6 - 10 - 2019 *దుర్గాష్టమి శుభాకాంక్షలు*
🌹🌹🌹. ఓం శ్రీ మాత్రే నమః 🌹🌹🌹
6 - 10 - 2019 *దుర్గాష్టమి శుభాకాంక్షలు*
దసరా నవరాత్రులు తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. దుర్గాష్టమిని మహాష్టమి లేక వీరాష్టమి అని కూడా అంటారు.
ఎర్రటి అక్షతలు, ఎరుపు రంగు పుష్పాలతో అమ్మను పూజించాలి.
పులగాన్నం నివేదించి,
దుర్గా సూక్తం పారాయణం చెయ్యాలి.
విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు.
*శ్రీ దుర్గా సూక్తం*
ఓం || జాతవే'దసే సునవామ సోమ' మరాతీయతో నిద'హాతి వేదః' |
స నః' పర్-షదతి' దుర్గాణి విశ్వా' నావేవ సింధుం' దురితాఽత్యగ్నిః ||
తామగ్నివ'ర్ణాం తప'సా జ్వలంతీం వై'రోచనీం క'ర్మఫలేషు జుష్టా''మ్ |
దుర్గాం దేవీగ్^మ్ శర'ణమహం ప్రప'ద్యే సుతర'సి తరసే' నమః' ||
*భావము:*
అగ్నిదేవా! సోమాన్ని పిండి రసాన్ని నీకు సమర్పిస్తాము. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అగ్ని దేవుడు దగ్ధము చేయు గాక! పడవ ద్వారా సముద్రము దాటే విధంగా మమ్మల్ని సమస్త బాధలనుండి, తప్పులనుండి అగ్నిదేవుడు కాపాడు గాక!
*అగ్నివర్ణం కలదీ, తపస్సు ద్వారా ప్రకాశించునదీ, భగవంతునికి చెందినదీ, కర్మ యొక్క ప్రతిఫలాలలో శక్తిగా నెలకొన్నదీ అయిన దుర్గాదేవిని నేను శరణు జొచ్చుచున్నాను.* *దుఃఖసాగరం నుండి మమ్మలను తీరానికి చేర్చే దేవీ! మమ్ము కాపాడు. నీకు నమస్కారము*
Comments
Post a Comment