*శని సంక్రమణం* ⚜
⚜ *శని సంక్రమణం* ⚜
☘☘☘☘☘☘☘☘☘☘
జనవరి 24, పుష్య బహుళ అమావాస్య నుండి శని గ్రహం
ధనుస్సు రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించడం జరిగింది. ఇలా శని 2 సం.ల 6 మాసాలు ఒకే స్థానంలో ఉంటాడు.
మకర రాశి శనీశ్వరునికి స్వక్షత్రము. అనగా ఆయనకి సొంత ఇల్లు.
మకరరాశివారికి శని జన్మ శని అవుతున్నప్పటికీ శుభాలను ప్రసాదిస్తాడు.
ఇక 12 రాశులవారికి శనివలన ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం.
1. 🐐 మేష రాశి : మేష రాశివారికి శని 10 వ స్థానం అవుతున్నాడు.
ఈరాశివారికి శనివలన మిశ్రమ ఫలితాలే ఉంటాయి. శుభాశుభాలు రెండూ ఉంటాయి. ఎక్కువ ఆందోళన అవసరంలేదు.
2. 🐂 వృషభ రాశి : వృషభ రాశి వారికి శని 9 వ స్థానం అవుతున్నాడు.
ఈరాశివారికి శనివలన మిశ్రమ ఫలితాలే ఉంటాయి. శుభాశుభాలు రెండూ ఉంటాయి. ఎక్కువ ఆందోళన అవసరంలేదు.
3. 💑 మిథున రాశి : మిథునరాశివారికి శని 8 వ స్థానం అవుతున్నాడు. ఇది శనికి లోహ సంచార స్థానం. అష్ట కష్టాలు అంటాము కదా, అలా అనేక కష్టాలు ఉండే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు పాటించాలి.
4. 🦀 కర్కాటక రాశి : వీరికి శని 7 స్థానంలో అశుభుడుగా లోహపాదంతో సంచరిస్తాడు కనుక వీరు కూడా సరైన జాగ్రత్తలు పాటించాలి.
5. 🦁 సింహ రాశి : వీరికి శని 6 వ స్థానములో సువర్ణమూర్తి అయి, స్వర్ణపాదంతో సంచరిస్తాడు. వీరికి ఈ కాలం చాలా మంచిది. అనుకున్న పనులు అన్నీ పూర్తి అవుతాయి.
6. 🙎🏻♀కన్య రాశి : ఈ రాశివారికి శని పంచమ స్థానంలో ఉంటున్నాడు. సాధారణ ఫలితాలు ఉంటాయి.
7. ⚖ తులా రాశి : ఈ రాశివారికి శని 4 వ స్థానములో ఉంటున్నాడు. దీనిని అర్ధాష్టమ స్థానం అంటారు. ఇది శనికి లోహ సంచార స్థానం. కావున సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది.
8. 🦞 వృశ్చికం : వృశ్చిక రాశివారికి నిన్నటివరకూ ఏలినాటి శని బాధలు ఉండేవి. నేటి నుండి ఆ కష్టాలు పోయాయి. ఇప్పుడు వీరికి బంగారు కాలం అని చెప్పాలి. వీరికి శని 3 వ స్థానం అయిన సువర్ణ స్థానములో శని సువర్ణ మూర్తి అయి, బంగారుపాదంతో సంచరిస్తాడు. ఇక వీరికి అంతా జయమే.
9. 🏹 ధనుస్సు రాశి : ఈ రాశివారికి శని 2 వ స్థానంలో లోహ మూర్తి అయి ఉంటున్నాడు. ఈరోజు నుండి వీరికి ఏలినాటి శని చివరి దశ ప్రారంభం అవుతుంది. వచ్చే సంక్రమణం లోపు వీరికి మంచి చేసే వెళ్తాడు. అయినా వీరు సరైన జాగ్రత్తలతోనే ఉండాలి.
10 . 🐊 మకరం : ఈ రాశివారికి జన్మస్థానంలో అనగా 1 వ స్థానంలో ఉంటాడు. ఇది శనికి స్వక్షేత్రం అని ముందుగానే చెప్పుకున్నాం కదా ? So వీరు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.
11 . 🏺 కుంభం : ఈరాశివారికి వ్యయంలో అనగా 12 వ స్థానంలో ఉంటాడు.వీరికి నేటి నుండి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. శని మకరంలో 2.1/2 సం.లు ఉండి, ఆ తర్వాత కుంభ రాశిలోకి రావడం జరుగుతుంది. కుంభ రాశి కూడా శనికి స్వక్షేత్రమే. కనుక ఏలినాటి శని బాధలు ఎక్కువగా ఇబ్బంది పెట్టవు.
12. 🐟 మీన రాశి : ఈ రాశి వారికి ఇక బంగారు పంట పండినట్టే అని చెప్పాలి. శని ఈ రాశివారికి 11 వ స్థానము అయిన లాభ స్థానంలో సువర్ణ మూర్తి అయి, బంగారు పాదంతో సంచరిస్తూ అనేక శుభాలను ఇస్తాడు. ఈ 11 వ స్థానం చేరడానికి శనికి 27 సం.ల 6 నెలల కాలం పడుతుంది. ఇంతటి సుదీర్ఘ కాలం తర్వాత 11 వ స్థానానికి వస్తున్నాడు కనుక ఈరాశివారు పట్టిందల్లా బంగారమే.
పైన తెలిపిన ఫలితాలు అన్ని గోచార ఫలాలు అంటారు. 12 రాశుల్లో శని ఎవరికైతే శుభుడుగా ఉన్నాడో వారికి శుభఫలితాలు అశుభుడుగా ఉంటే అశుభ ఫలితాలు రావడం అనేది 50 % మాత్రమే నిజం. మీజాతక చక్రం బట్టి ఇప్పుడు నడుస్తున్న దశలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే ఈ గోచార ఫలాలు మీకు ఎంతవరకు సరిపోతాయి అనేది కచ్చితంగా చెప్పవచ్చు. జాతకం ప్రకారం చాలా బాగుండి శని ఇక్కడ బాగాలేకపోయినా మీకు శనివలన ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా జాతక చక్రంలో బాగాలేక శని మీకు సువర్ణ మూర్తి అయినా ఎక్కువ శుభాలు ఉండవు. కనుక ఏ రాశివారు అయినా ఒకసారి మీకు నడుస్తున్న దశ విదశలను తెలుసుకోవడం మంచిది.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌺🌺🌺🌺
శని మంత్రం :
నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం !
*ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం !!
పై మంత్రం రోజూ పఠించండి. అలాగే నిత్యం ఆదిత్య హృదయం పారాయణం చేయండి.
Comments
Post a Comment