కౌత్సుడు - గురుభక్తి
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 🔹️🙏🌅🔸️కౌత్సుడు - గురుభక్తి 🌅🙏🔸️ 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ *గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం* *"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"* 🌹🙏🌹 *అయితే... ఈ శ్లోకం* *ఎందులోనిది?* *ఏ సందర్భంలోనిది?* *ఎవరు వ్రాశారు?* వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా రావచ్చు కదా! *ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది.* కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్న...