శ్రీ సూక్తం విశిష్టత
వేద సంస్కృతిలో హృదయంలో భక్తిని ప్రోది చేయడానికి వేదసూక్త పఠనాన్ని విశేషంగా చేయాలని మహర్షులు ప్రతిపాదించారు. పురుషసూక్తం, శ్రీసూక్తం వేదసూక్తాల్లో సుప్రసిద్ధమైనవి. ఆర్షధర్మాన్ని ప్రతిష్ఠించడానికి, వేద సంస్కృతిని సంరక్షించడానికి, జ్ఞాన సముపార్జనకి, సకల ఐశ్వర్యసిద్ధికి వేదసూక్త పఠనం తప్పనిసరిగా చేయాలి. పురుష దేవుళ్లను అర్చన చేసేటప్పుడు వేదోక్తంగా పురుష సూక్త విధిలో పురోహితుని ద్వారా పూజదికాలను చెయ్యాలి. స్త్రీ దేవతామూర్తుల్ని పూజించేటపుడు శ్రీసూక్త విధాయకంగా గోత్ర నామాదులతో అర్చన చేయడం, చేయించడం జరుగుతుంది.
విశేషంగా నిర్వహించే పూజల్లో శ్రీ సూక్త విధాయకంగా అర్చనలుంటాయి. సూక్తులన్నీ ఉన్నతమైన వేదాంత భావాలతో నిండి ఉంటాయి.
వేదసూక్త పఠనంలోని పారలౌకిక ప్రయోజనాన్ని భక్తులు గ్రహించాలి. శ్రీ సూక్తం ఎంతో మహిమాన్వితమైనది. ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాన్ని పొందాలంటే శ్రీ సూక్తాన్ని మించిన వేదసూక్తం మరియొకటి లేదు. నిత్య పూజాక్రియల్లో శుభకార్య నిర్వహణలో ఈ సూక్త పఠనానికి ప్రాధాన్యత ఉంది. నిజమైన సిరి జ్ఞానమే అని శ్రీ సూక్తం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించాలి.
శ్రీ సూక్తంలోని మంత్రాలన్నీ విలువైనవి. ఒక మంత్రంలో జేష్టాదేవి దరిచేరకుండా చేయమనే ప్రార్థన ఉంటుంది. దారిద్య్రం అనగానే కేవలం ధనలేమి వల్ల సంక్రమించే అభాగ్యం కాదు. మానవుని ఆలోచనలు ఉతృష్టముగా లేనపుడు , ఉన్నతమైనవి కానపుడు భావదారిద్య్రం ఏర్పడుతుంది. అటువంటి భావ దారిద్య్రము లేకుండా చేయమని శ్రీ మహాలక్ష్మికి చేసే ప్రార్థనల్లో ఎంతో విశిష్టార్ధమున్నది. అమంగళకరమైన బాహ్య ఆటంకాలన్నింటినీ తొలిగించి హృదయం లోపల ఉన్న అజ్ఞానమనే మాయను మటుమాయం చేయమని ఆవిష్ణుపత్నిని, వైకుంఠనివాసినిని ప్రార్థించడం ఈ సూక్తంలో విశేషం. జ్ఞానమే నిజమైన సంపద అని పలుచోట్ల ఈ సూక్తం తెలుపుతుంది.
దేవతలను ప్రార్థించే మంత్రాలను ఋక్కులని వ్యవహరిస్తారు. అటువంటి కొన్ని ఋక్కులు కలిసి ఒక సూక్తము, కొన్ని సూక్తాలు కలిసి ఒక అనువాకము అలా కొన్ని అనువాకములు కలిసి ఒక మండలం అని వ్యవహరిస్తారు. గోసమృద్ధిని, వాక్కులో సత్యాన్ని మనస్సు నిండా సంతోషాన్ని , ఆనందాన్ని ప్రసాదించమని సిరిసంపదలకు ఆది దేవతయైన శ్రీ మహాలక్ష్మి కృప ఎల్లప్పుడూ ఉండాలనే ధ్యానంతో కూడిన ఒక విలువైన మంత్రం ఈ సూక్తంలో ఉంటుంది.
శుచిగా ఇంద్రియ నిగ్రహంతో పరిశుద్ధమైన మనస్సుతో ధనలక్ష్మి కరుణ కొరకు ఎల్లప్పుడూ జపిస్తుండాలి. పద్మాసనురాలైన లక్ష్మీ మాత దేని వలన ప్రపంచంలో సుఖాలంటాయో వాటిని ప్రసాదించమని ఈ సూక్తంలోని ఒక ప్రార్థన లోని ప్రబోధం.
పుత్రుల్ని, పౌత్రుల్ని వాహనాదుల్ని ఇవ్వమని ఆయుష్మంతులుగా చేయమని సూర్యుని లోని తేజస్సు, చంద్రుని లోని ప్రకాశము రెండూ కలిపి విరాజిల్లుతున్న శ్రీ మహాలక్ష్మిని ఉపాసిస్తున్నట్లుగా ఓ మంత్రంలో ఉంటుంది. భక్తి పొందాలంటే శ్రీ సూక్తం ఎల్లప్పుడూ జపించాలి. మహాలక్ష్మి కృపతోనే వర్షాలు కురుస్తాయి. పంటలు పండుతాయి. సౌభాగ్యం చేకూరుతుంది.
సర్వమంగళ స్వరూపిణియైన శ్రీ మహాలక్ష్మికి సర్వవేళలా మనతో వసించాలని భక్తితో ప్రార్థించాలి. క్షీర సముద్రంలో పుట్టిన, మహావిష్ణువుకు ప్రియమైన మహాలక్ష్మికి నమస్కరించాలి. ముక్తిని, మోక్షాన్ని, కార్యసిద్ధిని కలుగ జేసే వరలక్ష్మిని, శ్రీదేవిని తమ పట్ల ప్రసన్నంగా ఉండమని, తెల్లని వస్త్రాలు ధరించినది భూదేవిగా, తులసిమొక్కగా , విష్ణువుకు ప్రియసఖిగా ఉన్న లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాము. సర్వులు సంపదలను లక్ష్మీదేవి కృపతోనే అనుభవిస్తున్నారు. అందరికీ సిరిసంపదలు ప్రసాదించమని ప్రతి ఒక్కరు ఆ సిరులిచ్చే తల్లిని భక్తిపూర్వకంగా ప్రార్థించాలి.
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినా ద ప్రబోధినీమ్
శ్రియం దేవీ ముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్
కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా మార్దాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్
తాం పద్మినీమీం శరణమహాం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే
ఆదిత్యవర్ణే తపసో ధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వ:
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ:
ఉపెతు మాం దేవసఖ: కీర్తిశ్చ మణినా సహా
ప్రాదుర్భూతో స్మిరాష్ట్రే స్మిన్ కీర్తిమృద్ధిం దదాదుమే
క్షుత్పిపాసామలాం జ్యేష్ఠా మలక్షీం నాశయామ్యహమ్
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్
గందద్వారాం దురాదర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్
ఈశ్వరీగ్మ్ సర్వ భూతానాం తామిహోపహ్వయే శ్రియమ్
మనస: కామకూతిం వాచ: సత్యమశీమహి
పశూనాం రూపమన్యస్య మయి శ్రీ:శ్రయతాం యశ:
కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్
ఆప: సృజంతు స్నిగ్దాని చిక్లీత వసమే గృహే
ని చ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగలాం పద్మమాలినీమ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ
ఆర్ద్రాం య: కరిణీం యష్టిం సువర్ణామ్ హేమ మాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమన పగామినీమ్
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వాన్, విందేయం పురుషానహమ్
ఫల శృతి
య: శుచి: ప్రయతో భూత్వా జుహుయాదాజ్య మన్వహమ్
శ్రియ: పంచదర్చం చ శ్రీకామ: సతతం జపేత్
ఆనన్ద: కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతా:
ఋషయస్తే త్రయ: పుత్రా: స్వయం శ్రీర్దేవీ దేవతా
పద్మాననే పద్మ ఊరు పద్మాక్షీ పద్మసంభవే
త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్
అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే
ధనం మే జుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయే
పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజావిగోరథమ్
ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మామ్
చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీమ్
చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ ముపాస్మహే
ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు:
ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే
వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహ
సోమం ధనస్య సోమినో మహ్యాం దదాతు సోమినీ
న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతి:
భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్సదా
వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుత:
రోహంతు సర్వభీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి
పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి
విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ
యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ
గంభీరా వర్తనాభి: స్తనభర నమితా శుభ్ర వస్తోత్తరీయా
లక్ష్మీర్థివ్యైర్గజేంద్రైమణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభై:
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా
లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం
సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీలక్ష్మీర్వర లక్ష్మీశ్చ ప్రసన్నామమ సర్వదా
వరాంకుశౌ పాశమభీతిముద్రాం
కరైర్వహంతీం కమలాసనస్థామ్
బాలర్కకోటి ప్రతిభాం త్రిణేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తామ్
సర్వమంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే
Comments
Post a Comment