అగస్త్య మహర్షి

అగస్త్య మహర్షి 
చెట్లు కాసే తీయని పళ్లలా, నదులు మోసుకొచ్చే చల్ల ని నీళ్లలా, సజ్జనుల సంపదలన్నీ పరోపకారం కోసమే. జనావాసాలకు దూరంగా కొండల్లో, కోనల్లో, ఆశ్రమా లలో నిరాడంబరంగా జీవిస్తూ తపస్సు చేసుకొనే మహర్షుల తపోబలం కూడా లోకోపకారం కోసమే. 
అగస్త్యుడు ఒక గొప్ప మహర్షి. ఈయన ఇప్పటికి కూడా జీవించి ఉన్నాడనే నమ్ముతారు. మిత్రావరుణులనే దేవతలు సముద్రపుగట్టున విహరించుచుండగా అక్కడనే ఉన్న ఊర్వశిని చూచి కామింప, వారికి వీర్యములు స్ఖలితములై ఘటమున (కుండలో) ఉంచబడగా అందునుండి అగస్త్య, వశిష్టులు ఆవిర్భవిస్తారు. అగస్త్యుని ఆశ్రమము వింధ్యపర్వతసమీపమున కలదు.
వింధ్యుని గర్వ మణచుట 
మేరు పర్వతం అన్నింటికన్నా ఎత్తైన పర్వతం. దాని ఎత్తును చూసి భరించలేక ఈర్ష్యతో వింధ్య పర్వతం కూడా దానికంటే ఎత్తుగా పెరిగి సూర్యుని గమనాన్ని కూడా అడ్డగించసాగింది. దీంతో రాత్రింబవళ్ళూ సరిగాలేక మహర్షులకు వేద విధులకు ఆటంకం కలగసాగింది. అప్పుడు దేవతలందరూ కలిసి అగస్త్యమునికి తమ సమస్యను విన్నవించి, సమస్యతీరుటకు మార్గం చూపమని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనను మన్నించిన అగస్త్యుడు తన భార్యతో కలిసి ఆ పర్వతం వద్దకు వచ్చి. తాము దక్షిణ దిశగా వెళుతున్నామనీ, అంత పెద్ద పర్వతాన్ని ఎక్కి దిగలేమనీ దాని ఎత్తుని తగ్గించుకుని తమకు దారివ్వమని కోరతారు. మహర్షులంటే భక్తి ప్రపత్తులు గల వింధ్యుడు తక్షణమే తన ఎత్తుని తగ్గించుకొని వారు వెళ్ళడానికి వీలుగా దారి ఇస్తాడు తర్వాత అగస్త్యుడు తాము మరలా తిరిగి ఉత్తర దిశగా తిరిగి వస్తామని అప్పటిదాకా అలాగే ఉండమని చెబుతాడు. కానీ మళ్ళీ తిరిగి రాడు. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఆ పర్వతం అలాగే ఉంది. 
ఇంకొక కథనం శివ పార్వతుల కళ్యాణానికి ఋషులందరు ఉత్తరాన ఉన్న హిమాలయలకు వస్తారు. అప్పుడు వారి శక్తికి ఉత్తరాన భూమి క్రుంగి పొవు చుండడం చూసి శివుడు అందరి శక్తికి ఇంచుమించు సమానమైన అగస్త్యభగవానులను దక్షిణ దిక్కున ఉండమని ఆదేశమిచ్చారు. అప్పుడు అగస్త్యులవారు కళ్యాణం చూడలేక పొతున్నందుకు చింతించుచుండగా వారికి అక్కడనుండి కూడ ప్ర్యత్యక్షంగా చూసే వరాన్ని ప్రసాదిస్తాడు. అప్పటి నుండి అగస్త్యులవారు దక్షిణాన ఉన్నారు. వారు మొట్టమొదటి దక్షిణ భాష ఐన తమిళంను పరిచయం చేసారు. తమిళం అతి ప్రాచీన భాష అని అందరికి తెలిసిన విషయమే. వారు మొట్టమొదటి నుండి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నారన్న గుర్తుగా వారి పేరు మీద ఒక ఊరు కూడా ఉత్తరాఖండ్ నుండి కేదార్ నాథ్ వెళ్ళే దారిలో ఉంది. 
అగస్త్యముని వివాహం 
మనుస్మృతి ననుసరించి అందరు హిందువుల లాగే అగస్త్యుడు కూడా వివాహం చేసుకుని సంతానంను పొందాల్సి వస్తుంది. అప్పుడు ఆయన బాగా ఆలోచించిన పిదప ఒక నిర్ణయానికి వస్తాడు. ఆయన యోగశక్తిని ఉపయోగించి గుణగణాల్లోనూ, వ్యక్తిత్వంలోనూ అన్నిరకాలుగా ఒక విరాగికి భార్యగా ఉండేందుకు అవసరమైన లక్షణాలు కలిగిన ఒక ఆడశిశువును సృష్టిస్తాడు. ఇదే సమయంలో ఘనకీర్తి కలిగిన విదర్భ రాజు సంతానం కోసం జపతపాదులు చేస్తూ ఉంటాడు. అగస్త్యుడు ఆయన సృష్టించిన శిశువును ఆ రాజు భార్య గర్భంలోకి ప్రవేశపెడతాడు. ఆ రాజదంపతులకు ఆడబిడ్డ పుడుతుంది. ఆమెకు లోపాముద్ర అని నామకరణం చేస్తారు. ఆమెకు యుక్త వయస్సు రాగానే అగస్త్యుడు ఆమెకు తనతో వివాహం జరిపించాల్సిందిగా రాజును కోరతాడు. మొదటగా ఒక విరాగి నుంచి ఈ ప్రతిపాదన విన్నరాజు విచారిస్తాడు. కానీ అత్యంత ప్రతిభాశీలియైన తన పుత్రిక పట్టుబట్టడంతో వారి వివాహానికి అంగీకరిస్తాడు. దాంతో వారి వివాహం జరుగుతుంది.
వాతాపి, ఇల్వలుల కథ 
ఒకానొకప్పుడు వాతాపి, మరియు ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వీరు అడవిలో నివసిస్తూ దారిన పోయే బాటసారులను ఒక విచిత్రమైన రీతిలో చంపి తినేవారు. వాతాపికి సులభంగా తను కోరుకున్న జీవి రూపంలోకి మారే విద్య తెలుసు. ఇల్వలుడికి చనిపోయినవారిని బ్రతికించే సంజీవనీ విద్య తెలుసు. ఎవరైనా బాటసారి వచ్చినపుడు వాతాపి ఒక మేక రూపంలోకి మారిపోయేవాడు. ఇల్వలుడు ఒక బ్రహ్మచారి వేషం వేసుకుని అతిథులను భోజనానికి ఆహ్వానించేవాడు. మేక రూపంలో ఉన్న వాతాపిని చంపి వారి మేకమాంసానని పెట్టేవాడు. మేక మాంసాన్ని ఆరగించగానే ఇల్వలుడు వాతాపిని బ్రతికించడానికి సంజీవినీ మంత్రం పఠించేవాడు. అప్పుడు వాతాపి ఆ బాటసారి పొట్టను ఛేదించుకొని బయటకు వచ్చేవాడు. 
ఒక సారి అగస్త్యుడు ఆ అరణ్యం గుండా ప్రయాణిస్తుండగా ఈ రాక్షసులు గమనించి ఆయన్ను విందుకు ఆహ్వానించి మేక మాంసం వడ్డించాడు ఇల్వలుడు. ఆయన భోంచేసిన తరువాత ఇల్వలుడు యథావిధిగా వాతాపిని బయటకు రప్పించడానికి సంజీవనీ మంత్రం జపిస్తాడు. కానీ వాతాపి మాత్రం ఎంతకీ తిరిగి రాడు. ఎందుకంటే వీరి విషయం ముందుగా తెలుసుకున్న అగస్త్యుడు జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం అనగానే వాతాపి జీర్ణమైపోయాడని ఇల్వలుడికి తెలియజేస్తాడు.
కాలకేయ గణాలు అనే రాక్షసులు పగలంతా కన బడకుండా సముద్రంలో దాక్కొని, రాత్రి వేళల్లో తపస్వుల మీద పడి చంపేస్తూ ఉండేవాళ్లు. దేవతలు అగస్త్యుడిని ప్రార్థిస్తే, ఆయన సముద్రాన్నంతా ఆపోశన పట్టి చుక్క మిగలకుండా తాగేశాడు. కాలకేయ గణాలకు దాక్కొనేందుకు చోటు మిగలలేదు. దాంతో దేవతలు వాళ్లను సంహరించగలిగారని పురాణ గాథ.
వనవాసం చేస్తున్న శ్రీరాముడు అగస్త్యాశ్రమం దర్శించి మహర్షిని సేవించాడు. అగస్త్యుడు రాముడికి వైష్ణవ ధనుస్సు, అక్షయ తూణీరం, దివ్య ఖడ్గాలు బహూకరించి, సమీపంలో ఉన్న పంచవటిలో కుటీరం కట్టుకొని నివాసం చేయమని సూచన చేశాడు. అనం తరం, రామరావణ యుద్ధంలో అగస్త్యుడు రణరంగా నికి వెళ్లి రాముడికి శుభదాయకమైన ఆదిత్య హృద యాన్ని బోధించి ఉత్సాహపరిచాడు. ఇంద్ర పదవి పొంది కళ్లు నెత్తికెక్కి సప్తర్షులను పల్లకీ బోయీలుగా నియమించిన నహుషుడిని క్షణకాలంలో కొండచిలువగా మార్చి కళ్లు తెరిపించింది అగస్త్యుడే.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: