జోతిష్య శాస్త్రం.. వర్షాలు



జోతిష్య శాస్త్రం.. వర్షాలు 


పూర్వపు ఋషులు ఖగోళాన్ని తమదైన పద్ధతిలో గమనించి సూత్రకరించారు వేదాలలో కూడా భూగోళానికి సంబంధించి అనేక సూక్త ములు పేర్కొన్నారు వాటిలోభూసూక్తం ప్రధానమైనది.. భూమి ఉపరితలంపై అనేక మార్పులు సంభవించాయి.. వరాహామిహురుడు తన బృహసంహిత వీటిని అనుసరించి కొన్ని సాధారణసూత్రాలు ప్రతిపాదించారు... ఇలా ప్రతిపాధిస్తూ... ఎడారి ప్రాంతంలో వీటిని అపాదించే వీలులేదు అనికూడా చెప్పారు...
ఇక్కడ మనకు అవన్నీ అవసరంలేదు... దక్షిణ భారత.దేశానికి సంభందించి మాత్రం తెలుసు కుందాం....
.ప్రస్తుతం ఓజోన్ పొర మెరుగుపడినది... కనుక..

1....జూన్. జులై.. ఆగస్టు... వృషభ. మిధున..కర్కాటక. మాసాలు అంటారు నైరుతి రుతుపవనాలు ప్రభావంచే వర్షాలు కురుస్తాయి...
2...బుధ. శుక్రులు. మీన.మేష. వృషభ. మిధున రాశులలో మరియు కర్కాటక రాశిలో కలిసిన సమయంలోను వర్షాలు కురుస్తాయి
3...పై రాశులలోకి రవి గ్రహం ప్రవేశించే సమయం పగలైతే రాత్రిపూట వర్షాలు కురుస్తాయి.. రాత్రిపూట ప్రవేశిస్తే.. శుక్లపక్ష ములో వర్షాలు కురుస్తాయి..
4....చంద్రుడు జలరాశిలో ఉండగా వర్షాలు కురుస్తాయి...(నేను బోర్లు వేయించి ముహుర్తాలు అవిధంగానే చూస్తాను)
5....వృషభ రాశిలో కుజుడు చంద్రుడు కలిసినా వర్షం కురుస్తుంది
6...రవి అరుద్రా నక్షత్రం లో ప్రవేశించే సమయాన వర్షాలు కురుస్తాయి కానీ రవికి ఇరువైపులా పాపగ్రహాలు ఉండకూడదు.
7...పైన పొర్కొన రాశులలో శుక్రుడు ఉండి గురునిచే చూడబడినా వర్షాలు కురుస్తాయి...
8...పైన పొర్కొన రాశులలో చంద్రుడు ఉండి మూడు గ్రహాలు కలిసినా సరే వర్షం కురుస్తుంది.
9...పగటి సమయంలో సముద్రం గర్జించినా వర్షం కురుస్తుంది
10...మీనమాసంలో సముద్రం ప్రశాంతంగా ఉన్న వర్షం కురుస్తుంది...
11....చకోర పక్షి వరుసగా.. వారం రోజులు అరిస్తే తప్పకుండా వర్షం కురుస్తుంది.
12...పడమటి దిక్కులో.. ఇంద్రధనుస్సు ఏర్పడినా వర్షం వస్తుంది...
13....చంద్రుని చుట్టూ పరివేశం ఏర్పడినా వర్షం కురుస్తుంది
14...నీటి కుంటల వద్ద పక్షులు స్నానం చేసిన లేదా కీటకాలు మూగినా వర్షం వస్తుంది
15....పగటి పూట కప్పలు అరిచినా వర్షం వస్తుంది....

ప్రస్తుతం గ్రహస్తితి అనుసరించి చూస్తే... ఈ వ్యవసాయ సంవత్సరం.. రైతు సంవత్సరం అని...సంతోషం గా ప్రకటిస్తున్నాను... 

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: