ఉద్యోగ ప్రాప్తి కొరకు "శ్రీరామ పట్టాభిషేక పారాయణ "

ఉద్యోగ ప్రాప్తి కొరకు "శ్రీరామ పట్టాభిషేక పారాయణ "

ఉద్యోగం లేని వాళ్ళు
ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతున్నవారు, 
ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు, 
ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు, ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు, 
తమస్ధాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీమద్రామాయణము నందలి  శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 21 సార్లు పఠించాలి.

నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోనఘః |
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ||

ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః |
నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః ||

న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వ చిత్ |
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ||

న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః |
న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా ||

న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా |
నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ ||

నిత్యం ప్రముదితాస్సర్వే యథా కృతయుగే తథా |
అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః ||

గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి |
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ||

రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |
చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||

దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ |
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ||

ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ||

ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః |
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ||

చక్కగా పితృవాక్యపరిపాలనమొనర్చివచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నందిగ్రామమున తనసోదరులను కలిసికొని, జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితోగూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టేను.

శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరును సంతోషముతో పొంగిపోవుచు, ఆయన పాలనలో సుఖఃసౌభాగ్యములతో విలసిల్లుదురు. ప్రభుభక్తితత్పరులై ధర్మమార్గమున ప్రవర్తించుదురు, ఆరోగ్యభాగ్యములతో హాయిగానుందురు, కఱువు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించుచుందురు.

రామరాజ్యమున పుత్రమరణములు లేకుండును, స్త్రీలు పాతివ్రత్యధర్మములను పాటించుచు నిత్యసుమంగళులై వర్థిల్లుచు ఉందురు. అగ్నిప్రమాదములు గాని, జలప్రమాద(మరణ)ములు గాని, వాయు భయములుగాని లేకుండును. జ్వరాదిబాధలు, అట్లే ఆకలిదప్పుల బాధలు, చోరభయములు మచ్చుకైనను ఉండవు - (ఆధ్యాత్మిక - ఆధిదైవిక - ఆధి భౌతిక బాధలు లేకుండును). రాజ్యములోని నగరములు, ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడిపంటలతో తులతూగుచుండును. జనులు కృతయుగమునందువలె ఎల్లవేళల సుఖశాంతులటో వర్థిల్లుచుందురు.

అనేకములైన అశ్వమేథాదిక్రతువులను, సువర్ణ్క యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్లకొలది గోవులను దానము చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమొనర్చి, వాసికెక్కును.

రాఘవుడు క్షత్రియవంశములను నూరురెట్లు వృద్థిపఱచును. నాలుగు వర్ణములవారిని ఈ లోకమున తమతమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు పదునొకండువేల సంవత్సరములకాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి, అనంతరము వైకుంఠమునకు చేరును.

ఈ శ్రీరామచరితము అంతఃకరణమును పవిత్రమొనర్చును, సర్వపాపములను రూపుమాపును, పుణ్యసాధనము, వేదార్థమును ప్రతిపాదించునదియు గావున ఇది సర్వవేదసారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించువారి పాపములు అన్నియును పటాపంచలై పోవును, ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును, వారిపుత్త్రపౌత్త్రులకును, పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును. మఱియు అంత్యకాలమున మోక్షప్రాప్తియు కలుగును.

జై శ్రీరామ్ 
జై హనుమాన్


Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: