జ్యోతిష్య శాస్త్ర పాఠములు
గిరిజా జ్యోతిష్య విజ్ఞాన పరిసోధన సంస్థ ట్రస్టు
జ్యోతిష్య శాస్త్ర పాఠములు
జాతకముల ఆవశ్యకత - ప్రయోజనం.
పూర్వజన్మలలో జీవించిన కాలంలో తెలిసో తెలియకో చేసిన పాపపుణ్యాల ప్రాధాన్యం ఆధారంగా దైవ అనుగ్రహం, నిర్ణయం ప్రకారం జీవన
ప్రణాళికను - మంత్రానుష్టాన శక్తి, తపోబలం, దైవానుగ్రహముతో రుషులు దివ్యదృష్టితో తెలియపరచిన గ్రహ ఫలితాలను అధ్యయనం చేసిన జ్యోతిర్వేత్తలు మానవాళి మనుగడకు ముందు జాగ్రత్తలు తీసుకనేందుకు, దైవానుగ్రహముతో గ్రహదోషాల నుంచి ఉపశమనం పొందే మార్గాన్ని అన్వేషించి కృతకృత్యులయ్యారు.
జన్మించిన తేది సమయం ప్రదేశం ఆధారంగా
గుణించిన జన్మ కుండలిలోని గ్రహ స్థితి గతి యుతి పరస్పర వీక్షణలు, దశ అంతర్దశలు ఏ విధమైన ఫలితాలను అనుభూతి చెందాల్సిన పరిస్థితులను జాతకుడు తెలుసుకుని తదనుగుణంగా ధర్మమార్గంలో జీవనం సాగించాలి. ఆ జాతకం ఆధారంగా తల్లిదండ్రుల, తోబుట్టువుల, కాబోయే భార్య /భర్త జీవన పరిస్థితులను ముందుగా శుభ మరియు అశుభ యోగముల ఫలితాలను తెలియచేశారు.
దైవజ్ఞులు అందించిన గ్రహ స్థితి గతి యుతి పరస్పర వీక్షణ ఫలితాలు.
మొదటి భాగము
1) సూర్యుడు - శుక్రునితో కలసి, శుక్ర మిత్ర క్షేత్రములో వుంటే జాతకుని తండ్రి, వారసత్వపు ఆస్థి పొంది వుంటాడు.
2) సూర్య - శుక్రుల కలయిక, తండ్రి
భోగజీవియని తెలియ చేస్తున్నది. జాతకుని వైవాహిక జీవితము కొంత అసంతృప్తిగా వుంటుంది.
3) సూర్య - శనులు కలసివుంటే ప్రభుత్వ ఉద్యోగము చేయడముగాని, ప్రభుత్వ ధనము కొంత అనుభవించడము గాని జరుగుతుంది.
4) సూర్య కుజ రాహువులు కలసివున్న చర్మరోగములు కలిగివుంటారు.
5) సూర్యునకు రెండవ రాశిలో బుధ - చంద్రులు వున్న జాతకుడు సవతి తల్లిని కలిగి వుంటాడు.
6) సూర్యుడు - గురువుతో కలసియున్న జాతకుడు దైవ భక్తుడు మరియు నమ్మతగినవాడు అయివుంటాడు.
7) సూర్య - బుధ - రాహువులు ఒకే రాశిలో వుంటే జాతకుని తండ్రి కష్టజీవి అయివుంటాడు.
8) సూర్య - శనులు తులయందు వున్న జాతకుని జన్మ సమయమునగాని, జన్మించిన కోద్ది రోజులకు గాని తండ్రి అనేక కష్టములు పడుటగాని ధన నష్టము సంభవించును.
9) సూర్య - బుధలు కలసియున్న ఉన్నత విద్యయోగము.
10) సూర్య - శుక్రులు కలసియున్న జాతకునికి చెల్లెళ్ళు వుండరు.
11) సూర్య - కేతువులు కలసియున్న తండ్రికి వారసత్వపు ఆస్తి ఎక్కువగా నిలువదు. స్త్రీ జతకములో 42 - 43 సంవతరముల మధ్య భర్తకు అరిష్టములు కలుగును
12) సూర్య - కేతువులు కలసియుండి వీరికి రెండవ స్థానములో బుధ - శుక్రులు వున్న జాతకుని తండ్రికి రెండు వివాహములు జరుగును.
13) సూర్యుని వెనుక రాశిలో శని వున్న జాతకుడు తన తండ్రియొక్క వృత్తి, వ్యాపారములు, ఉద్యోగములను తాను నిర్వహించును.
14) సూర్య - శుక్రులు కలసియుండి, వీరికి సప్తమమున శని వున్న జాతకునికి బాల్యమునందు, పిత్రు వియోగము కాని, తండ్రికి దూరముగా పెరగడముగాని సంభవించును.
15) సూర్యుడు జలరాశిలో ఉన్నచో జాతకుడు, తన సంతానము వలన అనూహ్య సమస్యలు ఎదుర్కొనును.
16) సూర్య - శుక్ర - శనులు కలసియున్న జాతకుని తండ్రికి యోగము కలిసివచ్చి - జాతకుని 2 - 9 సంవత్సరముల మధ్య కాలంలో తండ్రికి గొప్పయోగము కలుగి అత్యంత సంపన్నుడు అగును.
17) సూర్య - శుక్ర - బుధలు కలసియున్న జాతకుడు గొప్ప ధనవంతుడు అగును. వారసత్వపు ఆస్తిలో కొంత వివాదములు కలుగును. బంధువులవల్ల కొన్ని సమస్యలు కలుగును.
18) సూర్య - శుక్రులు ఒకే నక్షత్రము నుండి 3 డిగ్రీలు తేడా ఉన్నచో జాతకునికి స్త్రీ సంతానము ఎక్కువగా ఉండును.
19) చంద్రునికి సప్తమంలో శుక్రుడు ఉన్నచో జాతకునికి యోగభంగము అగును.
20) కుజ గురువులు మకరరాశిలోవున్న జాతకుడు వారసత్వపు భూములు, ఆస్తులు పొందును.
21) కుజ - బుధలు పరివర్తనము చెందిన సోదరుని ద్వారా సహాయము పొందును.
22) కుజ - శనులు కలసియున్న జాతకుడు ఉద్యోగము పొందుటలో కొంత కష్టములు పడును.
23) కుజునికి ద్వాదశ మందు శుక్రుడు వున్న జాతకుని వివాహము ఆలస్యమగును. అతని తమ్ముడికి ముందు వివాహము జరుగును.
24) బుధుడు విద్యకారకుడు. బుధుడు శత్రు రాశిలో వున్న, బుద్ధుని కి తృతీయ రాశిలో రాహువు - తరువాత రాశిలో కుజుడు వున్న జాతకుని విద్యకు ఆటంకములు కలుగును.
25) బుధునికి సప్తమంలో చంద్రుడు ఉన్నచో, జాతకుని తల్లి అపఖ్యాతిపాలగును.. లేదా దీర్ఘరోగము వచ్చును.
26) బుధుడు ధనుస్సు రాశిలో ఉన్నచో బుద్ధి, చురుకుతనము కోల్పోవును. తల్లితండ్రుల పెంపకము సరిగా ఉండదు.
27) జాతక చక్రములో గురుడు వున్న రాశి నుంచి ఒక పాదము వెనుకకు వేసిన అది జాతకుని గత జన్మను తెలియచేయును.
28) గురునకు 12వ రాశిలో రాహువు ఉన్నచో అట్టి జాతకుడు తన కోరికలు తీర్చుకొనుటకు గత జన్మలో అనేక పాపములు చేసియుండును. దీని పలితముగా ఈ జన్మలో తండ్రి మరణము లేదా తండ్రికి దూరముగా పెరగడము, సొంత గృహము లేకపోవడము, బంధువులతో మరియు భార్యతో మరియు తల్లితో కలహములు సంభవించును.
ఈదోష పరిహరమునకు నిత్యం నారాయణ అష్టక్షరి జరిపించ వలయును.
29) గురునకు ద్వాదశంలో గ్రహములు లేనిచో జాతకుడు ప్రధమ సంతానము అని గ్రహింపవలయును.
30) గురు - కుజులు సమసప్తకములలో ఉన్నచో జాతకుని వివాహ జీవితము దుఖప్రధము అవుతుంది.
31) గురునికి సప్తమంలో శని వున్న జాతకుడు సత్వ గుణము కలవాడగును. బాల్యములో కష్టములు 29 - 33 -37 సంవత్సరములలో ఇబ్బందులు అనుభవించుట జరుగుతుంది.
30- 36 -42 - 43 సంవత్సరములలో యోగించును.
32) గురుడు వక్రించిన జాతకుడు దూరప్రాంతములో గొప్ప ఉద్యోగము చేయును.
33) గురు - సూర్యులు సమసప్తకములలో వున్న జాతకుని తండ్రి ప్రసిద్ధ వ్యక్తి అగును.
34) గురునకు పంచమంలో చంద్ర - రాహువులు వున్న మాతృ సౌఖ్యము తక్కువ.
35) గురునకు సప్తమంలో శుక్ర - శనులు వున్న గొప్పజాతకము.
36) గురు - శుక్రులు కలసియుండి, శుక్రుడు, చంద్రునితో పరివర్తనము చెందినచో భార్య
కపట ప్రవర్తన కలదైయుండును.
37) గురువునకు అనంతర రాశిలో కుజుడు ఉన్నచో జాతకునికి తమ్ముడు ఉండును.
38) గురువునకు రెండవ రాశిలో రాహువు వున్న పురాతన గృహములో జన్మించును.
39) గురు - బుధ - కుజులు కలసియున్న డాక్టర్ అగును లేదా శస్త్రచికిత్స నిపుణుడు అగును.
40) గురు - శుక్రలు పరస్పరము 6 - 8 స్థానములలో వున్న జాతకుడు కొంత కాలము భార్యతో ఎడబాటు పొందును.
41) గురు - శుక్రులు కలసియున్న జాతకునికి ఒక సోదరి ఉండును.
42) వక్రించిన గురుని, శుక్రుడు చూచినచో జాతకుడు తాను జన్మించిన గృహమునందు గాని, నగరము నందు గాని ఉండడు. దూరప్రాంతలములయందు నివసించును.
43) గురు - శనుల పరివర్తనము స్వతంత్ర జీవనము కలిగించును.
44) మీన గురువుకి ద్వితీయంలో శని, కేతువులు వున్న సన్యాసయోగము, లేదా వైవాహిక జీవితములో అసంతృప్తి, సంతానము లేకపోవడము జరుగును.
45) గురు - బుధ - శుక్రులు సూర్యునితో కలసిన తండ్రి ధనికుడు - వ్యాపారమునందు లాభములు పొందువాడు అగును.
46) గురువు నుంచి వెనుక రాశిలో శని, ముందు రాశిలో కేతువు ఉన్నచో జాతకునికి ఉదరకోశ వ్యాధులు ఉండును.
47) గురువు నుంచి ద్వాదశంలో రవి వున్న, జాతకుడు మధ్య వయసు వరకు మాత్రమే జీవించును.
48) తుల - వృషభ రాశులలో గురు - శుక్రులు కలసివున్న గొప్ప వంశములో జన్మించుటగాని, ధనవంతుడు గాని అగును.
49) గురుని పై శని దృష్టివున్న జాతకుడు ఈశ్వర అనుగ్రహము వల్ల జన్మించినవాడు అని తెలియుచున్నది.
50) గురువు నుంచి వెనుక రాశిలో శుక్రుడు వున్న షుగర్ వ్యాధి గాని - ఆసనరోగము గాని వచ్చును.
గురు - శుక్రులు కలిసియున్న జాతకునికి ఒక మగ సంతానము ఉండును.
51) శుక్రునికి ద్వదశంలో గురుడువున్న వైవాహిక జీవితం కొంత అసంతృప్తిగా ఉండును.
52) శుక్రునికి రెండవ రాశిలో కుజుడు వున్న వివాహము ఆలస్యమగును.
53) చంద్ర - శుక్ర - శనులు ఒకే రాశి యందువున్న భార్యకు తరచుగా అనారోగ్యము కలుగును.
54) శని నుంచి రెండవ రాశిలో రాహువు వున్నచో జాతకుని జీవనము స్వల్పస్థాయి నుంచి ప్రారంభము అగును. అదీ రెండు లేక మూడు రాశుల తరువాత ముందుగ చంద్రుడు ఉన్నచో, జాతకుడు 36 సంవత్సరముల వరకు స్థిరమయిన జీవన పరిస్థితులను పొందలేడు. అనేక వ్యాపారములు చేయును.
55) శనికి రెండవ రాశిలో సూర్య - బుధ - శుక్రులు ఉన్నచో గౌరవప్రదమైన మంచి ఉద్యోగము పొందును.
56) శనికి ద్వితీయ - ద్వాదశ రాశులలో గ్రహములు ఏవీ లేనిచో జాతకుడు అనేక ఉద్యోగములు చేయును, స్థిరత్వము ఉండదు.
57) శని - కేతువులు సింహమునందు వున్న తండ్రి ప్రభుత్వ ఉద్యోగము చేయును. వక్రించిన శని వెనుక కేతువు వున్న జాతకుడు మత సంబంధ ఉద్యోగము చేయును.
58) శని - శుక్రులు పరివర్తన పొందిన జాతకుడు అనేక వృత్తి - ఉద్యోగములు, వ్యాపారములు చేయును.
59) కుజ - శనుల వెనుక చంద్రుడు వున్న జాతకుడు గత జన్మలో తల్లి శాపము పొందినవాడు అని తెలియచున్నది.
60) శనికి అనంతర రాశులలో చంద్రుడు - కేతువు సన్యాస జీవితమును సూచించును. తీర్ధయాత్రల వలన అనేక విషయములు తెలుసుకోనును.
61) శనికి ఏకాదశంలో సూర్యుడు వున్న ప్రభుత్వ ఉద్యోగము. సప్తమంలో సూర్యుడు వున్న స్వతంత్ర జీవనము గడుపును.
62) శని ధనుస్సులో వుండి ద్వితీయ - ద్వదశాలలో గ్రహములు లేనిచో జాతకునికి తముళ్ళు వుండరు. సామాన్య విద్య. చెడు స్నేహములు. దోష పరిహరమునకు నిత్యం నరసింహ కవచము పఠించాలి.
63) శని - గురువులు కలసియుండి వీరికి రెండవ రాశిలో కేతువు వున్న జాతకుడు దైవానుగ్రహము కలవాడు అగును.
64) శని - శుక్రులు కలసి వృషభములో వున్న జాతకుడు ధనవంతుడు, ప్రసిద్ధుడు అగును. మంచి వాహనము ఉండును.
65) శనికి సప్తమంలో రవి - శుక్రులు వున్న పితృ సౌఖ్యము తక్కువ.
66) శని - శుక్ర - రాహువులు కలసిన అక్రమ సంపాదన.
67) శని - శుక్ర సమసప్తకము సుఖప్రదమైన జీవితము.
68) శనికి రెండవ రాశిలో చంద్రుడు వున్న విదేశములలో గాని, దూరప్రాంతములలో గాని ఉద్యోగము చేయును.
69) శని - గురుల పరివర్తన స్వతంత్ర జీవనము. ధనుస్సు - మీన రాశులలో కలసిననూ ఈ పలితములే కలుగును.
70) శని - కేతువులు మేషములో వుండి మీనములో గురుడు వుండిన జాతకుడు బ్రహ్మచారిగా ఉండును, వేరొక స్త్రీతో తోకలసియుండును. దీర్ఘాయువు కలుగుతుంది.
71) శని - గురు - చంద్రుడు కలసియున్న ఉపాద్యాయ వృత్తి. వీరు వక్రించియున్న అనేక వృతి వ్యాపారములు చేయును.
72) శని - రాహువుల మధ్య గురుడు వున్న జాతకుడు 39 - 47 సంవత్సరముల మధ్య అనారోగ్యము పాలగును. ఇతని కుమారుడు తండ్రి వ్యాపారము చేయును.
73) శని - కుజులు కలసిన జాతకుడు గూఢముగ (రహస్యంగా) పాపములు చేయును. పరహింసకుడు.
74) శనికి ద్వాదశంలో కుజుడు, ద్వతీయంలో రవి కేతువులున్న బంధు ద్వేషి. సామాన్య జీవితము గడుపుతారు.
75) శని సింహ రాశిలో వున్న తండ్రియొక్క వృత్తి, తండ్రి లక్షణములు, స్వభావమును పొందును.
76) శని - రవి ఇద్దరూ ఉచ్చస్థితిని పొందితే జాతకునికి పితృ సౌఖ్యము వుండదు.
77) శని - శుక్రులు కలసి తులలో వుండి , కన్యలో బుధుడు ఉన్నచో గొప్ప ధనయోగము, దీర్ఘాయువు ప్రాప్తించును.
78) శని - శుక్రులు పరివర్తన పొంది, శుక్రుడు కుజునితో కలసియున్న రెండు వివాహములు జరుగును. ఇరువురు జీవించియుందురు.
79) శని - రవి కలసియుండి, వీరికి ద్వాదశంలో రాహువు వున్న బంధన యోగము కలుగును
జైలులో జీవితం గడుపవలసి వచ్చును.
80) శనికి అనంతర రాశులలో గురుడు వున్న జాతకుడు గొప్పవాడు అగును.
81) శనికి అనంతర రాసులలో చంద్ర - బుధ - కేతువులు వున్న జాతకుడు 35 సంవత్సరంల వరకు స్థిర జీవనము పొందలేడు.
82) శని - చంద్రుడు - శుక్రుడు స్వస్థానములలో వున్న కనీసము 10 లక్షలకు అధిపతి అగును, అనేక మందిని పోషించును.
83) శని - రవి సింహములో వున్న ప్రభుత్వ ఉద్యోగము చేయును.
84) శని - శుక్రులు కలసియుండి, వీరికి ద్వాదశంలో కుజుడు వున్న గర్భాకోస వ్యాధులు వచ్చును.
85) శని - శుక్రులు కలసి వృషభంలో వున్న గొప్ప ఉద్యోగము పొందుతారు.
86) శనికి రెండవ రాశిల చంద్రుడు మూడులో కేతువు ఉన్నచో వైరాగ్యము కలవాడు అగును.
87) శనికి రెండు వ ఇంట గురువు - రవి వున్న జాతకుడు గొప్ప సంస్థలలో ఉద్యోగము చేయును.
88) రాహువుకు రెండవ స్థానములో గురువు వున్న జాతకుడు తన తల్లితండ్రులకు ఒకే కుమారుడు అయివుండును.
89) రాహువు గురునిచే చూడబడిన జాతకుడు తాతను కలిగియుండును.
90) రాహువు తులలో వున్న జాతకుడు దూర ప్రయణములు చేయును. అనేక విద్యలు నేర్చుకొనును. 3 - 4 బాషలు వచ్చును, 40 - 42 సంవత్సరములలో స్వగృహ యోగము కలుగును. ఇద్దరు సంతనము కలుగును.
91) కేతువుతో శుక్రుడు కలసియున్న జాతకుని భార్య 45 - 46 సంవత్సరములలో మనోవేదన చెందుతుంది.
రెండవ భాగము
1. లగ్నమున శని యున్న లేక చూచిన జాతకుడు వాతా రోగి, దుర్భలుడు, స్త్రీ లోలుడు అగును. కుజుడు లగ్నగతుడు అయిననూ, చూచినను జాతకుడు ఆయుధ, వ్రణ, స్పోటకాగ్ని, మేహరోగి అగును.
2. లగ్నము శని ద్రేక్కాణమయి అచట శని వుండి కుజునితో గాని రాహువుతోగాని కూడి వున్న జాతకుడు కుంటివాడు అగును.
3. 4, 6, 8, 12 భావములలో ఎందైనా సూర్య, చంద్ర, అంగారకులు చేరియుండి పాపులచే గాని, శత్రు గ్రహములచే గాని చూడబడిన జాతకుడు చెవిటివాడు అగును.
4. అష్టమమున శని, కుజ, రాహువులు చేరిన జాతకునికి నాసిక భంగము అగును.
5. అష్టమమున కుజుడు వుండి శని చేత చూడబడిన జాతకునకు కలహము వలన గాని రణమునందు గాని శిరఛ్ఛేదన కలుగును.
6. లగ్నమున రవి, రాహువులు వున్న జాతకుని తల చిన్నది గాను, శరీరము నిండుగా పొడువుగాను వుండును, అశ్వ గండము కలుగును.
7. ద్వితీయాధిపతి గురువుతో గాని, చంద్రునితో గాని కూడి 6, 8, 12 భావములయందు నీచను జాతకుడు మూగవాడు అగును.
8. సూర్యుడు రాహువుతో గాని కేతువుతో గాని అష్టమము నందు వున్న జాతకునకు తల గొరిగింపబడును.
9. లగ్నాధిపతితో బుధుడు గాని, కుజుడు గాని కూడి కన్య, మిధునముల యందు వున్నా,
లగ్నాధిపతి కుజునితో కలసి బుధుని తో చూడబడినను జతకునకు ఆసన రోగము వచ్చును.
10. లగ్నము నందు రాహువు గాని, కేతువుగాని వుండి 6 వ అధిపతి 12 నందు వున్నయెడల రాహు దశలో గాని కేతు దశలో గాని లగ్నాది పతి దశలో గాని వ్రణ భాధ కలుగును. మంచి స్థానములయందువున్నపటికీ చంద్ర, రాహువులు
కలసియున్నపుడు ఆయా దశ భుక్తుల యందు అంగ వైకల్యము కలుగును.
11. లగ్నమందు గాని, కోణముల యందుగాని శని వుండి రాహువు పాప గ్రహములతో కలసి యున్నను, లగ్నమందు రాహువు వున్నను సర్పముల వల్లకాని, చోరుల వల్లకాని,
చంఢాలుర వల్లకాని, భయము కలుగును.
12. లగ్నమునందు శని, రాహువులు వున్న పిశాచ బాధలు కలుగును. రవి వున్నను, కుజుడు చూచిన ఎడల శ్వాస సంబంధ రోగములు కలుగును. పాప గ్రహములు చూచినను ఈ పలితములు కలుగును.
13. లగ్నాధిపతి పాప గ్రహమై రాహువుతో కేంద్రము నందు వున్నను, దశమము నందు పాప గ్రహములు వున్నను, లగ్నము నందు నీచ గ్రహము వుండి రవి చూచినను అపకీర్తి కలవాడు అగును.
14. లగ్నమునందు రవి వున్న ఎర్రని నేత్రములు కలవాడును, కోప స్వభావం కలవాడు, వాతపిత్త దోషములు కలవాడు అగును. విదేశముల నుండి ధనము అర్జించును.
15. కుజుడు లగ్నమునందు వున్న మికిలి కోపము కలవాడు, నేత్ర, శిరో రోగములు కలవాడు,
దండముల వలన, అగ్ని వలన బాధలు కలవాడు, వ్రణ బాధలు కలవాడు, మతి బ్రమణము కలవాడు, మికిలి సాహసము కలవాడు, ఉగ్రత్వము కలవాడు అగును.
16. లగ్నము నందు బుధుడు వున్నచో నమ్రత కలవాడు, ఉదార బుద్ధి కలవాడు,
ఆచారములు కలవాడు అగును.
బుద్ధిమంతుడు, విద్వాంసుడు, కళా శాస్త్రము తేలిసిన వాడు అగును, విశేష సంతానము కలవాడు, ఎరుపు రంగు కలవాడు,
పొట్టివాడు, ఫైత్య శరీరము కలవాడు, మంచి స్వభావము కలవాడు, మర్యాదలను చేయుచూ, ధీర్ఘాయువు కలవాడు అగును.
17. లగ్నమునందు గురువు వున్న యెడల అనేక శాస్త్రములు తెలిసినవాడు, సుఖ ప్రదమయిన, యోగ్యమయిన జీవనము కలవాడు, పుణ్యాత్ముడు,
రాజపూజ్యత, సుందర శరీరము, దేహ ధారుడ్యము కలిగి, బహు యోగ్యుడు, వాత శరీర తత్వం కలవాడు, స్థూల శరీరము కలవాడు,
ధనవంతుడు, పండితుడు అగును.
18. లగ్నమునందు శుక్రుడు వున్న ఎడల రెండు మూడు విద్యల యందు ప్రావీణ్యత,
సాహిత్యము, యుక్తి - ప్రయుక్తులు కలవాడు, కామము కలవాడు, రాజులవల్ల ధనలాభము పొందంవాడు,
అందమయినవాడు, పొట్టివాడు,
శాస్త్రజ్ఞుడు, కవి, మేహ శరీరము కలవాడు, మంచి స్నేహితులు కలవాడు
స్త్రీల యందు ప్రీతీ కలవాడు అగును.
19. లగ్నమునందు శని యున్న, నిత్య దరిద్రుడు, రోగి, మన్మధ పరతంత్రుడు, బాల్యము నందు వ్యాధి పీడితుడు, నీచ సంభాషణ చేయువాడు, మలినుడు అగును.
తుల, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశులలో ఒకటి లగ్నమయి అందు శని వున్న యెడల రాజతుల్యుడు, గ్రామపురాధీశుడు,
సుందరాంగుడు అగును.
పై రాశులు కాకుండా మిగతా రాశులు జన్మ లగ్నమయిననూ, శని వున్ననూ అట్టి జాతకుడు, సుఖము లేనివాడు, నీచుడు,
మంద బుద్ధి కలవాడు, కపటము, పర స్త్రీ సంభోగమునందు ఆసక్తి కలవాడు, సంతాన విచారము కలవాడగును.
20. లగ్నమునందు రాహువు వున్నయెడల గంభీరముగా వుండువాడు, ఔదార్యము కలవాడు, మలిన వస్త్రములు కలిగినవాడు,
ధనమునందు ఆసక్తి కలవాడు, దుస్సాహసము
చేయువాడు, కృష్ణ వర్ణము కలవాడు, పొడుగరి, పట్టుదల కలవాడు, పరస్త్రీ సంభోగము కలవాడు, వేష భాషలు కలవాడు, దుష్ట స్వభావము కలవాడు,
వంచకుడు, ధనవ్యయము చేయువాడు, రోగి అగును.
21. లగ్నము నందు కేతువు వున్నయెడల తల్లి లేనివాడు, కులము నశింప చేయువాడు అగును, హృదయ రోగముచే బాధపడువాడు
చిత్ర వర్ణము కలవాడు, కొంచము పొట్టివాడు,
పారమార్ధిక చింత కలవాడు, చురుకుతనము కలవాడు అగును.
22. లగ్నాధిపతి తృతీయ భావమునందు వున్న ఇద్దరు భార్యలు కలిగినవాడు అగును.
పంచమమందున్న ప్రధమ సంతానము నష్టము కలవాడు, క్రోధము కలవాడగును.
సప్తమము నందు లగ్నదిపతి వున్న వాని భార్య జీవించి ఉండదు.
23. ద్వితీయము నందు పాప గ్రహములు వున్నను, ద్వితీయాధిపతి శనిచే చూడ బడినను, ద్వితీయాధిపతి పాపులతో కలసినాను, పాప క్షేత్రము నందు వున్నను జాతకుడు నేత్రముల బాధను పొందును.
24. ద్వాదశ స్థానము నందు కుజుడు వున్నయెడల ఎడమ కన్ను, శని యున్నయెడల కుడి కన్ను పోవును.
సింహ లగ్నమయి లగ్నము నందు రవి, చంద్రులు వుండి, శని, కుజులు చూచిన ఎడల రెండు నేత్రములు పోవును.
25. ద్వితీయాధిపతి, గురువు కలసి 6, 12 స్థానములయందు వున్న జాతకుడు మూగవాడు అగును.
26. కుజుడు పాపుల చేత చూడబడినను,
పాపులతో కూడినను, సోదరీలు కలిగి నశింతురు. సోదర స్థానములందు పాపగ్రహములు వున్నను, సోదర స్థానము పాపగ్రహ స్థానమయి స్వక్షేత్రము నందు వున్నను, పాప గ్రహములచే చూడబడినను, పాప గ్రహముల మధ్య వున్నను, సోదరులు వుండరు.
27. తృతీయ భావ అధిపతి లగ్నమునందు
వున్నయెడల ఆసన రోగము, స్తులకాయము గలవాడు. పరభార్యల ధనమునందు ప్రీతీ కలవాడు. స్వల్ప ఆరంభము కలవాడ. సుఖము లేనివాడు. స్వార్జితమైన ధనము కలవాడు,
మూర్ఖుడు, సాహసి, పర సేవకుడు అయి ఉండును.
28. శుక్రునకు సప్తమములో పాప గ్రహము వున్నను, చంద్రునకు సప్తమములో లో పాప గ్రహము వున్నను, మాతృ స్థానము నందు పాప గ్రహము వున్నాను,చూడబడినను మాతృ నాశనము కలుగును.
మాతృ స్థానము నందు శని వుండి పాప గ్రహములచే చూడబడినను, క్షీణ చంద్రుడు 6, 12 స్థానముల యందు వున్నను, పాప గ్రహములచే చూడబడినను, పాప గ్రహముల మధ్య వున్నను మాతృ మారకము కలుగును.
29. లగ్నమున గురుడు వుండి 6వ ఇంట చంద్రుడు వుండి శనిచే చూడబడిన యెడల ఏడు రోజుల లోగా తల్లికి మరణము కలుగును.
సూర్యునకు ఏడవ ఇంట శనియు, ఎనిమిదవ ఇంట కుజుడు వున్నయెడల తండ్రికి మరణము కలుగును.
అలాగే చంద్రునకు 7 ఇంట శని, 8వ ఇంట గురువు వున్నను తల్లి మరణము పొందును. శని, కుజులు చంద్రునకు 7వ ఇంట వున్నను, చంద్రునకు 7వ ఇంట పాప గ్రహములు వున్నను తల్లికి మరణము సంభవించును.
30. చతుర్ధాదిపతి 6, 8, 12 స్థానముల యందు బలము లేక వున్నను, కుజ, రవులలో ఒకరు చతుర్ధము నందు వున్నాను, మాతృ మరణము కలుగును.
మాతృ స్థానదిపతికి 6, 8, 12 స్థానముల యందు ఉన్నవారిలో ఎవరి దశ వచ్చినను మాతృ మరణము కలుగును.
31. లగ్నమున గురుడు వుండి 6వ ఇంట చంద్రుడు వుండి శనిచే చూడబడిన యెడల 7 రోజులలోగ తల్లికి మరణము కలుగును.
సూర్యునకు 7వ ఇంట శనియు, 8వ ఇంట కుజుడు వున్నయెడల తండ్రికి మరణము కలుగును.
అలాగే చంద్రునకు 7వ ఇంట శని, 8వ ఇంట గురువు వున్నను తల్లి మరణము పొందును. శని, కుజులు చంద్రునకు 7వ ఇంట వున్నను, చంద్రునకు 7వ ఇంట పాప గ్రహములు వున్నను తల్లికి మరణము కలుగును.
32. చతుర్ధాదిపతి 6, 8, 12 స్థానముల యందు బలము లేక వున్నను, కుజ, రవులలో ఒకరు చతుర్ధము నందు వున్నను మాతృ మరణము కలుగును.
మాతృ స్థానదిపతికి 6, 8, 12 స్థానముల యందు ఉన్నవారిలో ఎవరి దశ వచ్చినను మాతృ మరణము కలుగును.
33. పాప గ్రహములు అన్నియు 6వ స్థానమునందు వున్న తల్లి జీవించి శిశువు మృతి చెందును. లగ్న 7,8 లలో పాప గ్రహములు అన్నియు వున్నాను శిశువు జీవించి తల్లి మరణించును.
34.పాప గ్రహముల చంద్రునుకు
7 నందుగాని 8నందు గాని 9 నందుగాని వున్న మాత శిశు మరణములు కలుగును. చంద్రుడు పాప గ్రహములు కలిగసినను, చూడబడినను మాతృ మరణము కలుగును.
35. చతుర్ధ భావముగాని ఆ భావదిపతి గాని, చంద్రుడుగాని పాప గ్రహముల మద్య వుండి, శుభ గ్రహముల దృష్టి లేనియెడల మాతృ మారకము కలుగును.
36. చతుర్ధమందు రవి ఉన్న ఎడల ధన, వాహన సౌఖ్యము లేనివాడు తండ్రికి వ్యతిరేకముగా సంచరించువాడు, స్థిరము లేని నివాసము గలవాడు, మాతృ సౌఖ్యము లేనివాడు, భూ వ్యయము చేయువాడు అగును.
37. కుజుడు చతుర్ధమునందు వున్నను మూర్ఖుడు, దీనుడు, స్వల్ప బందువులు గలవాడు, మిక్కిలి దుఖము అనుభవించుఃవాడును, పరదేశనివాసి, నీచును సేవించువాడు, పర గృహముల
యందు భోజనము చేయువాడు, చంచల స్వభావము కలవాడు, అల్ప భోగి, మాత్రు సౌఖ్యము లేనివాడు, విద్య యందు విఘ్నములు కలవాడు అగును.
38.చతుర్ధము నందు శని యున్న క్రమ క్రమముగా బందువులు నసించెదరు. గృహములు, భూములు, మొదలుగునవి నశించును, సౌఖ్యము లేనివాడై పరస్థలముల యందు నివసించును, మాతృ సౌఖ్యము లేనివాడు, ఎల్లప్పుడు దుఖము అనుభవించువాడు, భూములు లేనివాడు అగును.
39. చతుర్ధమునందు రాహువు వున్న ఎడల బంధువుల వల్లను పుత్రులవల్లను, సౌఖ్యము లేనివాడును, మతిబ్రమణము గలవాడును,
స్వల్ప భూములు కలవాడును, పిసినత్వము
గలవాడును, బందు ద్వేషి అగును.
40. చతుర్ధమునందు కేతువు వున్నయెడల మిత్రుల సౌఖ్యము లేనివాడును, పితృ నష్టము కలవాడును, బందువులు స్వల్పముగా కలవాడు, మాతృ సౌఖ్యము లేనివాడు, తొందరపాటు కలవాడు, మలినుడు, దుష్ట స్వభావము కలవాడు, ఉచ్ఛ యందు వున్న ఎడల సౌఖ్యము కలవాడు అగును.
41. చతుర్ధధిపతి అష్టమము నందు గాని వ్యయము నందు గాని వున్నయెడల సుఖహీనుడు, నపుంసకుడు, జారత్వము వల్ల పుట్టినవాడు గాని అగును.
42. పుత్ర భావాదిపతి పాపనవాంశ యందువున్నను ఆస్తంగత్వమును పొంది, నీచయందు వున్నను, పాపగ్రహములచే చూడబడినను, పాప స్థానములయందు వున్నను జాతకునకు సంతాననష్టము కలుగును.
43. పుత్రభావము నందు రాహువు వుండి పుత్ర భావదిపతితో కలసి శుభ గ్రహములచే చూడబడనియెడల జాతకుని పుత్రుడు సర్ప దంష్టృము వలన మృతిని పొందును.
44. గురుడు రాహువుతో కలసి పుత్ర స్థానాధిపతి బలహీనుడు అయివుండి లగ్నాధిపతి కుజునితో కలసి వున్న ఎడల సర్ప శాపమువలన సంతాన నష్టము కలుగును.
45. స్త్రీ రాశుల యందు కుజుడు వున్న ఎడల స్త్రీ సంతానము మాత్రము కలుగును. కర్కాటము నందు కుజుడు వున్నయెడల స్వల్ప పుత్ర సంతానము కలుగును.
46.లగ్నాధిపతి శత్రు స్థానము నందు వుండి, శత్రు స్థానదిపతి లగ్నమునందు వుండి, శనితో గాని, రాహువుతో గాని, గుళికునితో గాని కూడినఎడల పాప గ్రహములతో చూడబడిన ఎడల జాతకునకు శత్రు వృద్ధి ఎకువగా ఉండును.
47. శత్రు స్థానమునందు శుభ గ్రహములు వున్న ఎడల జాతకునకు శత్రువులు ఎవరూ వుండరు. శత్రు స్థానము నందు పాప గ్రహములు వున్న ఎడల శత్రు వృది ఎకువగా ఉండును.
48. రాహువు 6 వ స్థానము నందు వున్న యెడల ధైర్యవంతుడు, మూలవ్యాధి కలవాడు అగును. శని 6 న వున్న ఎడల జయమును పొందువాడు, వాత రోగములు గలవాడు అగును.
49. 6వ భావము నందు కుజుడు వున్న కలహించువాడును, స్పోటక బాధగలవాడు అగును, చంద్రుడు 6, 12 అధిపతులతో గలిసిన యెడల బాల్యము నందు నలత శరీరము గలవాడు అగును.
50. 6వ అధిపతి గాని, 8వ అధిపతి గాని, లగ్నము నందు వున్నయెడల రోగ శరీరము కలవాడు అగును. రోగ స్థానములందు పాప గ్రహములు వున్నను, రాహువుతోగాని, శనితో గాని కలసియున్నను రోగము చే బాధ పడును.
51. 6 నందు చంద్రుడు వుండి మాంది శని, రాహువులతో గలసిన ఎడల 55 వ సంవతరములో కుష్టు రోగము కలుగును.
52. 1, 6 అధిపతులు శనితో కలసి కేంద్ర కోణముల యందు వున్నను, రాహువుతో గాని , కేతువుతో గాని కలసివున్నను (ఖైదు జీవితము) బంధనయోగము కలదు.
53. 6వ ఇంట కుజ, రాహువులు వున్న బుడ్డ దిగును. , 7వ ఇంట వున్న వాని భార్య కుసుమ రోగము కలిగియుండును.
54. సప్తమాధిపతి గురునితోను, పంచామాధిపతి తోను కూడియుండిన రెండు కళత్రములు కలుగును. సప్తమాధిపతి శని, రాహువులతో గూడిన ఎడల ముగ్గురు భార్యలు వుందురు. మొదటి భార్యకు సంతాన నష్టము, రెండవ
భార్యకు, మూడవ భార్యకు గర్భ స్రావము కలుగును. శుక్రుడు ద్విస్వభావ రాశియందు కుజ, రాహువులతో గూడిన ముగ్గురు భార్యలు వుందురు.
55. క్షీణ చంద్రుడు పాపులతో కలసి సప్తము నందు వున్నయెడల పరుల భార్యలను పొందువాడు అగును. లగ్నము నందు సప్తమాధిపతి పాప గ్రహములతో కలసియున్న జాతకుడు వ్యభిచారి అగును.
56. 2, 4, 8, 12 నందు గాని కుజుడు వున్నయెడల భార్యకు భర్త నశించును, భర్తకు భార్య నశించును. 7 నందు రాహువు వున్న విధవ స్త్రీ సంగమము చేయును. కుజుడు వున్న యెడల దాసీ సంగమము చేయును. శని వున్న యెడల జారుడు అగును.
57. సప్తమాధిపతి శుక్రుడు అయి పాప గ్రహములతో గలిసినను, చూడబడినను, నీచ శత్రు క్షేతములయందు వున్నను, అట్టి జాతకుని భార్య వేశ్య స్త్రీతోటి సమానురాలు అగును. అనగా వ్యభిచారి, ఖటినచిత్తురాలు, చోర తత్వము గలది అగును.
58.రవి లగ్నమునందు, శని సప్తమునందు వున్నయెడల జాతకుని భార్యకు గర్భిణి కానేరదు. రవి శనులు సప్తమము నందు వుండి గురు దృష్టి లేక చంద్రుడు దశమమందు
వున్నయెడల జాతకుని భార్యకు గర్భము నిలువదు. శని 6వ యింట, కుజుడు 4వ ఇంట వున్నయెడల జాతకుని భార్య గర్భము దరించదు.
59.సప్తమాధిపతి శుభ రాశియందు వున్నయెడల జాతకునకు బాల్యములోనే వివాహము జరుగును.
Please send me phone number
ReplyDelete