బంధనయోగం.. వివరణ... ...(బంధనఅంటే జైలు)...
బంధనయోగం.. వివరణ... ...(బంధనఅంటే జైలు)...
లగ్న షష్టాధి పతులు కేంద్ర కోణము లందు శని రాహు. కేతువులతో కలిసియున్నా.. దృష్టి యున్నా బంధన యోగం ఏర్పడుతుంది...
ఉచ్చ స్థాన స్థితిలో రాహువు బలవంతుడుగా వున్నా శనిగ్రహ దృక్ దోషం వల్ల కూడా బంధన యోగం ఏర్పడుతుంది...
జైలుకు వెళ్లిన ప్రతివాడు గొప్ప అనుకుంటే వాడంత మూర్ఖుడులేడు..
ఈ బంధన యోగము. ప్రభుత్వం వలనా. కోర్ట్ వలనా.. తీవ్రవాదుల వలన బంధించ బడుట కూడా బంధన యోగమే... ప్రస్తుతం మనం అనుభవిస్తున్నది కూడా బంధన యోగమే..
అరిష్టస్థానాధిపతులచేత రాహువు అతిక్రాంత బంధన యోగం ఇవ్వవచ్చు అనగా ఇతర గ్రహములు ఇచ్చు బంధన యోగమును ముందుగా ఇచ్చును. స్వత్రముగాను. ఇతర గ్రహాయుతి వలనను. చక్రవర్తికైనా ఇవ్వగల ప్రబలమైన బలవంతుడు రాహువు.. నెఫోలియన్... బెనజీర్ భుట్టో.. నెల్సన్ మండేలా. మహాత్మా గాంధీ. జవహర్ ల్లాల్నెహ్రూ.. వీరు బంధన యోగం చేత జైల్ జీవితం అనుభవించారు... ఇక రాముల వారు... పాండవులు... శనిగ్రహ గోచారా ప్రభావం చేత మాత్రమే అరణ్యవాసం చేశారు...*(రాముడు దేవుడే అయినా మానవ జన్మ ఎత్తినందున గ్రహ ప్రభావం తప్పలేదు)..ఇక్కడ రాహుగ్రహ దుర్యోగం చేత జైలుకు వెళ్లిన వారు అందరూ... ఒక మహోన్నత మైన ఆశయంతో వెళ్లారు.. అదే విధంగా... కుమారీ జయలలిత... లాలూ ప్రసాద్ యాదవ్.. శశికళ.. చార్లెస్ శోభరాజ్... వీరు జైలుకు వెళ్లారు.. గాంధీజీ జైలుకు వెళ్ళటం ఒక మహోన్నత ఆశయ సాధన ఒకదేశ స్వాతంత్ర్య. ఫలం భానిసత్వ విముక్తి కొరకు... ఇక ఆర్ధిక నేరాలకు. అత్యలు.మానభంగం చేసినవారు జైలుకు వెళ్ళటం దుర్యోగం...
ఇంకొక పరిశీలన సాధారణ స్థితిలో ఎన్నికల్లో
పోటీ చేస్తా డిపాజిట్ రానివారు జైల్లో ఉండి పోటీచేసి మంచి మెజార్టీతో గెలవడం... ఇది బంధన యోగ విముక్తికి తోడ్పడుట జరుగును.. అట్టి విజయం బంధన యోగ విముక్తికి తోడ్పడవచ్చురాహుకేతు వులు తమయోగ భావాన్ని వేరువేరుగా ప్రసాధిస్తున్నారు అని స్పష్టమై పోతుంది...
ఒక యుగ కర్త శ్రీకృష్ణుడు జైల్లో జన్మించారు..ఐనా ఆయనను తక్కువ చెయ్యలేము... గాంధీ జైల్ జీవితం అనుభవించారు ఆయన కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిళ్లలేదు... ఆయన జైలుకు వెల్లింది.. ఒక దేశ బానిస విముక్తి స్వాతంత్ర్య ఫలం కోసం.. ఇక చార్లెస్ శోభరాజ్. తదితరులు ఆర్ధిక నేరాలు చేసి.. వారిని ఉన్నతులుగా భావించ జాలము... బెనజీర్భుట్టో రాజకీయ కారణాలతో జైల్ అనుభ వించారు ఆమెను దొంగ అనలేము...ఆర్ధిక నేరాలు చేసి జైలు అనుభవించిన వారికి.. ఒక మహోన్నత ఆశయం కొరకు జైలుకు వెళ్లిన వార్ని ఒకే గాటన కట్టలేము జోతిష్య శాస్త్ర రీత్యా అని భావించాలి...
కొన్నిసార్లు నిరపరాదులు రాజకీయ కారణాల వల్ల జైలుకు వెళ్ళవలసి వచ్చును..
కానీ ఆర్ధిక నేరాల్లో కానీ. హత్య. మానభంగం. వంటి వాటిలో జైలుకు వెళ్లినవారు ఒకే కోవకిందకురారు అని విజ్ఞులు గమనించాలి...
మానభంగం. హత్య చేసి. లేదా దొంగతనం చేసి జైలుకు వెళ్లివచ్చిన వారు కూడా నేటి కాలంలో... దేశ భక్తులుగా చెలామణి అవ్వటం చూస్తే ఆశ్ఛర్యము వెయ్యక మానదు.. అది వారి వ్యక్తిగత జాతకం అనుసరించి ప్రచారం. విజయం అధికారం సంప్రాప్తమగు అంశము...
వీటిలో కూడా అంధకారబంధన యోగం.. చీకటి గదిలో ఉండుట... విదేశీ బంధన యోగం విదేశమందు జైల్లో ఉండుట... దీనికి ఉదాహరణగా... ఒక దేశ సైనికుడు...శత్రు దేశానికి చిక్కి అక్కడి జైల్లో ఉంటే అది దేశ భక్తి... అదే ఆర్ధిక నేరం చేసివిదేశీ సంస్థలను మోసం చేసి విదేశీజైల్లో ఉంటే అంతర్జాతీయ ఆర్థిక నెరగాడు..చూసారా విచిత్రం... సైనికుడు... అంతర్జాతీయ ఆర్థిక నెరగాడు. ఇద్దరూ విదేశంలో జైల్లో ఉన్నా ఒకడు నెరస్థుడు. ఒకడు దేశ భక్తుడు....
ఇలా చాలా రకాల బంధన యోగాలు ఉంటాయి...విజ్ఞులు తేడాలు గమనించాలని బంధన యోగాలు వివరించాను...
సర్వేజనా సుఖినో భవతు...
మీ... రామలింగ వర ప్రసాద్. ప్రత్తిపాటి
ఖమ్మంలో నివాసం
ఫోన్...9966456118...
Comments
Post a Comment