పదిరకాల పాలు..💐
శ్రీ మాత్రే నమః..!!🙏
పదిరకాల పాలు..💐
1. చనుబాలు.
2. ఆవుపాలు .
3. బర్రెపాలు .
4. గొర్రె పాలు.
5. మేక పాలు.
6. గుర్రం పాలు.
7. గాడిద పాలు.
8. ఒంటె పాలు.
9. ఏనుగు పాలు.
10. లేడి పాలు.
యజ్ఞోపవీతంలో ఎన్నిపోగులు ఉంటాయి.💐
యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి.
ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు.
వారు..
1. బ్రహ్మ .
2. అగ్ని.
3. అనంతుడు.
4. చంద్రుడు.
5. పితృ దేవతలు.
6. ప్రజాపతి.
7. వాయువు.
8. సూర్యుడు.
9. సూర్య దేవతలు.
అష్టాదశ ఆయుర్వేద సంహితలు..💐
1. చరక సంహిత.
2. శూశ్రుత సంహిత.
3. పరాశర సంహిత.
4. హరిత సంహిత.
5. అగ్నివేశ సంహిత.
6. చ్యవన సంహిత.
7. ఆత్రేయ సంహిత.
8. భోజ సంహిత.
9. బృగు సంహిత.
10. బెడ సంహిత.
11. అగస్త్య సంహిత.
12. వరాహ సంహిత.
13. అత్రి సంహిత.
14. నారయణ సంహిత.
15. చంద్ర సంహిత.
16. నారసింహ సంహిత.
17. శివ సంహిత.
18. సూర్య సంహిత.
గృహనిర్మాణం ఏవిధంగా చేపడితే సర్వసుఖాలు పొందుతారు.💐
1. ఈశాన్యంలో పూజలు, పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.
2. ఆగ్నేయంలో అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.
3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.
4. వాయువ్యంలో స్వతంత్రాభిలాష చిహ్నములు.
5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.
6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.
7. కుబేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.
8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.
ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని
ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.
వివిదఫలాల నైవేద్యం..ఫలితాలు..💐
కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) -
భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.
అరటి పండు -
భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది.
అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే
అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు.
చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యంగా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.
నేరెడు పండు. -
శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యంగా పెట్టి
ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి,
మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరోగ్య వంతులు అవుతారు.
ద్రాక్ష పండు. -
భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు
ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. .కార్యజయం లభిస్తుంది.
మామిడి పండు. -
మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది.
నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యంగా పెట్టిన
మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.
అంజూర పండు. -
భగవంతుడికి నైవేద్యం పెట్టిన అంజూరాపండును అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్నీ తొలగి ఆరోగ్యవంతులు అవుతారు.
సపోట పండు. -
సపోట పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్నీ తొలగిపోతాయి.
యాపిల్ పండు -
భగవంతుడికి యపిల్ పండుని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.
కమలా పండు. -
భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.
పనసపండు -
పనసపండుని దేవుడికి నైవేద్యంగా పెడితే
శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.
పంచవిధ సూతకములు అంటే..💐
1.జన్మ సూతకము.
2.మృత సుతకము.
3. రజః సూతకం.
4.అంటు (రొగ ) సూతకం.
5.శవదర్శన సూతకం.
దేవాలయాల వద్ద గృహనిర్మాణం చేయడం దోషమా.💐
శివాలయానికి నూరు బారుల దూరం లోపల, విష్ణువాలయముకు వెనక ఇరవై బారుల దూరం లోపల, శక్తి ఆలయముకు సమీపంలోను గృహనిర్మాణం చేయకూడదు.
దీనికి వ్యతిరేకంగా గృహ నిర్మాణం జరిగితే
సకల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు.
గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు ఏ వైపునైనా,
ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.
తాంబూలం సేవించేప్పుడు తమలపాకు తొడిమ చివర్లు ఎందుకు తుంచాలి.💐
తాంబులం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి.
ఎందుకంటే తొడిమను తినడం వ్యాదికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు.
కనుక తమలపాకు తొడిమలు, చివరలు తుంచిన తర్వాతే తాంబులం వేసుకొవడం ఆరోగ్య ప్రధమం.
అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుద్దిని
మందగింప చేస్తాయి.
అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి.
తొడిమలు, చివరలు తున్చివేసినా ఇంకా
అవి తమలపాకులో శేషించి ఉంటాయి.
💐శ్రీ మాత్రే నమః💐
Comments
Post a Comment