2020 ‘జన్మ’ బంధం

‘జన్మ’ బంధం


పూర్వజన్మ కర్మనే, ఈ జన్మ స్వరూప స్వభావాలు నిర్ధారిస్తోంటే, ఈ జన్మలో జరిగే, కర్మలు, వాటి అవసరాలు, దానిని అనుసరించి వుండాల్సిందే. ఈ జన్మ, గత జన్మ కర్మ ఫలితాన్ని అనుభవించడానికే అయితే, ఈ జన్మకు జీవితకాలం, అది, పూర్తి అయ్యేంత వరకే, నిర్ణయించాలి; ఈ జన్మ, కొత్త కర్మ నిర్వహించడానికి కాదు. ఒకవేళ, ఈ జన్మలో జరిగే, కొన్ని కొత్త కర్మలు,పునర్జన్మకు, కారణము అవుతూ,జన్మ పరంపరకు, కారణం అవుతోంది,అని అనుకుంటే, ఈ కొత్త కర్మలను కలిగించే ఆ "ఫ్రీవిల్" ఎక్కడ నుండి?


మనిషికి కొత్త కర్మలు చేసే స్వేచ్ఛ ఈ జన్మలో వుంటే, గత జన్మ కర్మలే గుర్తుంటే, వాటిని, మళ్ళీ, చేయడానికి,అవకాశం లేదు. తద్వారా, కేవలం మంచి కర్మలు చేయడానికే అవకాశం వుంటుంది. వర్తమాన జీవితం, గత జన్మ కర్మ శేష ఫలితాన్ని అనుభవించడానికే,అవసరం అయ్యింది, అని అనుకుంటే,ఆ గతమే ఈ జీవితాన్ని నడిపిస్తోంది అని అనుకుంటే, కొత్త కర్మలు చేసే విచక్షణా జ్ఞానం ఎలా వస్తుంది? గత జన్మ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కూడా, దానికి తగిన కర్మ, ఈ జన్మలో కూడా చేయాలి మరి. ఈ జన్మలోని కొత్త కర్మలు, మంచి పద్ధతిలో చేయాలి అంటే,గత జన్మ చెడు కర్మలు గుర్తుకు రావాలి. అప్పుడే, కర్మ ఫలం నుండి విడుదలయ్యే అవకాశం వుంది.


ఒకవేళ, కొత్త కార్యాలు చేసి, ఇంకాస్త కొత్త కర్మ ఫలం పాత దానికి కలిస్తే,ఇంకొక జన్మ దీనికి అవసరం అని అనుకుంటే, మనిషికి ‘కర్మాతీత స్వేచ్ఛనిజంగా వుంటే, జన్మ పరంపర నుండి విముక్తి కోరుకునే, ప్రతి మనిషి,ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకొని,తనకు వున్న స్వేచ్ఛతో', ఒక జన్మతోనే కర్మ ఫలితాన్ని సమూలంగా తీసివేసే అవకాశం వుంది.


మంచి కర్మ – చెడు కర్మ, అనే తేడానే లేకుండా, పునర్జన్మ అనివార్యం అయినపుడు, జన్మ రాహిత్యం ఎలా కలుగుతుంది? కర్మ నుండి స్వేచ్ఛ, ఈ జన్మకు లేదు. జన్మ రాహిత్యంలో కర్మకు స్థానం లేదు... ఈ రెండింటికి అదృశ్యం ఎప్పుడు? ఎలా? 'కర్మ – జన్మ – కర్మ'బంధానికి ప్రారంభ ఆధారం, ప్రారంభం ఎక్కడ అనేది తెలియాలి. ఆ రెండిటిలో మొదటిది ఏది? ఎందుకు? దానికి కర్త ఎవరు?


దేవుణ్ణి సృష్టికర్త అని భావిస్తే, సృష్టి నిర్వహణలో, కర్మ ఫలం మొత్తం, కర్తకే చెందాలి. సృష్టిలోని – సృష్టికర్తకు సంబంధం లేని – పాపం, కర్మ, దుష్టత్వం,మంచి గుణాలకు స్థానం ఏది? తను సృష్టించిన ప్రారంభ జీవిలో అపవిత్రతకు ఆస్కారం ఎలా వుంటుంది? చెడు,పాపం సృష్టిలోనికి ప్రవేశపెట్టగల, దుష్ట శక్తి ఏమైనా వుందా? విత్తనంలో లేని గుణం, తత్వం, జీవిలోకి ఎలా వచ్చింది,మధ్యలో? కారణ, కార్య, కర్మ – జన్మకు,ప్రారంభం ఎక్కడ? దానికి, ప్రారంభకులు ఎవరు? మనిషి, మాత్రం, కాదు కదా. సృష్టి – దేవుడు..., దేవుడే సృష్టి...,అంతా దేవుడే అని భావించినపుడు,మనిషి 'ఇష్టానికి' (ఫ్రీవిల్) స్థానం ఎక్కడ?


కారణ – కార్య సంబంధంగా జరిగిన,ప్రతి కర్మకు, కారణంతో పాటు, ఆ కర్మను నిర్వహించే, 'కర్త', కూడా, అవసరమే. సాక్ష్యం లేని పక్షంలో ఒక వ్యక్తి నిరపరాధి అని విడుదల అయితే, కర్మ సిద్ధాంతం ప్రకారం, 'నేరానికి శిక్ష' పునర్జన్మకు వాయిదా పడింది అని భావిస్తే...,అప్పుడు కూడా సాక్ష్యం ఉండదు. అలాకాకుండా, నేరస్తుడు, మరణ శిక్షతో,చంపబడితే..., లేదా జీవితకాల శిక్ష పడితే..., ఆ కర్మ ఫలం, పూర్తి అయినట్లేనా?


ఒకవేళ, ఈ జన్మలో, హత్యా నేరం నుండి, తప్పించుకుంటే, మరో జన్మ కోసం, అది ఈ జన్మ 'సూక్ష్మ శరీరంలో' దాగి వుండి, ఈ హత్యా నేర కర్మ ఫలాన్ని, అనుభవించుటకు, అతను, ఈ జన్మలో చంపబడ్డ వ్యక్తి చేతిలో,పునర్జన్మలో చంపబడాలా? ఒకవేళ అలా జరిగితే, ఈ ఇద్దరూ, కర్మ నుండి విముక్తి చెందినట్లే, అని భావించాలా?యుద్ధాలలో పాల్గొని, పరస్పర,విరుద్ధ దేశాల, తరఫున, పోరాడి,చనిపోయే..., లేదా శాశ్వతంగా వికలాంగులుగా మారే, సైనికులు – వ్యక్తిగతంగా, పూర్వజన్మ కర్మ ఫలాన్ని అనుభవిస్తారా? యుద్ధానికి కారణమైనపాలకుల, పూర్వజన్మ కర్మ ఫలాలు, ఎలా పని చేస్తాయి?


చంపినవాడు చంపబడినవాడు అనే ఉదాహరణను పరిగణంలోకి తీసుకొని,చంపిన వ్యక్తితో పాటు, చనిపోయిన వ్యక్తి కూడా, అప్పడివరకు, 'కర్త'లా పోరాడడం, అనే కార్య నిర్వహణ చేసినట్లే. చంపడం, చావడం కూడా,క్రియ/ఫంక్షన్‌గా భావిస్తే, అవి రెండూ కర్మలే. కర్మ (పని) చేసే వ్యక్తిని, కర్తగా భావిస్తే – చంపిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి, ఆ ఇద్దరూ, 'కర్మకు' కర్తలే. అలా,వాళ్ళిద్దరూ, కర్మ ఫలాన్ని అనుభవించవలసిన వాళ్ళే. దీనికి,పూర్వజన్మ కర్మ ఫలం, పని చేసినట్లా,ఇద్దరికి?


Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: