మన ఇతిహాసాలు

*📖 మన ఇతిహాసాలు 📓*

*విశ్వదేవతలు*

సాధ్యులు:- సాధ్య, ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు లేక విశ్వకుమారులు.

మరుత్వంతులు:- మరుత్వతి, ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు లేక విశ్వకుమారులు.

వసువులు :- వసువు ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు లేక విశ్వకుమారులు. వీరు నాలుగు దిక్కుల వ్యాపించిన జ్యోతిష్మంతులు. వీరిలోని ప్రభాసుడే భీష్ముడు. గంగాదేవి శంతన మహారాజు బిడ్డలు.

భానవులు :- భనవి ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు లేక విశ్వకుమారులు.

ముహూర్తజులు:- ముహూర్త ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు లేక విశ్వకుమారులు.

ఘోషులు :- లంబ ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు లేక విశ్వకుమారులు.

సంకల్పులు:- సంకల్ప ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు.

భూతల వాసులు :- అరుంధతి ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు లేక విశ్వకుమారులు.

*అష్టవసువులు*

అష్టవసులులు:- అపుడు, ధృవుడు, సోముడు, ధరుడు, అనిలుడు, ఆనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు.

అపుని కుమారులు :- శ్రాంతుడు, వేతంతుడు, అపిశ్రాంతుడు, బభ్రువు. వీరు యజ్ఞరక్షాధికారులు.

ధ్రువుని కుమారుడు :- కాలుడు.
ధర్ముని కుమారులు:- ద్రవిణుడు, హవ్యవాహనుడు, కల్పాంతస్థుడు, ప్రాణుడు, రమణుడు, శిశిరుడు, మనోహరుడు, ధవుడు, శివుడు. శివుడి కుమారుడు మనోజవుడు.

అనిలుడి కుమారులు :- విశాఖుడు, శాఖుడు.

ప్రత్యూషుని కుమారులు:- ముని, దేవలుడు.

ప్రభాసుడి కుమారుడు :- విశ్వకర్మ. ఈయన దేవశిల్పి. దేవాలయములు, రాజభవనములు, ఉద్యానవనములు, ప్రతిమలు, నగలు, తటాకములు(చెరువులు), ఆరామములు (తోటలు, దొడ్లు), నూతులు.

*ఏకాదశరుద్రులు*

ఏకాదశరుద్రులు:- అజైకపాదు, హిర్భుధున్యుడు, విరూపాక్షుడు, రైవతుడు, హరుడు, బహుర్ధురూపుడు, త్రయంబకుడు, సురేశ్వరుడు, సావిత్రుడు(వైవసత్వుడు), జయంతుడు, పినాల, అపరాజితుడు. వీరిని గణేశ్వరులు అని కూడా అంటారు.

త్రిశూలధరులు బ్రహ్మమానస పుత్రులు అయిన వీరికి ఎనుబది నాలుగు కుమారులు కలిగి సర్వదిశలలో వ్యాపించి జగద్రక్షణ చేస్తున్నరు. వీరి పుత్ర పౌత్రులు సురభినందు జన్మించారు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12