సర్ప దోషము లేదా సర్ప శాపము:-
సర్ప దోషము లేదా సర్ప శాపము:-
(1) రాహువు 5వ యింట వుండి కుజుని చేత చూడబడినను,
(2) మేష, వృశ్ఛికములలో (కుజ క్షత్రమున) రాహువు ఉండినను,
(3)పంచమాధిపతి రాహువు తో కూడినను, శని పంచమమునందు ఉన్నను, శని చంద్రునితో కూడినను, చూడబడినను,
(4) పుత్ర కారకు డైన గురుడు రాహువుతో కలిసి వున్నను,
(5) పంచమాధి పతి బలహీనుడైనను, లగ్నాధిపతి కుజునితో కలిసి వున్నను,
(6) గురుడు కుజునితో కలసియున్నను, లగ్నములో రాహువున్నను,
(7) పంచమాధిపతి దుస్థానమున, నీచ, శతృ క్షేత్రమునున్నను,
(8) కుజాంశలో కుజుడున్నను,
(9) పంచమాధిపతి బుధుడైనను, పంచమాధిపతితో రాహువు కలిసి వున్నను, బుధుడు చూసినను
(10) లగ్నమున రాహువు, మాంది యున్నను
(11) 5 వ స్థానములో రవి, శని, కుజుడు, రాహువు, గురు, బుధ లుండి పంచమ లగ్నాధిపతులు బలహీనులైనను,
(12) లగ్నాధిపతి రాహువుతో కూడినను, పంచమాధిపతి కుజుడైనను, కారకుడు రాహువుతో కూడినను....సర్ప దోషముగా తెలియవలెను.
ఈ దోష నివారణకై నాగ పూజ లేదా నాగ ప్రతిష్ఠ చేయవలెను. యధావిధిగా గో, భూ, తిల, హిరణ్య ములు దానమీయవలెను. దీని వలన దోషము పోయి పుత్ర సంతతి కలిగి కులాభివృద్ధి, సంపత్సమృద్ధి కలుగ గలదు.
మీ మిత్రుడు యస్. నాగేశ్వర శర్మ (ప్రకాష్)
🙏🙏🙏🙏🙏
Comments
Post a Comment