చంద్రుడు జ్యోతిషం




చంద్రుడు జ్యోతిషం

రచన ప్రముఖ జ్యోతిష్యులు డా.కొమర్రాజు భరద్వాజ్ శర్మ చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. చంద్రుడు స్త్రీ గ్రహం, వైశ్య జాతి, శ్వేత వర్ణం, పరిమాణం పొట్టి, వయస్సు డెబ్బై సంవత్సరాలను సూచించును. దిక్కు వాయవ్యం, తత్వం జల తత్వం, ప్రకృతి వాత, శ్లేష్మములు. ఋతువులలో వర్ష ఋతువును, లోహములలో వెండిని, రత్నములలో ముత్యమును సూచించును. చంద్రుడు చతుర్ధ భావంలో దిక్బలం కలిగి ఉంటాడు. గ్రహములలో చంద్రుడు ఏడవ వాడు. సత్వగుణ సంపన్నుడైన చంద్రుడు కృష్ణ పక్ష దశమి నుండి శుక్ల పక్ష పంచమి వరకు పూర్ణ చంద్రుడు. శుక్ల పంచమి నుండి అమావాస్య వరకు క్షీణ చంద్రుడు, అమావాస్య నుండి కృష్ణ పక్ష దశమి వరకు మధ్యమ చంద్రుడు అని శాస్త్రం చెప్తుంది. చంద్రుడు రోహిణిహస్తశ్రావణ నక్షత్రాలకు అధిపతి. శరీరావయవములలో మగవారి ఎడమ కన్ను, స్త్రీల కుడి కన్ను శరీర మధ్య భాగమును సూచించును. చంద్రుడు కర్కాటక రాశికి ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడు వృషభంలో మూడు డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిలో ఉంటాడు. వృషభంలో మూడు నుండి ఇరవై ఏడు డిగ్రీల వరకు మూల త్రికోణంలో ఉంటాడు. వృశ్చికంలో మూడు డిగ్రీల వరకు పరమ నీచ స్థితిలో ఉంటాడు. బుధుడు, సూర్యుడు మిత్రులు. చంద్రుడికి శత్రువులు లేరు.

చంద్రుని ప్రభావం

చంద్ర ప్రభావిత వ్యక్తులు శ్లేష్మ వ్యాధి పీడితులుగా ఉంటారు. వీరు కొంత సమయం ఉత్సాహంతోనూ మరి కొంత సమయం నిరుత్సాహంగానూ ఉంటారు. కొంత కాలం ధైర్యము మరి కొంత కాలం భయం కలిగి ఉంటారు. కొంత కాలం ధనవంతులుగా మరి కొంతకాలం ధనహీనులుగా ఉంటారు. స్థూలంగా మానసిక స్థితి, సందలు అస్థిరంగా ఉంటాయి. అభిప్రాయాలూ తరచూ మార్చుకుంటారు. మిత్రులనూ తరచూ మార్చుకుంటారు. భోజన ప్రియులుగా ఉంటారు. ఆ కారణంగా యుక్త వయసు దాటే సమయానికి పొట్ట పెద్దది అయ్యే అవకాశం ఎక్కువ. స్వతంత్రించి ఏకార్యం చెయ్య లేరు. నీటి పారుదల, జల విద్యుత్, ప్రజా ప్రాతినిధ్యం, బియ్యము, వస్త్రములకు సంబంధించిన వృత్తులలో రాణిస్తారు. పాండు రోగం, క్షయమధుమేహం, శ్వాశకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.

చంద్రుని కారకత్వాలు

చంద్రుడు తల్లికి, జలరాంతాలు, జలం, పూలు, సముద్రం, నదులు, ముఖము, ఉదరం, మహిళా సంఘాలకు, స్త్రీ సంక్షేమ సంఘాలకు చందుడు కారకత్వం వహిస్తాడు. వృత్తి సంబంధంగా నౌకా వ్యాపారం, ఓడ రేవులు, వంతెనలు, ఆనకట్టలు, చేపల పెంపకం, వెండి, ముత్యములకు కారకత్వం వహిస్తాడు. వ్యాధులలో రక్త హీనత, అతి మూత్రం, గర్భ సంబంధిత వ్యాధులు, వరిబీజము, బేదులు, మానసిక వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, కేన్సర్ (రాచ పుండు) మొదలైన వాటికి కారకుడు, ఆహార సంబంధంగా చెరకుతేనెపాలుపెరుగుభోజనము
అరటి పండునెయ్యిదోసకాయలుతమలపాకులుగుమ్మడి, క్యాబేజి, కర్బూజా ఫలం,కుక్కగొడుగులు, ఆవులుగుడ్లుతాబేలగుడ్లగూబబాతుగబ్బిలంపిల్లి, నీటి గుర్రం, సొర చేపల వంటి ప్రాణులకు కారకత్వం వహిస్తాడు., తిమింగలం మొదలైన ప్రాణులకు కారకత్వం వహిస్తాడు. గుడ్లు, క్కర్పూరం, నికెల్, జర్మన్ సిల్వర్ లాంటి వస్తువులకు కారకత్వం వహిస్తాడు. సంగీతం, నాటకం, కవిత్వం లాంటి లలిత కళలకు కారకత్వం వహిస్తాడు. 
మనస్తత్వ శాస్త్రము పఠనం, వ్యవసాయం, విద్యా సంబంధిత వృత్తులు, జల వనరులవంటి వృత్తులకు కారకత్వం వహిస్తాడు. మూలికలు, స్త్రీలు, జీర్ణ వ్యవస్థ, జున్ను చంద్రుడు కారకత్వం వహించే ఇతరములు.

చంద్రుడు రాశులు

లగ్నంలో చంద్రుడు ఉన్న జాతకుడు దృఢశరీరము కలిగినవాడు, చిరంజీవి, నిర్భయుడు, ధనవంతుడు ఔతాడు. క్షీణచంద్రుడు ఉన్నప్పుడు ఫలితాలు తారుమారుగా ఉంటాయి.

చంద్రుడు ద్వితీయంలో ఉన్నవాడు ధనవంతుడు, విద్యావంతుడు, మృదుభాషి, అంగలోపం కలవాడుగా ఉంటాడు.

తృతీయ స్థానంలో చంద్రుడు కలిగి ఉన్న జాతకుడు సోదరులు కలవాడు, బలవంతుడు, శౌర్యవంతుడు, స్త్రీలను ఆకర్షించువాడు ఔతాడు. బహుకష్టములను పొందుతాడు.

చతుర్ధస్థానమున ఉన్న జాతకుడు సుఖజీవి, భోగముల యందు ఆసక్తుడు, మిత్రులు కలవాడు, వాహనములు కలవాడు, కీర్తివంతుడు ఔతాడు.

పంచమ స్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు మేధాసంపద, సుపుత్రులు కలవాడు, ఠీవి కలవాడు, మంత్రిపదవి అలంకరించు వాడు ఔతాడు.

షష్టమ స్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు అల్పజీవి, అమాయకుడు, ఉదర శూల (కడుపు నొప్పి) కలిగినవాడు, దీనుడు ఔతాడు.

సప్తమ స్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు సౌమ్యవంతుడు, అందమైన యువతుల హృదయమున స్థానము కలిగినవాడు, సుందరుడు అయి సుందర కళత్రము కలిగి ఉంటాడు.

అష్టమ స్థానమున చంద్రుడు కలిగిన జాతకుడు రోగపీడితుడు, అల్పాయుష్మంతుడు ఔతాడు. క్షీణ చంద్రుడు అయిన ఫలితములలో మార్పులు ఉంటాయి.

నవమ భావమున చంద్రుడు ఉన్న జాతకుడు అభివృద్ధి, పవిత్రుడు, పుత్ర సంతానం కలిగినవాడు, విజయము, కార్యం ఆరంభించగానే శుభఫలితములను కలిగి ఉంటాడు. 
విశాల హృదయము సహాయ గుణము కలిగి ఉంటాడు.

దశమస్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు ఔషధ సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిగినవాడు ఔతాడు.

ఏకాదశ స్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు విశాలహృదయం కలిగి, చిరంజివి, ధనవంతుడు ఔతాడు.

ద్వాదశ స్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు ద్వేషము కలవాడు, దుఃఖములు, క్లేశం, అవమానం, నిరుత్సాహం పొందుతూ ఉంటాడు.







Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: