందుతాడు.
శ్రీ మాత్రే నమః
Comments
Post a Comment