యక్ష ప్రశ్నలు🌞
🌞యక్ష ప్రశ్నలు🌞
*_ధర్మరాజును పరీక్షించుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు/ వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు :_*
*_1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు ?_*
*_బ్రహ్మం._*
*_2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు ?_*
*_దేవతలు._*
*_3. సూర్యుని అస్తమింపచేయునది ఏది ?_*
*_ధర్మం._*
*_4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు ?_*
*_సత్యం._*
*_5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును ?_*
*_వేదం._*
*_6. దేనివలన మహత్తును పొందును ?_*
*_తపస్సు._*
*_7. మానవునికి సహాయపడునది ఏది ?_*
*_ధైర్యం._*
*_8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును ?_*
*_పెద్దలను సేవించుటవలన._*
*_9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును ?_*
*_అధ్యయనము వలన._*
*_10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి ?_*
*_తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును._*
*_11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు ?_*
*_మృత్యు భయమువలన._*
*_12. జీవన్మృతుడెవరు ?_*
*_దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు._*
*_13. భూమికంటె భారమైనది ఏది ?_*
*_జనని._*
*_14. ఆకాశంకంటే పొడవైనది ఏది ?_*
*_తండ్రి._*
*_15. గాలికంటె వేగమైనది ఏది ?_*
*_మనస్సు._*
*_16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది ?_*
*_ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది._*
*_17. తృణం కంటే దట్టమైనది ఏది ?_*
*_చింత._*
*_18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది ?_*
*_చేప._*
*_19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు ?_*
*_అస్త్రవిద్యచే._*
*_20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది ?_*
*_యజ్ఞం చేయుటవలన._*
*_21. జన్మించియు ప్రాణంలేనిది ?_*
*_గుడ్డు._*
*_22. రూపం ఉన్నా హృదయం లేనిదేది ?_*
*_రాయి._*
*_23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది ?_*
*_శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన._*
*_24. ఎల్లప్పుడూ వేగం గలదేది ?_*
*_నది._*
*_25. రైతుకు ఏది ముఖ్యం ?_*
*_వాన._*
*_26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు ?_*
*_సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు._*
*_27. ధర్మానికి ఆధారమేది ?_*
*_దయ దాక్షిణ్యం._*
*_28. కీర్తికి ఆశ్రయమేది ?_*
*_దానం._*
*_29. దేవలోకానికి దారి ఏది ?_*
*_సత్యం._*
*_30. సుఖానికి ఆధారం ఏది ?_*
*_శీలం._*
*_31. మనిషికి దైవిక బంధువులెవరు ?_*
*_భార్య/భర్త._*
*_32. మనిషికి ఆత్మ ఎవరు ?_*
*_కుమారుడు._*
*_33. మానవునకు జీవనాధారమేది ?_*
*_మేఘం._*
*_34. మనిషికి దేనివల్ల సంతసించును ?_*
*_దానం._*
*_35. లాభాల్లో గొప్పది ఏది ?_*
*_ఆరోగ్యం._*
*_36. సుఖాల్లో గొప్పది ఏది ?_*
*_సంతోషం._*
*_37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది ?_*
*_అహింస._*
*_38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది ?_*
*_మనస్సు._*
*_39. ఎవరితో సంధి శిథిలమవదు ?_*
*_సజ్జనులతో._*
*_40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది ?_*
*_యాగకర్మ._*
*_41. లోకానికి దిక్కు ఎవరు ?_*
*_సత్పురుషులు._*
*_42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి ?_*
*_భూమి, ఆకాశములందు._*
*_43. లోకాన్ని కప్పివున్నది ఏది ?_*
*_అజ్ఞానం._*
*_44. శ్రాద్ధవిధికి సమయమేది ?_*
*_బ్రాహ్మణుడు వచ్చినప్పుడు._*
*_45. మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును ?_*
*_వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో._*
*_46. తపస్సు అంటే ఏమిటి ?_*
*_తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం._*
*_47. క్షమ అంటే ఏమిటి ?_*
*_ద్వంద్వాలు సహించడం._*
*_48. సిగ్గు అంటే ఏమిటి ?_*
*_చేయరాని పనులంటే జడవడం._*
*_49. సర్వధనియనదగు వాడెవడు?_*
*_ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు._*
*_50. జ్ఞానం అంటే ఏమిటి ?_*
*_మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం._*
*_51. దయ అంటే ఏమిటి ?_*
*_ప్రాణులన్నింటి సుఖము కోరడం._*
*_52. అర్జవం అంటే ఏమిటి ?_*
*_సదా సమభావం కలిగి వుండడం._*
*_53. సోమరితనం అంటే ఏమిటి ?_*
*_ధర్మకార్యములు చేయకుండుట._*
*_54. దు:ఖం అంటే ఏమిటి ?_*
*_అజ్ఞానం కలిగి ఉండటం._*
*_55. ధైర్యం అంటే ఏమిటి ?_*
*_ఇంద్రియ నిగ్రహం._*
*_56. స్నానం అంటే ఏమిటి ?_*
*_మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం._*
*_57. దానం అంటే ఏమిటి ?_*
*_సమస్తప్రాణుల్ని రక్షించడం._*
*_58. పండితుడెవరు ?_*
*_ధర్మం తెలిసినవాడు._*
*_59. మూర్ఖుడెవడు ?_*
*_ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు._*
*_60. ఏది కాయం ?_*
*_సంసారానికి కారణమైంది._*
*_61. అహంకారం అంటే ఏమిటి ?_*
*_అజ్ఞానం._*
*_62. డంభం అంటే ఏమిటి ?_*
*_తన గొప్పతానే చెప్పుకోవటం._*
*_63.ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును ?_*
*_తన భార్యలో, తన భర్తలో._*
*_64. నరకం అనుభవించే వారెవరు ?_*
*_ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు._*
*_65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది ?_*
*_ప్రవర్తన మాత్రమే._*
*_66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది ?_*
*_మైత్రి._*
*_67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు ?_*
*_అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు._*
*_68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు ?_*
*_సుఖపడతాడు._*
*_69. ఎవడు సంతోషంగా ఉంటాడు ?_*
*_అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు._*
*_70. ఏది ఆశ్చర్యం?_*
*_ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడంచూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం._*
*_71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు ?_*
*_ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు._*
*_72. స్ధితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు ?_*
*_నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందూ, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్ధికలవాడుగా ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు._*
Comments
Post a Comment