గుళికుని (మాంది)ఫలము

గుళికుని (మాంది)ఫలము

గుళికుని (మాంది)ఫలము

గుళిక లగ్నమున ఉన్న జాతకుడు - రోగార్తుడు, కాముకుడు, పాపాత్ముడు శఠుడు, దుష్టస్వభావుడు, దుఃఖితుడు అగును. ద్వితీయమున ఉన్న - వికృతుడు, దుఃఖితుడు, క్షుద్రుడు, వ్యసనము కలవాడు, సిగ్గులేనివాడు, నిర్ధనుడు అగును. 
తృతీయమున ఉన్న - సుందరుడు, గ్రామాధికారి, పూణ్యకర్మలు చేయువాడు, సజ్జనప్రియుడు, రాజపూజితుడు అగును; 
చతుర్ధమున ఉన్న - రోగి సుఖము లేనివాడు, ఎప్పుడును చెడుపనులు చేయువాడు, వాతపిత్తము లేక్కువ కలవాడగును.
పంచమమున ఉన్న - పరనిందకుడు, దరిద్రుడు, అల్పయుష్కుడు, ద్వేషి, క్షుద్రుడు, నపుంసకుడు, స్త్రీజితుడు, నాస్తికుడు నగును.
షష్ఠమందున్న - శత్రువులు లేనివాడు, పుష్టియైన శరీరము కలవాడు, ప్రకాశించువాడు, స్త్రీకిష్టుడు, ఉత్సాహవంతుడు, దృఢమైనవాడు, హితుడు నగును.
సప్తమమందున్న - స్త్రీజితుడు, చెడుపనులు చేయువాడు, జారుడు, బక్కవాడు, స్నేహము లేనివాడు, స్త్రీధనముతో బ్రతుకువాడు అగును.
అష్టమమందున్న - ఆకలిగోన్నవాడు, దుఃఖితుడు, క్రూరుడు, తీక్షరోగుడు, దయలేనివాడు, దరిద్రుడు, గుణరహితుడు నగును.
నవమమందున్న - ఎక్కువ కష్టములు కలవాడు, బక్కవాడు, దుష్టకర్ముడు, దయలేనివాడు, లోభి, గుణహీనుడు.
దశమమందున్న - పుత్రులు కలవాడు, సుఖి, భోగి, దేవతాపూజులు, అగ్నిహెూత్రము చేసికొనువాడు, యెాగమును ధర్మమును అశ్రయించినవాడగును.
ఏకాదశమందున్న - సుఖి, భోగి, ప్రజాధ్యక్షుడు, బంధువులకు హితము చేయువాడు, బక్కవాడు, జనమాన్యుడు అగును.
వ్యయమున ఉన్న - నీచకర్మలు చేయువాడు పాపుడు, సన్నని శరీరము కలవాడు, కురూపి, బద్ధకస్తుడు, నీచులన్న నిష్టము కలవాడు అగును.
ప్రాణపద ఫలములు, ప్రాణపదగ్రహము లగ్నమున ఉండగా పుట్టిన జాతకుడు - మూగవాడు, ఉన్మత్తుడు, బక్కవాడు, దుఃఖితుడు, చిక్కినవాడు, క్షీణుడు, రోగి, అగును. 
ద్వితీయమందున్న - ఎక్కువగా ధనము ధాన్యము సేవకుడు, సంతానము కలవాడు, సుందరుడు అగును.
తృతీయమందున్న - హింస చేయువాడు గర్వి, నిష్ఠురుడు, దుర్జనుడు, గురుభక్తి లేనివాడు అగును.
చతుర్థమందున్న - సుఖి, సుందరుడు, మిత్రుడు, స్త్రీకిష్టుడు, గురుభక్తి కలవాడు, సత్యతత్పరుడు, సాధువైన వాడగును.
పంచమమందున్న - సుఖము కలవాడు, మంచిపనులు చేయువాడు, దయకలవాడు, కోరికలు కలవాడగును. 
షష్టమందున్న - బంధువులకు శత్రువులకు వశుడు, తీక్ష్ణుడు, అజీర్ణము కలవాడు, నిర్దయుడు, దుష్టుడు, రోగి, ధని, అల్పాయుష్కుడు.
సప్తమమందున్న - ఈర్ష్యపడువాడు, కాముకుడు, తీవ్రమైన భయంకరమైన శరీరము కలవాడు, సేవించుటకు ఇష్టమైనవాడు, దుర్బద్ధి కలవాడు అగును.
అష్టమమందున్న - రోగము కలవాడు, రాజులు, బంధువులు, సేవకులు, పుత్రులు పెట్టు కష్టములకు బాధపడువాడు.
నవమమందున్న - పుత్రులు కలవాడు. ధనసంపన్నుడు, రూపసి, చూడముచ్చటైనవాడు, సేవకుడు, మంచివాడు, పండితుడు, (అన్నియు తెలిసినవాడు).
దశమమందున్న - వీర్యవంతుడు, బుద్ధిమంతుడు, నేర్పరి, రాజకార్య కోవిదుడు, దేవార్చన పరాయణుడు.
లాభమందున్న -పప్రసిద్ధుడు, గుణవంతుడు, ప్రాజ్ఞుడు, భోగి, ధనవంతుడు, తెల్లని శరీరము కలవాడు, అభిమానము కలవాడు.
వ్యయమందున్న - నీచుడు, దుష్టుడు, బక్కవాడు, బ్రాహ్మణులను బంధువులను ద్వేషించువాడు, నేత్రరోగి కావచ్చును. లేదా కాయకంటివాడగును. 

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12