_ప్రత్యంగిరామాత

*_ప్రత్యంగిరామాత కధ_*

ప్రత్యంగిరామాత మహామంత్రభీజాలను మొట్ట మొదట దర్శించిన ఋషి శ్రేష్టులు ఆంగీరస, ప్రత్యంగిరా .ఈ ఇరువురు మహాఋషులు గాడమైన తపోసాధనలో వుండగా అగమ్య గోచరమైన అనంత శూన్యము నుండి ఉద్భవించిన ప్రత్యంగిర భీజాక్షరాలను తమ యోగ దృష్టి తో దర్శించారు ఈ ఋషిపుంగవులిద్ధరు. అందుకే ఇరువురు ఋషోత్తముల పేర్ల మేలి కలయకతో ఆ భీజాక్షరాలకు ఇలా ప్రత్య +అంగీర= ప్రత్యంగిర అనే పేరు స్ఠిరపడింది .ఈ ప్రత్యంగిరా మహామంత్రము అధర్వణ వేదములోని మహాకాళీ కాండములో మహాప్రత్యంగిర సూక్తములో అంతర్భాగంగా వుంది . ప్రత్యంగిరామాత పుట్టినవైనము ;-కృతయుగములో హిరణ్యకశ్యుపుని సం హరించటానికి శ్రీహరి నరసిం హా అవతారములో రాతి స్ఠంభంలోనుండి ఉద్భవించి అసురసంద్యవేళ గడప పై తన పదునైన గోళ్ళతో కడుపు చీల్చి సం హరించాడు రాక్షసాధమున్ని అయినా నరసిం హ మూర్తి కోపం చల్లారలేదు నరసిం హుని క్రోధానికి సర్వ జగత్తు నాశనమౌతుందని భయపడ్డ దేవతలు నరసిం హుని కోపాన్ని చల్లార్చటానికి పరమేశ్వరున్ని ప్రార్ధించారు. అంతట పరమేశ్వరుడు వీరభధ్రావతారములో నరసిం హుని ముందుకు వచ్చి జ్ఞానభోధతో నరసిం హుని కోపాన్ని చల్లార్చాలని ప్రయత్నిస్తాడు. కానీ నరసిం హ మూర్తి మరింత కోపంతో అష్టముఖగండభేరుండమూర్తి అవతారంతో వీరభద్రుని పైకి వురుకుతాడు. అంతట వీరభద్రుడు శరభా అవతారం దాలుస్తాడు.శరభుని రెండు రెక్కలలో ఒక రెక్కలొ శూలిని ,మరో రెక్కలో మహాప్రత్యంగిరా శక్తులు దాగి వుంటాయి. అష్టముఖగండభేరుండమూర్తి తనవాడి అయిన ముక్కుతో శరభేశ్వరున్ని ముక్కలు చేయ్యటానికి యత్నిస్తాడు. శరభేశ్వరుని శూలిని శక్తి దాగివున్న రెక్క అష్టముఖగండబేరుండమూర్తి ముక్కుకి చిక్కుతుంది రెండో రెక్క నుండి మహాప్రత్యంగిరాదేవి ఉద్భవించింది.

మహాప్రత్యంగిరరూపవర్ణన: నేలనుండి నింగిని తాకేటట్లుండే మహాభారీకాయంతో కూడిన స్త్రీదేహం ఆ స్త్రీ దేహము కారుఛీకటితోకూడిన నల్లనివర్ణం మగసిం హపు వేయ్య తలలతో ఓకవైపు ఏర్రన్ని నేత్రాలు మరోవైపు నీలి నేత్రాలతో రెండు వేల ముప్పైరెండు చేతులతో ఉద్భవిస్తుంది ప్రత్యంగిరామాత మొదటి నాలుగు చేతులలో ఒకచేతిలో త్రిశూలము మరోచేతిలో సర్పము అలంకారంగాచుట్టుకున్న డమురుకము,మరో చేతిలో ఈటె వంటి కత్తి మరోచేతిలో అసురుని శిరస్సు మిగితా అన్ని చేతులలో విభిన్న ఆయుధాలతో మెడలో కపాల మాలతో అత్యంత పొడువైన కేశాలతో కేశాల చివర శక్తి తోకూడిన తంతువులు నాల్గు సిం హల స్వర్ణ రధంపై[ఈ నాల్గు సింహలను నాల్గు వేదాలు గా కొందరు మరికొందరు నాల్గు పురుషార్ధాలుగానూ ఇంకొందరు నాల్గు ధర్మాలగానూ విశ్లేషిస్తారు సాధకులు} ఉద్బవించింది.ఈమె ఉద్బవించిన సరస్సు నేటికి హిమాచల్ ప్రదేశ్ లోని ఒక రహస్య ప్రదేశములోవుంది ఆ సరస్సులో నీళ్లు పసుపు పచ్చని వర్ణంలో వుంటాయి ఈ సరస్సు కు ఎల్లప్పుడు సిం హాల గుంపు కాపలాగావుంటుంది అని ఎంతో మంది సిద్ధ సాదకులు నిక్కచ్చగా చెపుతున్నారు

మహామాత మహా ప్రత్యంగిర స్వరూపాన్ని చూసి నరసిం హ మూర్తి అహంకారాన్ని వీడి తన అవతార రహస్యాన్ని గుర్తెరిగి ఉగ్ర నరసిం హ అవతారాన్ని చాలించి యోగ నరసిం హ మూర్తిగా కొలువు తీరుతాడు. అందుకే మహా ప్రత్యంగిరను కాళీ సహస్రనామస్తోత్రంలో నృసిం హిక అంటూ వర్ణించారు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: