మంత్రపుష్పము:
*మంత్రపుష్పము:*
మంత్రపుష్పములోని శ్లోకములు సృష్టిలోని సత్యమును తెలుపుతాయి . ఆత్మనుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి ఆవిర్భవించాయి. కాబట్టి ఆత్మయే పంచభూతములకు మూలము అని మంత్రపుష్పము నిర్ధారిస్తున్నది.
· ఓం యోపాం పుష్పం వేద!
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి!
చన్ద్రమా వా అపాం పుష్పమ్!
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి!!
· య ఏవం వేద ! యోపామాయతనం వేద!
ఆయతనవాన్ భవతి!
అగ్నిర్వా అపామాయతనమ్!
ఆయతనవాన్ భవతి!
యోగ్నేరాయతనం వేద!
ఆయతనవాన్ భవతి!
ఆపో వా అగ్నేరాయతనమ్!
ఆయతనవాన్ భవతి! య ఏవం వేద!!
· యోపామాయతనం వేద!
ఆయతనవాన్ భవతి!
వాయుర్వా అపామాయతనమ్!
ఆయతనవాన్ భవతి!
యో వాయోరాయతనం వేద!
ఆయతనవాన్ భవతి!
ఆపో వై వాయోరాయతనమ్!
ఆయతనవాన్ భవతి! య ఏవం వేద!!
· యోపామాయతనం వేద!
ఆయతనవాన్ భవతి!
అసౌ వై తపన్నపామాయతనమ్!
ఆయతనవాన్ భవతి!
యోముష్య తపత ఆయతనం వేద!
ఆయతనవాన్ భవతి!
ఆపోవా అముష్య తపత ఆయతనమ్!
ఆయతనవాన్ భవతి! య ఏవం వేద!!
· యోపామాయతనం వేద!
ఆయతనవాన్ భవతి!
చన్ద్రమా వా అపామాయతనమ్!
ఆయతనవాన్ భవతి!
యశ్చన్ద్రమస ఆయతనం వేద!
ఆయతనవాన్ భవతి!
ఆపోవై చన్ద్రమస ఆయతనమ్!
ఆయతనవాన్ భవతి! య ఏవం వేద!!
· యోపామాయతనం వేద!
ఆయతనవాన్ భవతి!
నక్షత్రాణి వా అపామాయతనమ్!
ఆయతనవాన్ భవతి!
యోనక్షత్రాణామాయతనం వేద!
ఆయతనవాన్ భవతి!
ఆపో వై నక్షత్రాణామాయతనమ్!
ఆయతనవాన్ భవతి! య ఏవం వేద!!
· యోపామాయతనం వేద!
ఆయతనవాన్ భవతి!
పర్జన్యోవా అపామాయతనమ్!
ఆయతనవాన్ భవతి!
యః పర్జన్యస్యాయతనం వేద!
ఆయతనవాన్ భవతి!
ఆపోవై పర్జన్యస్యాయతనమ్!
ఆయతనవాన్ భవతి! య ఏవం వేద!!
· యోపామాయతనం వేద!
ఆయతనవాన్ భవతి!
సంవత్సరో వా అపామాయతనమ్!
ఆయతనవాన్ భవతి!
యస్సంవత్సర స్యాయతనం వేద!
ఆయతనవాన్ భవతి!
ఆపోవై సంవత్సర స్యాయతనమ్!
ఆయతనవాన్ భవతి! య ఏవం వేద!!
· యోప్సునావం ప్రతిష్ఠితాం వేద!
ప్రత్యేవ తిష్ఠతి!!
· ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే!
నమో వయం వైశ్రవణాయ కుర్మహే!
స మే కామాన్కామకామాయ మహ్యమ్!
కామేశ్వరో వైశ్రవణో దధాతు!
కుబేరాయ వైశ్రవణాయ !
మహారాజాయ నమః!!
ఓం శాంతిః శాంతిః శాంతిః
* ఎవరు నీరు మరియు పుష్పముయొక్క అంతరార్ధమును తెలుసుకొనగలుగుతారో, ఎవరు చంద్రుడు, నీరు, పుష్పముల మధ్యగల పవిత్రమైన, ఆలస్యమైన సంబంధమును తెలుసుకొనగలుగుతారో అతని హృదయపుష్పము వికసించి, అతడు సంతానవంతుడు, పశు సంపదగలవాడు అవుతాడు.
* పంచభూతములలో ఒకటైన జలమునకు మూలాధారమైన ఆత్మ తత్త్వమును తెలుసుకొనగలిగినవాడు ఆ పరమధామమును చేరుకోగలడు. అగ్ని యొక్క మూలాధారతత్త్వమును తెలుసుకోగలిగిన వాడు ఆత్మ తత్త్వమునందు నెలకొంటాడు. జలము, అగ్ని మధ్యగల పవిత్రమైన సంబంధమును తెలుసుకోగలిగిన వాడు వాటి మూలాధారతత్త్వమైన ఆత్మ తత్త్వమును చేరుకోగలడు.
* నీటియొక్క మూలాధారతత్త్వమును తెలుసుకోగలిగిన వాడు ఆత్మ తత్త్వమునందు నెలకొన్నవాడవుతాడు. వాయువే నీటి ఆధారము . నీరే వాయువునకు మూలం. నీటికి, వాయువునకు ఆధారమైన తత్త్వమును తెలుసుకో గలిగిన వాడు ఆత్మ తత్త్వమునందు నెలకొన్నవాడవుతాడు.
* నీటియొక్క మూలాధారతత్త్వమును తెలుసుకోగలిగిన వాడు ఆత్మ తత్త్వమునందు నెలకొన్నవాడవుతాడు. దహించే సూర్యుడే నీటికి ఆధారము. నీరే ఆ దహించే సూర్యునికి మూలాధారము. నీటికి, సూర్యునికి ఆథారమైన తత్త్వమును తెలుసుకోగలిగిన వాడు ఆత్మ తత్త్వమునందు నెలకొన్నవాడవుతాడు.
* నీటియొక్క మూలాధారతత్త్వమును తెలుసుకోగలిగిన వాడు ఆత్మ తత్త్వమునందు నెలకొన్నవాడవుతాడు. చంద్రుడు నీటికి మూలము. నీరే చంద్రునికి మూలాధారము. నీటికి, చంద్రునికి ఆధారమైన తత్త్వమును తెలుసుకో గలిగిన వాడు ఆ ఆత్మ తత్త్వమునందు నెలకొన్నవాడవుతాడు.
* ఎవరు నీటియొక్క మూలాధారతత్త్వమును తెలుసు కుంటాడో అతడు ఆత్మ తత్త్వమునందు నెలకొన్నవాడవుతాడు. నక్షత్రాలే నీటికి మూలము. నీరే నక్షత్రాలకు మూలాధారము. నీటికి, నక్షత్రాలకు ఆధారమైన తత్త్వమును తెలుసుకో గలిగిన వాడు ఆ ఆత్మ తత్త్వమునందు నెలకొన్నవాడవుతాడు.
* నీటియొక్క మూలాధారతత్త్వమును తెలుసుకోగలిగిన వాడు ఆత్మ తత్త్వమునందు నెలకొన్నవాడవుతాడు. మేఘమే నీటికి మూలాధారము. నీరే మేఘములకు మూలాధారము. ఎవరు నీటికి, మేఘమునకు ఆధారమైన తత్త్వమును తెలుసుకుంటాడో అతడు ఆ ఆత్మ తత్త్వమునందు నెలకొన్నవాడవుతాడు.
* నీటియొక్క మూలాధారతత్త్వమును తెలుసుకోగలిగిన వాడు ఆత్మ తత్త్వమునందు నెలకొన్నవాడవుతాడు. సంవత్సరమే (ఋతువులే) నీటికి ఆధారము. నీరే ఋతువులకు మూలాధారము. నీటికి, సంవత్సరమునకు (ఋతువులకు) మూలాధారమైన తత్త్వమును తెలుసుకో గలిగిన వాడు ఆత్మ తత్త్వమునందు నెలకొన్నవాడవుతాడు.
* సమస్త లోకములు నీటి పైన తేలియాడే నావ వలె ఉంటాయని తెలుసుకోగలిగిన వాడు (అనగా సమస్త లోకములలోని ప్రాణులకు నీరే జీవాధారమని తెలుసుకున్నవాడు) ఆ పరమ పదమునందు నెలకొని యుంటాడు.
* రాజులకు రాజు, మహా విజయములను ప్రసాదించు వాడయిన వైశ్రవణునికి (కుబేరునికి) నమస్కరిస్తున్నాము. మా కోరికలు తీరటానికి అవసరమైన సంపదలను వైశ్రవణుడు ప్రసాదించు గాక! సంపదలన్నింటికి అధిపతి అయిన, చక్రవర్తి కుబేరునికి నమస్కారము.
* నీరు, చంద్రుడు, అగ్ని, వాయువు , సూర్యుడు, నక్షత్రాలు, మేఘములవంటి ప్రకృతి అంశాలు మంత్రపుష్పములో పేర్కొనబడ్డాయి. ఇవి పరస్పర ఆధారాలు. ఇది తెలుసుకున్నవాడు తనలోని ఆత్మ, పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకోగలడు. ప్రాపంచిక జీవితానికి ఆధారంగా ఉండేది సూర్యుడు, చంద్రుడు నీరు లాటి అంగాలు కలిగిన ప్రకృతి అని అర్థం. అందువలన ప్రకృతిని దైవస్వరూపంగా ఆరాధించాలి. ప్రకృతిలోని పుష్పం, జలం పూజల్లో ఉపయోగించడం ప్రకృతిని ఆరాధించడమే.
శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శాంతులను ఆ ప్రకృతి మనకు ప్రసాదించుగాక!
Comments
Post a Comment