పుణ్య తిధులు🙏

పుణ్య తిధులు🙏

మనం దేవతలను పలురకాలుగా, మనకు వీలైన రీతిలో పూజిస్తూ ఉంటాము. ఆ విధంగా చేసే పూజలు నియమ నిష్టలతో చేసినట్లైతే తగిన ఫలితం వస్తుంది. దీనికి సంబందించిన తిధులు, వాటి ప్రత్యేకత, ఏ రోజు ఏ దేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్య ఫలం కలుగుతుందో అనే వివరణ మనకు వరాహ పురాణం లో వివరించ బడినది.వరాహ పురాణం లో శ్రీ మహా విష్ణువు స్వయంగా తిధులు వాడి విశేషాల గురించి భూదేవి కి వివరించారు.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

తిధులు వాటి విశిష్టత :
పాడ్యమి :🌛🌛
దేవతలలో ముందు పుట్టిన వాడు అగ్ని. కాబట్టి తిధులలో మొదటిదైన పాడ్యమి నాడు అగ్ని ని పూజించి, ఉపవాసం ఉండినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.

విదియ :🌜
అశ్విని దేవతలను ఆరాధించాలి. వారు ఆ తిధి నాడు పుట్టినందు వల్ల, ఏడాదిపాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విదియ వ్రతాన్ని నియమ నిష్టలతో చేస్తే శుభప్రదం.

తదియ 🌜:
గౌరీ దేవిని పూజించాలి. గౌరీ కళ్యాణం తదియ నాడు జరిగినందు వల్ల, గౌరీ దేవికి ఆ తిధి అంటే ఇష్టం. ఇది ప్రత్యేకంగా స్త్రీ ల కోసం ఏర్పాటు అయినది.

చవితి:🌝
వినాయకుడు పుట్టిన తిధి. వినాయక చవితి నాదే కాకుండా ప్రతీ చవితినాడు వినాయకుడిని పూజించవచ్చు.

పంచమి:🌙
పంచమి నాడు నాగులు జన్మించాయి. అందుకే నాగాదేవతలకు పంచమి తిధి / నాగుల చవితి అన్న చాల ఇష్టం. ప్రతీ పంచమినాడు పుట్టలో పాలు పోసి నాగ పూజ చేస్తే నాగుల వల్ల భయం ఉండదు.

షష్టి :🌙
కుమారస్వామి /సుబ్రహ్మణ్య స్వామి జన్మతిధి. ఆ రోజున అర్చన చేసినట్లైతే సుబ్రహమణ్య అనుగ్రహం పొందగలరు.

సప్తమి:🌞
సూర్యుని జన్మ తిధి. రధసప్తమి నాడే కాకుండా ప్రతీ శుద్ధ సప్తమి నాడు సూర్యుడిని ఆరాదించి క్షీరానాన్ని నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు కలుగుతాయి.

అష్టమి🌛:
దుర్గాదేవి అష్టమాకృతులు ఆవిర్భవించిన తిధి. అష్టమాకృతులను, దుర్గా దేవిని పూజిస్తే శుభం కలుగుతుంది.

నవమి🌜:
దుర్గాదేవి కి ప్రీతికరమైనది. ఆ తిధి నాడు దుర్గ ను పూజించి ఉపవాసం ఉంటే సంపదలు కలుగుతాయి.

దశమి🌗:
దశమి నాడు దిక్కుల సృష్టి జరిగింది. ఇంద్రాది దేవతలు ఈ దిక్కులకు పాలకులు. దిక్పాలకులను పూజిస్తే పాపాలు తొలగుతాయి.

ఏకాదశి🌘:
కుబేరుడు పుట్టిన తిధి. ఈ తిధిన కుబేర పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది

ద్వాదశి:🌗
విష్ణువు కి ఇష్టమైన తిధి. ఈ తిధి రోజే విష్ణు మూర్తి, వామన రూపం లో జన్మించారు. ద్వాదశి నాడు ఆవు నెయ్యి తో వ్రతం చేస్తే పుణ్యం లభిస్తుంది.

త్రయోదశి:🌒
ధర్ముడు పుట్టిన తిధి. ఈ రోజున ఎవరికీ ఇష్టమైన దేవుడిని వారు తలచుకొని పూజిస్తే , ఫలం చేకూరుతుంది.

చతుర్దశి:🌔
రుద్రుని తిధి. ఆనాడు రుద్రార్చన చేసినట్లైతే శుభప్రదం. కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. ఆ తిధి శివుడికి ప్రీతికరం.

అమావాస్య🌚🌚🌚:
పితృదేవతలకు ఇష్టమైన తిధి. దర్భలు, నువ్వులు, నీళ్ళతో పితృదేవతలకు తర్పనమిస్తే వారు సంతోషించి సంతాన సౌక్యం అనుగ్రహిస్తారు.

పౌర్ణమి:🌝🌝🌝
పౌర్ణమికి చంద్రుడు అధిపతి. పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉంది రాత్రి కి చంద్రుడిని పూజించినట్లితే ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సిద్దిస్తాయి.🙏🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: