షష్ఠీదేవి పూజ విధానం.

షష్ఠీదేవి పూజ విధానం. 

వంశం లేనివారు, వంశాంకురలను నిలుపుకోవాలనుకునేవారు షష్ఠీదేవి పూజ తప్పక చేయాలి. ప్రస్తుత మన సంస్కృతిలో పుట్టినరోజు నాడు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి కొత్తబట్టలు ధరించి కొవ్వొత్తులను వెలిగించి దీపాలార్పటం, కేకు కట్ చేయటం, ఐస్ క్రీములు పంచటం, చాక్లెట్ లు పంచటమనే పాశ్చాత్య సంస్కృతిని అవలంబిస్తున్నారు. 

 మన సంస్కృతి, సాంప్రదాయం ప్రకారం జన్మతిధి రోజున బాలలకు అదిష్ఠాన దేవత అయిన జన్మజునికి ఆయువును ఇచ్చే విష్ణు మాయా స్వరూపిని షష్ఠీదేవిని  పూజించాలి.  భార్యా గర్భవతి అయిన నాటినుండి ప్రతిమాసం శుద్ధ షష్ఠినాడు ఈ పూజను ఆచరిస్తూ బిడ్డ పుట్టిన ఆరవరోజు వరకు షష్ఠీదేవిని కొలవటం వలన  పుట్టే బిడ్డలకు ఆయువు, శక్తి కలుగుతాయి. అనంతరం షష్ఠీదేవి పూజను ప్రతి సంవత్సరం జన్మదినం రోజున జరుపుకోవాలి. ఇలా 13 సంవత్సరాల వరకు షష్ఠీదేవిని పూజించిన వారి సంతానం చిరంజీవులవుతారు. షోడశ సంస్కారాల సమయంలో కూడా ఈమెను పూజించటం శుభదాయకం. 

మూల మంత్రం :- మూల "మోం (ఓం) హ్రీం షష్ఠీద్యై స్వాహేతి " విధి పూర్వకం!  అష్టోక్షరం మహా మంత్రం యధాశక్తి జపేన్నరః 
లక్షసార్లు ఈ మూలమంత్రం జపించిన వారికి సుపుత్రోదయం, ఐశ్వర్యం తధ్యమని బ్రహ్మ వాక్కు. 

షష్ఠీదేవి స్తోత్రాన్ని సంవత్సర కాలం పాటు ఎవరైతే శ్రద్ధగా వింటారో దీర్ఘాయుష్మంతుడైన కుమారుని కంటారు. కటిక గొడ్రాలు సైతం ఈ స్తోత్రాన్ని పఠించినట్లైతే తప్పక మాతృత్వాన్ని పొందుతారు. కుమారుడు రోగగ్రస్తుడైన సమయంలో షష్ఠీదేవి స్తోత్రాన్ని తల్లిదండ్రులు నెలరోజుల పాటు పఠించిన లేదా శ్రద్ధగా విన్న రోగ విముక్తి కలుగుతుంది. 

షష్ఠీదేవి స్తోత్రం 

నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై షష్ట్యై దేవ్యై నమో నమః
వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః
సుఖ దాయై మోక్షదాయై షష్ట్యై దేవ్యై నమో నమః
సృష్టె షష్ఠాంశరూపాయై సిద్ధాయైచ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీ దేవ్యై నమో నమః
సారయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః
బాలాధిష్ఠా తృ దేవ్యై చ షష్ఠీ దేవ్యై నమో నమః
కల్యాణ దేవ్యై కల్యాణ్యై ఫల దాయైచ కర్మణాం
ప్రత్యక్షా యై సర్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్యేషాం సర్వ కర్మసు
దేవ రక్షణ కారిణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః
శుద్ధ సత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా
హింసా క్రోధ వర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః
ధనం దేహి జయం దేహి పుత్రందేహి సురేశ్వరీ !
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్ఠీ దేవి నమో నమః
దేహి భూమిం ప్రజాం దేహి విద్యాందేహి సుపూజితే
కల్యాణం చ జయం దేహి విద్యా దేవి నమో నమః
నమోస్తుతే నమోస్తుతే షష్ఠీ దేవి నమో నమః

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: