శ్రీరామచంద్రుని వనవాసకాలం

శ్రీరామచంద్రుని వనవాసకాలం

1వ రోజున చైత్ర శుద్ధ దశమినాడు వనవాస ప్రయాణo. రాత్రి తమసాతీర వాసము.
2వ రోజున జాహ్నవీ తీరవాసము - గుహుని రాక.
3వ రోజున గంగా దక్షిణ తీర తరువు క్రింద సేద.
4వ రోజున ప్రయాగలో భరద్వాజ దర్శనము.
5వ రోజున
యమునాతీర వాసము,చిత్రకూట ప్రవేశము.
6న  సుమంత్రుడు అయోధ్యకు తిరిగి వచ్చుట, రాత్రికి దశరధుని మృత్యువు.
7న కౌసల్యాదుల విలాపము. భరతునికై దూతలను పంపుట.
8వ రోజునుండి 12వ రోజువరకు భరతుని అయోధ్యా ప్రయాణము.
13వ రోజున పౌరలౌకిక కర్మ.
14వ రోజునుండి 17వ రోజువరకు వనమార్గము బాగు చేయుట.
18వ రోజునుండి 20వ రోజువరకు భరతుని వన ప్రయాణము.
21నుండి 23వ రోజువరకు భరతుడు రాముని వద్దనుండుట.
24వ రోజునుండి 27 వరకు భరతుడు అయోధ్యకు పాదుకలతో తిరిగి వచ్చుట.
45వ రోజున పాదుకా పట్టాభిషేకము.

శ్రీరాముడు చిత్రకూటమున పదిన్నర మాసములుండెను. మొదటి సంవత్సరము ఇట్లు గడిచెను.

పిదప చిత్రకూటము విడచి దండాకారణ్యమున ప్రవేశించి ఋషుల ఆశ్రమములను చూచుచూ గడిపినవి 10సంవత్సరములు. ఆ తర్వాత పంచవటిలో ఒకటిన్నర సంవత్సరములు.

ఈ విధముగా పన్నెండున్నర సంవత్సరములు పూర్తి అయ్యెను.

13వ సంవత్సరము కొంచెము మిగిలి ఉందనగా మాఘశుద్ధ అష్టమినాడు విందము అన్న ముహుర్తములో రావణుడు సీతను అపహరించుట.

జ్యేష్ట శుద్ధ పౌర్ణమి నాడు వాలి వధ.

కార్తీక శుక్ల పాడ్యమిన సుగ్రీవ పట్టాభిషేకము.

4 మాసములు వర్షాకాలము. సీతా అన్వేషణ జరుగలేదు.

కార్తీకము చివర లక్ష్మణ ఆగ్రహము, అక్కడి నుండి మార్గశిర మాసము  వరకు సీతాన్వేషణ.

హనుమంతుడు మార్గశిర శుద్ధ ఏకాదశిన లంకా ప్రవేశము. అర్ధరాత్రిన సీతాదేవి దర్శనము.

ద్వాదశినాడు వృక్షము పైనుంచి రావణుని చూడటము. సీతతో సంభాషణ.

త్రయోదశినాడు అక్షాది వధ.

చతుర్దశినాడు లంకా దహనము.

మరలా వానరులతో కలయికకు 5 రోజులు.

మార్గశిర శుక్ల షష్టినాడు మధువన భంజనము.

అష్టమినాడు ఉత్తరా నక్షత్రమున విజయాఖ్య ముహుర్తమున శ్రీరామ దండు ప్రస్థానము.

పుష్య పాడ్యమికి సముద్ర తీరమునకు చేరుట.

పుష్య శుక్ల చవితి కి విభీషుణుడు రాక.

పంచమికి సముద్రము దాటుటకై అలోచన

పిదప 4 దినములు సముద్రుని శ్రీరాముడు ప్రార్ధించుట, ప్రాయోపవేశమునకు యత్నము.

దశమికి సేతుబంధన ప్రారంభము.

త్రయోదశికి సేతుబంధనము పూర్తి.

చతుర్దశికి రాముడు సువేలగిరిని ఎక్కుట.

పుష్య పౌర్ణమి నుండి బహుళ విదియ వరకు సైన్యము దాటుట.

తదియ నుండి దశమివరకు సేనా నివేశము

ఏకాదశినాడు రావణ ఆదేశముపై శుకసారణులు వచ్చి రామసేనను చూచుట.

ద్వాదశి వానరసేన గణనము

అమావాస్య రాక్షససేన గణనము.

మాఘ శుద్ధ పాడ్యమి అంగద రాయబారము.

విదియ నుండి అష్టమి వరకు వానర రాక్షస యుద్ధము.

నవమిరాత్రి ఇంద్రజిత్ నాగాస్త్రముచే రామలక్ష్మణులను బంధించుట.

దశమి నాడు గరుత్మంతుని ఆగమనము నాగపాశవిమోచనము.

ఏకాదశి,ద్వాదశిలలో ధుమ్రాక్షవధ,

త్రయోదశినాడు అకంపన వధ.

చతుర్దశి నుండి బహుళ పాడ్యమి వరకు యుద్ధము. నీలుడు ప్రహస్తుని చంపుట, రాముడు రావణుని మకుటభంగము.

పంచమి నుంచి చతుర్దశివరకు కుంభకర్ణునితో యుద్ధము.

అమావాస్యనాడు యుద్ధ విరామము.

ఫాల్గుణ పాడ్యమి నుంచి చవితివరకు నరాంతక వధ.

పంచమి నుంచి సప్తమి వరకు అతికాయుని వధ.

అష్టమి నుంచి ద్వాదశి వరకు కుంభ, నికుంభుల వధ.

పిదప మూడురోజులు మకరాక్షవధ.

ఫాల్గుణ శుద్ధ విదియ ఇంద్రజిత్ యుద్ధము.

తదియ నుంచి సప్తమి వరకు యుద్ధ విరామము.

త్రయోదశినాడు ఇంద్రజిత్ వధ.

చతుర్దశి యుద్ధ విరామము.

ఫాల్గున అమావాస్య రావణుని యుద్ధ యాత్ర.

చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి రామ రావణ యుద్ధము.

నవమి రావణ పలాయనము. లక్ష్మణ మూర్చ. సంజీవిని తెచ్చుట.

దశమి యుద్ధ విరామము.

ఏకాదశి ఇంద్రుడు రామునకు రధము పంపుట.

ద్వాదశి నుంచి బహుళ చతుర్దశి వరకు 18 రోజులు రామ రావణ యుద్ధము.

చతుర్దశి నాడు రావణ వధ.

అమావాస్య రావణునికి అంతిమ సంస్కారము.

మొత్తము 18 రోజుల విరామము..
72 రోజుల యుద్ధము.

వైశాఖ శుద్ధ పాడ్యమి విభీషుణుని పట్టాభిషేకము.

తదీయ సీత అగ్ని ప్రవేశము.

చవితి పుష్పక విమానము ఎక్కి భరద్వాజ ఆశ్రమమునకు పోక.

షష్టి నందిగ్రామములో భరతుని కలియుట.

వైశాఖ శుద్ధ నవమి శ్రీరామ పట్టాభిషేకము.

శ్రీరామ శ్రీరామ శ్రీరామ

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: