ఆర్యభట్ట
ఆర్యభట్ట '0' ని కనుక్కున్నాడని చెప్తారు కదా మరి ఆయన కలియుగంలో కనుక్కున్నాడు కదా అలాంటప్పుడు పూర్వ యుగాలలో కౌరవులు 100 అని రావణుడికి 10 తలలు అని ఎలా లెక్కపెట్టారు అని ఒక విద్యార్ధి అడగగా, ఆ టీచర్ రాజీనామా చేసి అన్వేషిస్తూ, అన్వేషిస్తూ వేదిక్ స్కూల్ లో చేరాడు. పైన చెప్పింది హాస్యంగా అనిపించినా కానీ అందులో ముఖ్య విషయం వుంది. ఒక పండితుడు ఐన వేదాంతీకుడి మాటలలో
నేను మీకు వేదాల నుండి ఒకటి పురాణాల నుండి ఒకటి చొప్పున ఆధారం ఇస్తున్నాను.
1)వేదాల నుండి యజుర్వేదం ప్రకారం మేధాతిథి మహర్షి ఒక యజ్ఞం చేయటానికి ఇటుకలు పేరుస్తూ అగ్నికి ఈ విధంగా ప్రార్ధించాడు.
ఇమం మే ఆగ్నా ఇష్టక దేనవ, సంత్వేక కా, దశ కా, శతం కా, సహస్రం కా, యుతం కా, నియుతం కా, ప్రయుతం కా, అర్బుదం కా, న్యార్బుదం కా, సముద్రం కా,మధ్యం కా, అంతం కా, పరార్ధం కా, ఇత మే అగ్నా ఇష్టక దేనవ సంత్వాముత్రం ముష్మిన్లోకే.
అగ్ని ప్రతిష్టకు అర్చకులు ఈ మంత్రాన్ని మొదటగా చదువుతున్నారు. అంటే, ఓ అగ్ని దేవా! ఈ ఇటుకలే నాకు పాలిచ్చే ఆవులుగా మారాలి అలా నాకు వరం ఇవ్వండి అవి ఒకటి, పది, వంద, వేయి, పది వేలు, లక్ష, పది లక్షలు, కోటి, పది కోట్లు, వంద కోట్లు, వేయి కోట్లు, లక్ష కోట్లు ఈ విశ్వంలో వేరే విశ్వాలలో.
ఇక మంత్రం అర్ధం చూస్తే
ఏక - 1
దశ - 10 (10 to the power of 1)
శత - 100(10 to the power of 2)10×10
సహస్ర - 1000 (10 to the power of 3)10×10×10
ఆయుతం - 10,000 (10 to the power of 4)10×10×10×10
నియుతం - 1,00000(10 to the power of 5)10×10×10×10×10
ప్రయుతం - 10,00000(10 to the power of 6)10×10×10×10×10×10
అర్బుధం - 10,000,000(10 to the power of 7)10×10×10×10×10×10×10
న్యార్బుదం - 100,000,000 (10 to the power of 8)10×10×10×10×10×10×10×10
సముద్రం - 1,000,000,000( 10 to the power of 9)
10×10×10×10×10×10×10×10×10
మద్యం - 1,000,0000,000( 10 to the power of 10)10×10×10×10×10×10×10×10×10×10
అంతం - 100,000,000,000(10 to the power of 11)10×10×10×10×10×10×10×10×10×10×10
పరార్ధం - 1,000,000,000,000(10 to the power of 12)10×10×10×10×10×10×10×10×10×10×10×10.
రిఫరెన్సులు 2 గురించి భాగవతంలోని 3.11లో సమయం గురించి వివరించబడింది. అందులో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న "నానో సెకండ్స్" గురించి లక్షల, కోట్ల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. నేను కేవలం 2 రిఫరెన్సులు మాత్రమే ఇచ్చాను. మనం మనసు పెట్టి కనుక చూస్తే అలాంటివి చాలా కనిపిస్తాయి. దీన్ని బట్టి భారతీయులు ఎప్పటి నుండో లెక్కల గురించి వాటి ఖచ్చితత్వం గురించి పూర్తిగా తెలుసుకున్నాం అని, మరియు వాటి స్థానాల గురించి నిజం వున్నా కూడా మనకు వ్యతిరేకంగా అతి తెలివితో ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేస్తారో తెలియదు.!?
1)ప్రశ్న ఎప్పుడు వస్తుంది? దాన్ని మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినప్పుడు. బ్రిటీషర్లు పవిత్రమైన మన గురు శిష్యుల మైత్రి వలన భావితరాలకు ఉత్తమ విద్యను అందించకుండా ఆ ఆచార పరంపరను వారి తెలివితో నాశనం చేయడం. మనం తెలివి తక్కువ పని చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం. మన పూర్వం గురించి చెప్పుకోవడానికి మనం సిగ్గు పడుతున్నాం ఒకవేళ కొందరు ధైర్యంతో మాట్లాడినా వారు కూడా గిల్టీ ఫీల్ అయ్యేలా చేస్తున్నారు.
2) మనం గుడ్డిగా పాటిస్తున్న మెకాలే విద్యావ్యవస్థను బ్రిటీషర్లు మన మీద రుద్దినది. మనకు మరో పిచ్చి ఏంటంటే ఆర్యభట్ట '0' కనుక్కున్నాడు అని అనడం! ఇది పిచ్చి స్టేట్మెంట్. మరొక పిచ్చి విషయం ఏంటంటే క్లాసికల్ సంస్కృతం అని, వేదిక సంస్కృతం అని వేర్వేరు ఉన్నాయని ప్రచారం చెయ్యటం.
3)ఇక మరో పిచ్చి, పెరిగిపోయిన దిక్కుమాలిన సెక్యూలరిజం. దీని వలన ఇలాంటి జోక్స్ వేస్తుండడం మన తరువాత తరాలకు పరిపాటిగా మారుతుంది.
జవాబు: ఆర్యభట్ట "0" ను కనుక్కోలేదు. ఆయన "0" ను సరిగ్గా ఏ స్థానంలో వాడితే దాని విలువ ఎలా, ఎంతలా మారుతుంది అని ఆధారాలతో చెప్పిన మొదటి వాడు ఆర్యభట్ట. ఆయన లెక్కలను విపులంగా, సోదాహరణంగా వివరించాడు. మనకు రోమన్ సంఖ్యలు కూడా వున్నాయి. కానీ,అవి సరిగ్గా సరిపోవు. అందుకే మనం ఆర్యబట్టను, వేదాలను, పురాణాలను ప్రామాణికంగా తీసుకుంటున్నాం.
జై సనాతన ధర్మ.
Comments
Post a Comment