సప్తమ భావము -కళత్ర విషయములు

#కళత్రం 
వంధ్యాపతి స్సితరవీ మదనోదయస్థౌ చంద్రోదయే సమగృహే లలనా కృతిస్స్యాత్ పుంరాశిగే పురుష భావయుత కళత్రం స్ర్తిపుంగ్రహే క్షితయుతే సతి మిశ్రరూపం.

శుక్ర సూర్యులు లగ్నంలో కానీ సప్తమంలో కానీ వుండిరేని భార్య గొడ్రాలు అగును అనగా సంతానవతి కానేరదు. రవి శుక్రుల కలయిక అస్తంగత్వ దోషం ఇస్తుంది కదా! మరి వారు అలాంటి దోషం కలవారై లగ్నంలో వుంటే కళత్ర స్థానమును చూస్తారు. కళత్రంలో వుంటే ఇక చెప్పనవసరం లేదు కదా. అందుకే ఈ ఫలితం చెప్పారు.

ఇక చంద్రోదయము సమరాశులలో అయితే కళత్రము లలనాకృతి అగును అని చెప్పుచూ పురుష రాశిని పొందినేని కళత్రము పురుష భావం కలిగి వుండును అన్నారు.

స్ర్తి పుంగ్రహములతో కూడికొని యుండినేని కళత్రము మిశ్రరూపము కలదై యుండును. ఈ సూత్రం పురుష జాతకం వరకే కాక స్ర్తి జాతకములకు కూడా అమలుచేయవలెను.

మరొక ముఖ్య శోధన భౌమాంశేవా
భౌమరాశౌమి లగ్నాత్.
కామస్థానే జన్మభేవా వధూనామ్‌॥
జాయదాసీ నీచమూఢ గ్రహాంశే
దుష్టావా స్యాద్యౌవనే భర్తృహీనాః ॥

పురుషుల జాతకంలో సప్తమ స్థానం స్ర్తిల జాతకంలో లగ్నం ద్వారా తెలుసుకోవలయును.

పురుషుల సప్తమ స్థానము లేదా స్ర్తిలకు లగ్నము అంగారక రాశిగానీ అంశ గానీ అయిన యెడల భార్య దాసీయై ఉండును. అలాగే సప్తమము అయినను, లగ్నము అయినను నీచ మూఢ గ్రహాంశలు కలది అయిన యెడల కళత్రము యుక్త వయసులో వుండగా దుష్ట స్వభావము కలదిలేదా కలవాడు. లేదా భర్తృహీనురాలు అయి ఉండును. ఇది పురుష జాతకమునకు కూడా అమలు చేయవచ్చును.

శుభాంశ రాశౌయది సద్గుణాఢ్యా శుభౌక్షితే చారుతరం కళత్రం
చంద్రాంశకే దుర్బల చంద్రరాశౌ జాతాపతిఘ్నీ సబలేతు సాధ్వీ॥

సప్తమము గానీ లగ్నము గానీ శుభాంశరాశి అయ్యెనేని భార్య సద్గుణవతి అగును. సప్తమ స్థానము శుభ గ్రహములచే చూడబడెనేని మిగుల సుందరి అయిన భార్య రాగలదు. ఈ నియమం భర్త రాగలడు అని చెప్పవచ్చు.

సప్తమ స్థానము చంద్రరాశి అయి వుండగా చంద్రరాశి దుర్బలమయి ఉండెనేని పతిని హింసించునట్టి, భార్య కలుగును.

అదే చంద్రరాశి బలము కలది అయిన యెడల భార్య పతివ్రత అగును.

లగ్నాధిపతి సప్తమ స్థానమున ఉండి శుభ గ్రహములతో కూడుకొని ఉన్న యెడల సత్కులమునందు పుట్టిన భార్య రాగలదు.

లగ్నాధిపతి దుష్ట క్షేత్ర ఆధిపత్యంతో వున్న సప్తమంలో వున్ననూ లేదా దుష్ట గ్రహములతో కలసి సప్తమంలో వున్ననూ దుష్టకులము నందు పుట్టిన భార్య రాగలదు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: