భావ కారకాలు మరియు యోగకారకాల విశ్లేషణ

భావ కారకాలు మరియు యోగకారకాల విశ్లేషణ.

జాతకచక్రంలో 12 భావాలకు భావకారకులు ఉంటారు. భావకారకుడు భావంలో ఉంటే ఆ భావం ఫలితాలు బాగుంటాయి. 

కారకోభావనాశాయ ప్రకారం భావకారకుడు భావంలో ఉంటే ఆ భావ లక్షణాలను చెడగొడతాడు.

ఉదా:- పంచమం సంతాన స్ధానం, సంతాన కారకుడు గురువు. గురువు పంచమంలో ఉంటే కారకోభావనాశాయ ప్రకారం సంతానం లేటు కావటం, లేదా మనం అనుకున్న దానికి విరుద్ధంగా కలగటం జరుగుతుంది. గురువుకి ఆ క్షేత్రం శత్రుక్షేత్రం గాని, పాప గ్రహ దృష్టి ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. అంతేగాకుండ గురువర్గ జాతకులకు పంచమంలో అనగా మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మీన లగ్నాలకు పంచమంలో గురువు శుభప్రదం.

 1వ భావం లగ్నభావానికి – రవి కారకుడు
 2వ భావం ధనభావానికి - గురువు కారకుడు
 3వ భావం భ్రాతృభావానికి - కుజుడు కారకుడు
4వ భావం మాతృభావానికి - చంద్రుడు, బుధుడు కారకులు
 5వ భావం మంత్రభావానికి - గురువు కారకుడు
 6వ భావం శతృభావానికి - శని, కుజుడు కారకుడు
7వ భావం వివాహభావానికి - శుక్రుడు కారకుడు
8వ భావం ఆయుర్భావానికి - శని కారకుడు
 9వ భావం భాగ్యభావానికి - రవి, గురువు కారకులు
10వ భావం రాజ్యభావానికి - రవి, బుధ, గురు, శని కారకులు
 11వ భావం లాభభావానికి - గురువు కారకుడు
12వ భావం వ్యయభావానికి - శని కారకుడు

ఈ భావకారకాదిపతులు కారక భావంలో ఉండి బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే  ఆ భావం యొక్క ఫలితాలు ప్రతికులంగా ఉంటాయి.
 
 కారకోభావనాశాయ ఫలితం ఎక్కువగా పాప,శత్రు గ్రహాల దృష్టి ఉంటేనే కారకభావం చెడుతుంది.

"భావకారకుడు ఆ భావంలో ఉంటే భావాన్ని నాశనం చేస్తాడు". అనే సూత్రం ప్రసిద్ధమైనదే గాని ఫలితాలలో ఆ సూత్రానికి ప్రాముఖ్యం కనిపించటం లేదు. ఎందుకనగా లగ్న విభజనలో గ్రహ వర్గ విభజన పాటించి ఫలితాన్వేషణ చేయాలి.

తను మరియు భాగ్య భావాలలో రవి మరియు  గురు వర్గ జాతకులకు అనుకూల ఫలితములు ద్వాదశ భావంలో శని ప్రతికూల ఫలితాన్నిస్తాయి.

పంచమ భావంలో గురువు సత్పలితాలను ఇస్తాడు.

శనివర్గం, అనగా వృషభ, మిథున, కన్యా, తులా, మకర, కుంభ లగ్నాలవారికి ప్రతికూలంగా ఉంటాడు.

అలాగే గురు వర్గీయులకు సప్తమ శుక్రుడు దోషి అనే మాట ప్రచారంగా ఉంది కాని శని వర్గీయులకు సప్తమ శుక్రుడు అనుకూలమే అలా ఉంటే భార్య ఆకర్షణీయంగా ఉంటుంది.

నేటి కాలంలో  భార్య ఆకర్షణీయంగా ఉండటాన్ని నేటి తరం వారు అభిలసిస్తున్న కారణంగా సప్తమ శుక్రుడు శుభఫల ప్రధాతగా గుర్తించవలసిన అవసరం ఉంది.   

ఉదా- పురుషులకు సప్తమంలో శుక్రుడు ఉంటే కారకోభావనాశాయ, స్త్రీలకు సప్తమంలో గురువు ఉంటే కారకోభావనాశాయ అంటారు.

దీని వలన పాప, శత్రు గ్రహాల దృష్టి ఉంటేనే కళత్ర దోషం ఉంటుంది. గ్రహ వర్గవిభజన పరిగణలోకి తీసుకోవడం అత్యంతఆవశ్యకం. 

గురు వర్గ జాతకులకు   2, 11 భావాలలో గురువు ఉంటే డబ్బు ఉంటుంది. కానీ శని వర్గజాతకులకు సెక్యూరిటీ ఉండదు. కారకోభావనాశాయ సూత్రం ప్రకారం శత్రు రాశిలో ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న అభద్రతాభావం ఉంటుంది.

అష్టమ భావంలో శని ఉంటే ఆయుష్కారకుడు కావటం వలన ఆయుర్ధాయాన్ని కలిగి ఉంటాడు. కారకోభావనాశాయ ప్రకారం శత్రురాశిలో ఉన్న, పాపగ్రహ దృష్ఠి ఉన్న   గురువర్గీయులకు  దీర్ఘకాల వ్యాధిని కల్పించి ఇబ్బంది పెడతాడు. 

వ్యయ భావంలో శని ఉంటే యోగసాధన (తపశ్శక్తి) కలిగి ఉంటారు. శని వర్గజాతకులు కారకోభావనాశాయ ప్రకారం శత్రురాశిలో ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న అధికంగా ఖర్చులు, తిండి సరిగా తినలేకపోవటం, నిద్ర సరిగా పట్టకపోవటం జరుగుతుంది గురువర్గ జాతకులకు.

భావకారకుడు, యోగకారకుడు ఒక్కడే అయితే మంచి యోగం కలుగుతుంది.

ఉదా:- వృశ్చిక లగ్నానికి ద్వితీయ, పంచమాధిపతులు గురువు యోగకారకుడు, భావకారకుడు అవుతాడు.

కుంభ లగ్నానికి ద్వితీయ, లాభాదిపతి గురువు కావటం వలన లగ్నానికి శత్రువైన యోగకారకుడు, భావకారకుడు అవుతాడు.

మేష లగ్నానికి చతుర్ధాధిపతి చంద్రుడు యోగ కారకుడు అవుతాడు.

   🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: