🌹శ్రీ కుర్తాళ పీఠ వైభవం 🌹

🌹శ్రీ కుర్తాళ పీఠ వైభవం 🌹

Part-52

🌾శ్రీ సిద్దేశ్వరానందభారతీస్వామి 🌾

🌺ప్రస్తుత రంగము 🌺

🌼స్వామి వారి మాటలలో🌼

🦚మృతజీవులు🦚

మానవులు మరణించిన తరువాత ఎక్కడకు వెడతారు ? ఏమవుతారు అన్నది పురాణ వాఙ్మయంలో విస్పష్టంగా చెప్పబడింది. అయినా అనుభవానికి వచ్చేసరికి ఎవరి అనుభవము వారిదే. కృష్ణమూర్తి అని నా కొక బాల్యస్నేహితుడుండే
వాడు. కవిత్వంలో కొంత కృషి చేశాడు.
తాలింఖానాలో నాతో కలసి వ్యాయామం
చేసేవాడు. కుస్తీపట్టేవాడు. ఉద్యోగరీత్యా కొన్నాళ్ళకు హైదరాబాదు బదిలీ అయింది. మూడు దశాబ్దాలకు పైగా అక్కడే ఉద్యోగం చేసి రిటైరయిన తరువాత ఆధ్యాత్మిక మార్గంలో జీవితం గడుపుదామని గుంటూరు వచ్చేశాడు. అతడికి భార్య
మరణించింది. ఒక పిల్లవాడు హైదరాబాదులో స్థిరపడ్డాడు. గుంటూరులో అతనికి స్వగృహం ఉన్నది. అక్కడ ఉంటూ రోజూ ప్రొద్దున, సాయంత్రం నా ఆశ్రమానికి వచ్చేవాడు. జపహోమ ధ్యానములు చేసేవాడు. నాతో పాటు, బృందావనం
మొదలయిన క్షేత్రాలకు తీర్థయాత్రలకు కలసి వచ్చేవాడు. సాధన తీవ్రతవల్ల దివ్యచక్షువు వికసించడం మొదలు పెట్టింది. పరిపూర్ణ సిద్ధి లభించకముందే ఆయువుతీరి మరణించాడు. ఆ సమయానికి నేను అమెరికాలోని డెట్రాయిట్లో
అతని సోదరి ఇంట్లో ఉన్నాను. ఆమె తన సోదరుడు మరణానంతరం ఏ స్థితికి వెళ్ళాడో చూచి అవసరమయిన సహాయం చేయమని అభ్యర్థించింది. దశాహం హోమం పూర్తయిన తరువాత చూస్తానని చెప్పి ఆ తరువాత ఒకనాడు ధ్యానంలో చూచాను.

అతడు చేసిన తపస్సు, సత్కార్యములు, వాటి పుణ్యం వల్ల ఒక దివ్య భూమికలో చాలా సుఖంగా ఉన్నాడు. నన్ను చూచి సంతోషంగా పలకరించి "ఇక్కడ చాలా బాగుంది. నీవు కూడా ఇక్కడకు వచ్చేసెయ్యి" అన్నాడు. నేనతనితో ఈ రాకపోకలు
మనచేతిలోనివి కావు భూమి మీద ఎంత కాలం ఉండాలని పరమేశ్వరి నిర్దేశిస్తే అంతకాలం ఉండి కర్తవ్యపాలన చేయవలసి ఉంటుంది. నా సమయం ఇప్పుడే కాదు నీకు శుభమగును గాక !”

ఇతనితోనే కాక మరణించిన జీవులు మరి కొందరితో కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడటం జరిగింది. వాటిలో ఒకదానిని మాత్రం ఉదహరిస్తాను.
(సశేషం)

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12