శుక్రుడు స్థానాలు

శుక్రుడు స్థానాలు



శుక్రుడు లగ్నమున ఉన్న జాతకుడు గణిత శాస్త్రజ్ఞుడు , భార్యయందు ప్రేమకలవాడు, ధనవంతుడు, పచ్కాని శరీర కాంతి కలవాడు చిరకాలం జీవించు వాడు. శుక్రుడు పాప గ్రహ చేరిక కలిగి ఉన్నను శత్రు స్థానం లేక నిచ స్తానంలో ఉన్న జాతకుడు కారుడు మోసకారి, వాత శ్లేష్మ పీడితుడు, సుఖరోగా పీడితుడు ఔతాడు .

ద్వితియమున శుక్రుడు ఉన్న ధనవంతుడు, విశాలనేత్రములు ఉన్న వాడు, దయకలవాడు, సత్యవాది, స్త్రీ వలన లాభం పొందు వాడు, స్త్రీల స్నేహం పొందు వాడు , పరోపకారి ఔతాడు. శత్రువు పాపగ్రహములతో సిరిక కలిగిన నేత్ర పీడ, చంద్రునితో కలిసిన రేసికటి కలవాడు, ధన నష్టం కుటుంబం లేని వాడు.

మూడవ స్థానంలో ఉన్న జాతకుడు అతి లోభి, ఎక్కువ మంది సోదరులు కలవాడు, సంకల్ప సిద్ధి ధన వృద్ధి పొందు వాడు, శుక్రుడు ఉచ్చ క్షేత్రం స్వక్షెత్రం అందు ఉన్న సోదర వృద్ధి కలుగును. భాధిపతి ఆరు, ఎనిమిది, పన్నెండు లో ఉన్న సోదర నష్టం కలుగును.

నాల్గవ స్థానంలో శుక్రుడు ఉన్న జాతకుడు రూపవంతుడు, గాయకుడు, బుద్ధిమంతుడు, ముప్పదవ సంవత్సరమున వాహన సుఖం కలుగును, సోదర సుఖం కలవాడు, క్షమాహ్రుదయ కలవాడు ఔతాడు. భావాధిపతి బలవంతుడైన కార్లు స్కూటర్లు కలవాడు , ధన కనక వస్తు వాహన సంపద కలవాడు ఔతాడు. శత్రు, నీకా, పాప స్థానమున ఉన్న బలహినుడైన ధనహినుడు , వాహన సుఖం లేని వాడు, తల్లికి అశాంతి, పరస్త్రీ ఆకర్షితుడు ఔతాడు.

పచామ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు విజ్ఞాని, మంత్రి లేక సైన్యమున గొప్ప పదవి పొందు వాడు , సదా అందమైన భార్యను పొందు వాడు, మంచి గుణం , రాజ సన్మానం కలిగిన వాడు ఔతాడు. శుక్రుడు పాప గ్రహ చేరిక, బలహీనుడు, నిచ లేక శత్రు స్థానముల ఉన్న జాతకుడు మండ బుద్ధి కలవాడు ఔతాడు.

శుక్రుడు అరవ స్థానమున ఉన్న జాతకుడు కీర్తి కల వాడు, పుత్రా వరు దది, అవసరమైన ఖర్చులు చేయువాడు, మాయావాదములు చేయువాడు, రోగ పీడితుడు ఔతాడు. శత్రు, నిచ స్థానముల ఉన్న పాపుల చేరిక లేక చంద్రుని తో చేరిక కలిగి ఉన్నా బందు నష్టం పుత్రా సంతానం లేక పోవుట, శత్రు నాశకుడు ఔతాడు.

సప్తమమున శుక్రుడు ఉన్న జాతకుడు అతి కాముకుడు, బహు ధనవంతుడు, అన్య స్త్రీల అందు ఆసక్తుడు, వాహనములు కలవాడు, సంగితకారుడు, కార్యశురుడు, భోగి, పుత్రవంతుడు ఔతాడు. శత్రు, నిచ స్థానముల ఉన్న బలహినుడైన భార్యా వియోగం, బహు వివాహములు, పుత్రా సంతాన హీనుడు ఔతాడు. బలయుక్తుడు, స్వక్షెత్రం , ఉచ్చ క్షెత్రముల ఉన్న భార్య మూలమున దనం కీర్తి కల వాడు ఔతాడు.

ఎనిమిదవ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు సుఖవంతుడు, నాగువ సంవత్సరం తల్లికి గండం , అర్దాయుష్కుడు, రోగాపిడితుడు , అసంతృప్త జీవితం , త్యాగనిరతి కలిగిన భార్య కలవాడు ఔతాడు. శుక్రుడు బలయుక్తుడై, ఉచ్చ, శుభ గ్రహ చేరిక కలిగిన దిర్గాయువు , పాప గ్రహ చేరిక, నిచ, శత్రు శ్తానముల ఉన్న అల్పాయువు కలవాడు ఉఒతాడు. మేషరాశి అష్టమమైన తృష్ణా పీడితుడు, వృషభ రాశి అష్టమమైన సుఖరోగా పీడితుడు, మిధునం అష్టమమైన దంత వ్యాధి పీడితుడు, కటకం అష్టమమైన వాత ఒపిట్ట శ్లేష్మ పీడితుడు, సోహం అష్టమమైన మసూచి పీడితుడు, కన్య అష్టమమైన మ్రుతముల చేత, తుల అష్టమమైన సర్పముల చేత , వృశ్చికం అష్టమమైన విష భక్షన చేత, ధనుస్సు అష్టమమైన క్రిమి కీటకం చేత, మకరం అష్టమమైన విష ప్రయోగం లేక శాస్త్ర చికిత్స అనంతరం, కుంభం అష్టమమైన అతికామము చేత, మీనం అష్టమమైన అతి భాదల చేత మరణం సంభవించును. ఇవి అన్ని శుక్రుడు ఉపస్తితమై ఉన్న జరుగును.

నవమున శుక్రుడు ఉన్న ధార్మికుడు తపస్వి, సత్కర్మ చేయు వాడు, పాదముల పుట్టు మచ్చలు శుభ చిహ్నములు కల వాడు, బహు భోగలాలసుడు, పుత్రవంతుడు, తండ్రి దిర్గాయువు కలవాడు ఔతాడు. నీకా, శత్రు, పాపగ్రహ చేరిక కలిగి ఉన్న జాతకుని తండ్రిని బాల్యమున కోల్పోవును. భాగ్యమును కోల్పోవును. స్వక్షెత్రం, ఉచ్చ క్షేత్రముబలయుక్తుడై ఉన్న ధనవంతుడు మహా భోగి ఔతాడు. చతుర్ధ , సప్తమ అధిపతులతోసంబంధం ఉన్న బహు భోగములు, విదేశీ కార్లు, విదేశీ ప్రయాణాలు కలుగును.

దశమ స్థానంలో శుక్రుడు ఉన్న జాతకుడు ధైర్యవంతుడు, బుధ, గురు, చంద్రులతో కలిసి ఉన్న భావాహనములు కలవాడు, యజ్ఞములు చేయువాడు , మరణానంతరం కుడా కీర్తిని పొందు వాడు ఔతాడు. బహినుడైన, పాపగ్రహ చేరిక ఉన్న, నిచాలో ఉన్న కార్య పరాజయం కలుగును.

ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉన్న ధనవంతుడు, భువసతి కలవాడు, విద్యావంతుడు ఔతాడు. బలవంతుడి, శుభ గ్రహ చేరిక, ఉచ్చ స్థానముల ఉన్న అనేక వాహనములు కలవాడు ఔతాడు. పాపగ్రహ చేరిక, నీచం, శత్రు స్థానముల ఉన్న అన్యాయ మార్గమున ధన సంపాదన చేయును.

ద్వాదశ స్య్హానమున శుక్రుడు ఉన్న దరిద్రుడు, పాప గ్రహ చేరిక ఉన్న నీచం అయిన స్త్రీ స్నేహం, శుభాగ్రహ చేరిక కలిగిన ధనవంతుడు ఔతాడు.


Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: