బ్రిటిష్ వారు బెజవాడ కొనేశారు

.           .🍁   3000 రూపాయలకు 🍁
      .బెజవాడను కొనేసిన బ్రిటీష్ పాలకులు 
                     .🌷🍃🌷🍃🌷

మన బెజవాడ క్రీ.శ. 1731 నుండి క్రీ.శ. 1846 వరకూ కలువకొలను జమీందార్ల ఏలుబడిలో ఉండేదట. 1700 శతాబ్దం ప్రారంభ సంవత్సరంలో కలువకొలను తిరుపతిరావు బెజవాడలో జమీందారీనీ వ్యవస్థాపించాడు.   1731 లో ఆయన తరువాత ఆయన కుమారుడు నరసింహరావు ఆ తర్వాత అనేకమంది వారసుల చేతుల్లో ఈ జమీ నడిచిందట. 1770 లో సర్కారు జిల్లాలను ధారాదత్తంగా పొందిన బ్రిటీష్ వారు, ఈ జమిందార్లనుండి శిస్తు వసూలు చేయడం ప్రారంభించారు. శిస్తు సరిగ్గా కట్టని జమీందార్లను నిర్ధ్యాక్షిణ్యంగా నిర్భందించి, చిత్రహింసలకు గురిచేసేవారట బ్రిటీష్ వారు. అలా కలువకొలను జమీందార్లు బాకీపడిన శిస్తు మొత్తం చివరి వారసులైన వెంకటనర్శింహరావు, తిరుపతిరావు-3 జాయింటు ఏలుబడి వచ్చేసరికి కొండంత పేరుకు పోయాయి. వెంకటనర్శింహరావు పెద్దవాడు కావడంతో చాకచక్యంగా తన వాటా జమీ శిస్తులను బ్రిటీష్ వారికి కట్టేసి బయటపడ్డాడు. చిన్నవాడైన తిరుపతిరావు-3, తన వాటా జమీ శిస్తు కట్టలేక, నైజాంకు పారిపోయి,కొద్దిరోజుల తరువాత మధిర వైపునుండి గెరిల్లా యుద్దం సాగించాడట. అప్పటి నూజివీడు ప్రభువైన 'నరసింహ' బ్రిటీష్ వారిపై భద్రాచలం అడవుల్లోంచి గెరిల్లా యుద్దం చేస్తున్నారు. ఆయనను స్పూర్తిగా తీసుకున్న నూనుగు మీసాల యువకుడైన తిరుపతిరావు-3,  ఐదేళ్ళపాటు బ్రిటీష్ వారితో పోరాడుతూనే ఉన్నాడు. అప్పటి బెజవాడ ప్రజలు  తిరుపతిరావుకు జేజేలు పలికారట.  1798 లో గొట్టిముక్కల వద్ద జరిగిన యుద్దంలో తిరుపతిరావు అనుచరులందరూ మరణించారు. 1799 లో జరిగిన ఓ కుట్రవలన ఈ వీరకిశోరం నెలకొరిగింది. ఆ తరువాత ఈ బెజవాడ జమీ అధికారం మొత్తం వెంకట నర్శింహారావుకు వెళ్ళింది. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు జగన్నాధరావు చేతిలోకి వచ్చింది ఈ జమీ. అంత శిస్తు కట్టలేనని బ్రిటిష్ వారి కాళ్ళూవేళ్ళా బ్రతిమాలినా లాభం లేకపోయింది. బ్రిటీష్ వారు బెజవాడ జమీందారీని వేలం వేసారు - ఆ దిగులుతోనే అతి చిన్న వయస్సులో జగన్నాధరావు 1831లో  మరణించాడట.  అతని భార్యకు మైనారీటీ కూడా తీరకపోవడంతో,  బ్రిటీష్ వారే కొద్దికాలం ఆ ఎస్టేట్ నడిపారట. మైనారిటీ తీరిన తరువాత ఆమెకు పాతబాకీల లెక్క చెప్పారు. ఆమె దానిని చెల్లించ లేకపోవడంతో 1846 లో బెజవాడ జమీందారినీ వేలం వేసి నామమాత్రపు ధరకు అంటే 3000రూపాయలకు బెజవాడను కొనే(కొట్టే)సారట బ్రిటీషు పాలకులు. అదండీ కలువకొలను వంశస్ధులైన బెజవాడ వెలమ జమీందార్ల విషాధ గాధ. 

(డాక్టర్ జి.వి.పూర్ణచంద్ గారి "బ్రిటీష్ యుగం" నుండి సేకరణ)
సేకరణ,కుదింపు : కృష్ణ రత్నాకర్.వి

Comments

Post a Comment

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: