చంద్రుడు జ్యోతిషం
చంద్రుడు జ్యోతిషం
రచన ప్రముఖ జ్యోతిష్యులు డా.కొమర్రాజు భరద్వాజ్ శర్మ చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. చంద్రుడు స్త్రీ గ్రహం, వైశ్య జాతి, శ్వేత వర్ణం, పరిమాణం పొట్టి, వయస్సు డెబ్బై సంవత్సరాలను సూచించును. దిక్కు వాయవ్యం, తత్వం జల తత్వం, ప్రకృతి వాత, శ్లేష్మములు. ఋతువులలో వర్ష ఋతువును, లోహములలో వెండిని, రత్నములలో ముత్యమును సూచించును. చంద్రుడు చతుర్ధ భావంలో దిక్బలం కలిగి ఉంటాడు. గ్రహములలో చంద్రుడు ఏడవ వాడు. సత్వగుణ సంపన్నుడైన చంద్రుడు కృష్ణ పక్ష దశమి నుండి శుక్ల పక్ష పంచమి వరకు పూర్ణ చంద్రుడు. శుక్ల పంచమి నుండి అమావాస్య వరకు క్షీణ చంద్రుడు, అమావాస్య నుండి కృష్ణ పక్ష దశమి వరకు మధ్యమ చంద్రుడు అని శాస్త్రం చెప్తుంది. చంద్రుడు రోహిణి, హస్త, శ్రావణ నక్షత్రాలకు అధిపతి. శరీరావయవములలో మగవారి ఎడమ కన్ను, స్త్రీల కుడి కన్ను శరీర మధ్య భాగమును సూచించును. చంద్రుడు కర్కాటక రాశికి ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడు వృషభంలో మూడు డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిలో ఉంటాడు. వృషభంలో మూడు నుండి ఇరవై ఏడు డిగ్రీల వరకు మూల త్రికోణంలో ఉంటాడు. వృశ్చికంలో మూడు డిగ్రీల వరకు పరమ నీచ స్థితిలో ఉంటాడు. బుధుడు, సూర్యుడు మిత్రులు. చంద్రుడికి శత్రువులు లేరు.
చంద్రుని ప్రభావం
చంద్ర ప్రభావిత వ్యక్తులు శ్లేష్మ వ్యాధి పీడితులుగా ఉంటారు. వీరు కొంత సమయం ఉత్సాహంతోనూ మరి కొంత సమయం నిరుత్సాహంగానూ ఉంటారు. కొంత కాలం ధైర్యము మరి కొంత కాలం భయం కలిగి ఉంటారు. కొంత కాలం ధనవంతులుగా మరి కొంతకాలం ధనహీనులుగా ఉంటారు. స్థూలంగా మానసిక స్థితి, సందలు అస్థిరంగా ఉంటాయి. అభిప్రాయాలూ తరచూ మార్చుకుంటారు. మిత్రులనూ తరచూ మార్చుకుంటారు. భోజన ప్రియులుగా ఉంటారు. ఆ కారణంగా యుక్త వయసు దాటే సమయానికి పొట్ట పెద్దది అయ్యే అవకాశం ఎక్కువ. స్వతంత్రించి ఏకార్యం చెయ్య లేరు. నీటి పారుదల, జల విద్యుత్, ప్రజా ప్రాతినిధ్యం, బియ్యము, వస్త్రములకు సంబంధించిన వృత్తులలో రాణిస్తారు. పాండు రోగం, క్షయ, మధుమేహం, శ్వాశకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.
చంద్రుని కారకత్వాలు
చంద్రుడు తల్లికి, జలరాంతాలు, జలం, పూలు, సముద్రం, నదులు, ముఖము, ఉదరం, మహిళా సంఘాలకు, స్త్రీ సంక్షేమ సంఘాలకు చందుడు కారకత్వం వహిస్తాడు. వృత్తి సంబంధంగా నౌకా వ్యాపారం, ఓడ రేవులు, వంతెనలు, ఆనకట్టలు, చేపల పెంపకం, వెండి, ముత్యములకు కారకత్వం వహిస్తాడు. వ్యాధులలో రక్త హీనత, అతి మూత్రం, గర్భ సంబంధిత వ్యాధులు, వరిబీజము, బేదులు, మానసిక వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, కేన్సర్ (రాచ పుండు) మొదలైన వాటికి కారకుడు, ఆహార సంబంధంగా చెరకు, తేనె, పాలు, పెరుగు, భోజనము,
గోధుమలు, జొన్నలు, రొట్టెలు,గోధుమలు, చేపలు, పంచదార,
అరటి పండు, నెయ్యి, దోసకాయలు, తమలపాకులు, గుమ్మడి, క్యాబేజి, కర్బూజా ఫలం,కుక్కగొడుగులు, ఆవులు, గుడ్లు, తాబేల, గుడ్లగూబ, బాతు, గబ్బిలం, పిల్లి, నీటి గుర్రం, సొర చేపల వంటి ప్రాణులకు కారకత్వం వహిస్తాడు., తిమింగలం మొదలైన ప్రాణులకు కారకత్వం వహిస్తాడు. గుడ్లు, క్కర్పూరం, నికెల్, జర్మన్ సిల్వర్ లాంటి వస్తువులకు కారకత్వం వహిస్తాడు. సంగీతం, నాటకం, కవిత్వం లాంటి లలిత కళలకు కారకత్వం వహిస్తాడు.
మనస్తత్వ శాస్త్రము పఠనం, వ్యవసాయం, విద్యా సంబంధిత వృత్తులు, జల వనరులవంటి వృత్తులకు కారకత్వం వహిస్తాడు. మూలికలు, స్త్రీలు, జీర్ణ వ్యవస్థ, జున్ను చంద్రుడు కారకత్వం వహించే ఇతరములు.
చంద్రుడు రాశులు
లగ్నంలో చంద్రుడు ఉన్న జాతకుడు దృఢశరీరము కలిగినవాడు, చిరంజీవి, నిర్భయుడు, ధనవంతుడు ఔతాడు. క్షీణచంద్రుడు ఉన్నప్పుడు ఫలితాలు తారుమారుగా ఉంటాయి.
చంద్రుడు ద్వితీయంలో ఉన్నవాడు ధనవంతుడు, విద్యావంతుడు, మృదుభాషి, అంగలోపం కలవాడుగా ఉంటాడు.
తృతీయ స్థానంలో చంద్రుడు కలిగి ఉన్న జాతకుడు సోదరులు కలవాడు, బలవంతుడు, శౌర్యవంతుడు, స్త్రీలను ఆకర్షించువాడు ఔతాడు. బహుకష్టములను పొందుతాడు.
చతుర్ధస్థానమున ఉన్న జాతకుడు సుఖజీవి, భోగముల యందు ఆసక్తుడు, మిత్రులు కలవాడు, వాహనములు కలవాడు, కీర్తివంతుడు ఔతాడు.
పంచమ స్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు మేధాసంపద, సుపుత్రులు కలవాడు, ఠీవి కలవాడు, మంత్రిపదవి అలంకరించు వాడు ఔతాడు.
షష్టమ స్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు అల్పజీవి, అమాయకుడు, ఉదర శూల (కడుపు నొప్పి) కలిగినవాడు, దీనుడు ఔతాడు.
సప్తమ స్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు సౌమ్యవంతుడు, అందమైన యువతుల హృదయమున స్థానము కలిగినవాడు, సుందరుడు అయి సుందర కళత్రము కలిగి ఉంటాడు.
అష్టమ స్థానమున చంద్రుడు కలిగిన జాతకుడు రోగపీడితుడు, అల్పాయుష్మంతుడు ఔతాడు. క్షీణ చంద్రుడు అయిన ఫలితములలో మార్పులు ఉంటాయి.
నవమ భావమున చంద్రుడు ఉన్న జాతకుడు అభివృద్ధి, పవిత్రుడు, పుత్ర సంతానం కలిగినవాడు, విజయము, కార్యం ఆరంభించగానే శుభఫలితములను కలిగి ఉంటాడు. విశాల హృదయము సహాయ గుణము కలిగి ఉంటాడు.
దశమస్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు ఔషధ సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిగినవాడు ఔతాడు.
ఏకాదశ స్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు విశాలహృదయం కలిగి, చిరంజివి, ధనవంతుడు ఔతాడు.
ద్వాదశ స్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు ద్వేషము కలవాడు, దుఃఖములు, క్లేశం, అవమానం, నిరుత్సాహం పొందుతూ ఉంటాడు.
చంద్ర కవచమ్
అస్య శ్రీ చంద్ర కవచస్య | గౌతమ ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీ చంద్రో దేవతా | చంద్ర ప్రీత్యర్థే జపే వినియోగః ||
ధ్యానం
సమం చతుర్భుజం వందే కేయూర మకుటోజ్వలమ్ |
వాసుదేవస్య నయనం శంకరస్య చ భూషణమ్ ||
ఏవం ధ్యాత్వా జపేన్నిత్యం శశినః కవచం శుభమ్ ||
అథ చంద్ర కవచమ్
శశీ పాతు శిరోదేశం భాలం పాతు కలానిధిః |
చక్షుషీ చంద్రమాః పాతు శ్రుతీ పాతు నిశాపతిః || 1 ||
ప్రాణం క్షపకరః పాతు ముఖం కుముదబాంధవః |
పాతు కంఠం చ మే సోమః స్కంధే జైవాతృకస్తథా || 2 ||
కరౌ సుధాకరః పాతు వక్షః పాతు నిశాకరః |
హృదయం పాతు మే చంద్రో నాభిం శంకరభూషణః || 3 ||
మధ్యం పాతు సురశ్రేష్ఠః కటిం పాతు సుధాకరః |
ఊరూ తారాపతిః పాతు మృగాంకో జానునీ సదా || 4 ||
అబ్ధిజః పాతు మే జంఘే పాతు పాదౌ విధుః సదా |
సర్వాణ్యన్యాని చాంగాని పాతు చంద్రోఖిలం వపుః || 5 ||
ఫలశ్రుతిః
ఏతద్ధి కవచం దివ్యం భుక్తి ముక్తి ప్రదాయకమ్ |
యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్ || 6 ||
|| ఇతి శ్రీచంద్ర కవచం సంపూర్ణమ్ ||
చంద్రదర్శనం సందర్భంగా చంద్ర స్తోత్రం
చంద్ర దర్శనం చాలా ముఖ్యమైన ఆచారం. ప్రతి నెలా అమావాస్య తరువాత వచ్చే మొదటి రోజు, పాడ్యమి నాటి చంద్రుని దర్శించి పూజించటం అనాదిగా వచ్చే ఆచారం.
సూర్యాస్తమయం అయిన వెంటనే చంద్ర దర్శనానికి మంచి సమయం.
ఈ చంద్రదర్శనాన్ని పండగలా ఆచరించేవారికి సిరి సమృద్ధికి లోటువుండదు. హిందువులు ఆ రోజున ఉపవాసం వుంటారు. చంద్రుని దర్శనం అయ్యాక పూజ చేస్తారు. అప్పుడు ఉపవాసం ముగించి ఆహారం స్వీకరిస్తారు.
చంద్రదర్శనం సందర్భంగా చంద్రుని స్తుతీంచే స్తోత్రములు.
ఆ పర్వదినం రోజున కాని, చంద్ర గ్రహ దోషాలతో బాధపడుతున్న వారు కాని చదివితే వారికి సుఖసంతోషాలు సమకూరుతాయి.
చంద్ర స్తోత్రం
చంద్రస్య శ్రూణునామాణి, శుభదాని మహీపతే,
యాని శృత్వ నరోదుఖాన్ ముచ్యతే నత్ర సంశయః,
1 ఓ మహారాజా, చంద్రుని పవిత్ర నామాలు వినండి,
వినటం ద్వారా ఏ సంశయం లేకుండా మీ కష్టాలన్నీ తీరుతాయి.
సుధాకరో, విధు, సోమో, గ్లౌరబ్జో, కుముదప్రియ,
లోకప్రియ, శుభ్రభాను, చంద్రామ, రోహిణీపతీ.,
2 పూ పుప్పొడి సృష్టికర్త, క్షీణించేవాడు, క్షీరంలోంచి జనించిన వాడు,
పద్మప్రియుడు, అందరికీ పాత్రుడు, అందగాడు,
అలసటను దూరంచేసే వాడు, ప్రముఖుడు, రోహిణికి భర్త,
శశీ, హిమకరో, రాజ, ద్విజరాజో, నిశాకర,
ఆత్రేయ, ఇందు, సీతాంసు, రోషాధీశ, కాలనిధి.,
3 కుందేలులను పెంచుకునేవాడు, మంచుని తయారుచేసేవాడు, రాజు, బ్రాహ్మణులకు విభువు,
రాత్రిని సృష్టించేవాడు, అత్రి వంశజుడు, తెల్లనివాడు,
చల్లనివాడు, కాంతికి రారాజు, కళలకు నెలవు,
జైవత్రుకో, రామభ్రాత,
క్షీరోధర్ణవమ్ సంభవ,
నక్షత్రనాయక, శంభుశిర
చూడామణిర్, విభు
4 శాశ్వతమైనవాడు, లక్ష్మీసోదరుడు,
పాల నుంచి జనించినవాడు, అన్నిటినీ
జరిగేలా చూసేవాడు, నక్షత్రాలకు రారాజు,
శివుని తలపై అలంకారం, శక్తిమంతుడు.
తాపహర్త, నాభో దీపో, నమన్యేతని యా పడేత్,
ప్రత్యాహం భక్తి సంయుక్త తస్య పీడ వినాశ్యతి.,
5 బాధను హరించేవాడు, చీకటిలో వెలుగు.
ఈ నామాలు ఎవరైనా భక్తితో చదివితే
వారి కష్టాలు అంతమవుతాయి.
తాడినే చ పడేధ్యస్తు లభేత్ సర్వం సమీహతం,
గ్రహాధీనం చ సర్వేషం భవేత్ చంద్రబలం సదా.,
6 ఇది సోమవారం చదివిన వారికి అన్ని కోరికలు సిద్ధించి,
చంద్రునితో సహా అన్ని గ్రహాలు అనుకూలంగా మారతాయి.
Comments
Post a Comment