శని రాహు (శపిత) యోగం - ఫలితాలు

శని రాహు (శపిత) యోగం - ఫలితాలు

జాతకంలో శని రాహువులు ఒక రాశిలో కలసి ఉంటె అది గొప్పదోషంగా పరిగణింపబడుతుంది. దీనిని శపితయోగం అని అంటారు. కొన్ని జ్యోతిష సాంప్రదాయాలలో దీనిని మహాదోషంగా పరిగణిస్తారు. కొంతమంది నిష్టాపరులైన జోస్యులు అయితే, ఈ దోషం ఉన్న జాతకాన్ని చూడటానికి, ఆ జాతకునితో మాట్లాడటానికీ కూడా ఇష్టపడరు.

గోచారరీత్యా శని రాహువులిద్దరూ ఒకే రాశిలో కలసినప్పుడు కూడా లోకానికి ఇదే దోషం ఏర్పడుతుంది. వీరిద్దరి పరస్పర వేగాలలో తేడాలవల్ల అలా కలవడం ఎప్పుడో కాని జరగదు. సామాన్యంగా అలా శని రాహువులు ఒకే రాశిలో కలవడానికి దాదాపు 11 లేదా 12 ఏళ్ళు పడుతుంది. కాని అలా కలిసినప్పుడు మాత్రం లోకంలో చాలా ఘోరాలు జరుగుతాయి. అలా కలిసిన రాశులను బట్టి కొన్ని దేశాలు, కొందరు మనుషులు, కొన్ని కొన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితము లౌతాయి.

శని రాహువులు కలిసి ఉన్న సమయంలో పుట్టిన జాతకాలలో ఈ యోగం ఆయా లగ్నాలను బట్టి, ఇతర గ్రహస్తితులను బట్టి రకరకాలుగా ప్రతిఫలిస్తుంది. ఆయా జాతకులను ముప్పుతిప్పలు పెడుతుంది. కాలసర్ప యోగం ఎంత బాధపెడుతుందో ఈ యోగమూ అంతకంటే ఎక్కువ బాధ పెడుతుంది. అయితే అది బాధించే తీరూ ఇది బాధించే తీరూ వేర్వేరుగా ఉంటాయి. కాలసర్పయోగ జాతకులకు కాలం కలిసిరాక బాధలు పడతారు. శపితయోగ జాతకులు వారి యొక్క అదుపులేని విచక్షణా రహిత ప్రవర్తన వల్ల బాధలు కొనితెచ్చుకుంటారు.

 వీరిద్దరూ 2012 డిసెంబర్ 24 నుంచి 2014 జూలై 13 వరకూ తులా రాశిలో కలిసి వుండడం జరిగింది. .ఈ సమయమంతా దోషప్రదమే. ఈ ఏడాదిన్నర పాటు లోకం రకరకాల ఉపద్రవాలతో తల్లడిల్లక తప్పదు. ఈ సమయంలో పుట్టిన పిల్లల జాతకాలలో ఈ దోషం తప్పకుండా ఉంటుంది. కనుక పెరిగి పెద్దయ్యాక వారి జీవితాలలో వారు చాలా చెడు ఖర్మను అనుభవించక తప్పదు. ఈ సమయంలో పిల్లలు జన్మించిన కుటుంబాలలో గనుక మనం గమనిస్తే, పెద్దవారిలో మొండి ప్రవర్తనలు, చెడు అలవాట్లు, తీవ్రంగా ఉద్రేకాలకు లోనయ్యే స్వభావాలు ఖచ్చితంగా ఉంటాయి. గతజన్మలో చాలా పాప ఖర్మల బరువు ఉన్న జీవులు, శాపగ్రస్తులైన జీవులు ఈ సమయంలో భూమిమీద జన్మలు తీసుకో వడం జరుగు తుంది.

దీనిని శపితదోషం అని ఎందుకంటారు? ఈ జాతకులకు చాలా శాపాలు ఉంటాయి. గత జన్మలలో వీరు అనేక చెడు కర్మలు చేసుకుని అనేక మంది ఉసురుపోసుకుని వారి శాపాలకు గురై ఉంటారు. పూర్వ జన్మలలో చేసుకున్న చెడుకర్మల ఫలితంగా ఈ జన్మలో అనేక కష్టాలు బాధలు పడవలసి వస్తుంది. అహంకారంతో చేసుకున్న చెడుకర్మ ఈ రకమైన దోషంగా జాతకంలో ప్రతిఫలిస్తుంది.

శపితదోషం ఉన్న జాతకాలు చూచి వారికి రెమేడీలు చెప్పిన జ్యోతిష్కుడు కూడా ఆకర్మలో భాగం పంచుకోవలసి వస్తుంది. పరిహారాలు చేసిన జోష్యుని పైన రాహు, శనుల కోపదృష్టి పడుతుంది. జాతకుని తీవ్ర కర్మలో జోస్యుడు జోక్యం చేసుకుంటున్నాడు కనుక అతనూ ఆ కర్మను కొంత పంచుకోవలసి వస్తుంది. ఉపాసనా బలం చాలనప్పుడు ఆ జోస్యుడు దారుణమైన బాధలు పడతాడు. ఒక్కోసారి రెమేడీలు చేసిన పాపానికి జోస్యుని ప్రాణం కూడా పోతుంది. నాకు తెలిసిన ఒక జోస్యుడు ఇలాగే అందరికీ రెమేడీలు చెబుతూ ప్రతిరోజూ సాయంత్రానికి మద్యం తాగేవాడు. ఒకరోజున రోడ్ ఏక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయాడు.

ఒకసారి ఒక ముసలి జ్యోతిష్కుని నేను చూచాను. ఒక జాతకాన్ని తన చేతిలోకి తీసుకుని చూచీ చూడకముందే ఆ కాగితాన్ని విసిరి పారేసాడు. ఆ జాతకం తాను చూడననీ, ఆ జాతకుని వెళ్ళిపొమ్మనీ అరిచాడు. ఉత్త పుణ్యానికి అలా ఎందుకు అరుస్తున్నాడో నాకు అర్ధం కాలేదు. తర్వాత చెప్పాడు అది శపితదోషం ఉన్న జాతకం మనం దానిని చూడరాదు. విశ్లేషించరాదు అని.  

పన్నెండు రాశులలో దేనిలో ఈ దోషం ఏర్పడింది? దీనిపైన మిగతా గ్రహాల ప్రభావం ఎలా ఉన్నది? అన్న దానిని బట్టి ఈ దోష తీవ్రతను జాతకుని పూర్వకర్మను అంచనా వెయ్యాలి.

ఈ యోగం ఉన్నప్పుడు ఆ జాతకుడు తీవ్రమైన కోపానికి, నిలకడ లేని ప్రవర్తనకు లోనవుతాడు. తట్టుకోలేని కోపంలో హత్యలు రేపులు చేసేవారు, ఉన్నట్టుండి తీవ్ర నిర్ణయాలు తీసుకునే వారిలో ఈ దోషం ఉంటుంది, లేదా వారిపైన ఈ గ్రహయుతి ప్రభావం ఉంటుంది. వీరిలో విచక్షణ లోపిస్తుంది. మొండిగా కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటి ఫలితాలు తర్వాత ఏడుస్తూ అనుభవిస్తారు. శని రాహువుల సంయోగం అలాంటి ప్రవర్తనను ప్రేరేపిస్తుంది. తట్టుకోలేని భావోద్రేకాలను, మొండితనాన్ని, మూర్ఖపు వాదనలను, ఒంటరిగా ఉండి క్రూరమైన ప్లానులు వెయ్యడాన్ని ఈ గ్రహసంయోగం కలిగిస్తుంది. స్నేహితుల మధ్యన, ప్రేమికుల మధ్యన, అప్పటివరకూ కలిసిమెలిసి తిరిగిన వారి మధ్యన, హటాత్తుగా గొడవలు రావడం ఈ దోషం యొక్క ప్రభావమే.

డిల్లీ రేప్ కేస్ గాని, తర్వాత జరుగుతున్న ఇతర రేపులు హత్యలు ఘోరాలు గాని, యాక్సిడెంట్లు గాని, అన్నీ ప్రస్తుతం గోచారరీత్యా అమలులో ఉన్న ఈ యోగం యొక్క  ఫలితాలే. అంతేకాదు, అక్బరుద్దీన్ ఉదంతం గాని, పాకిస్తాన్ దుందుడుకు చర్యలు గాని, సరిహద్దులో మనల్ని రెచ్చగొట్టడం గాని, పాకిస్తాన్లో సంక్షోభంగాని, మన రాష్ట్రంలో తెలంగాణా సంక్షోభం గాని ఇవన్నీ ఈ గ్రహయుతి యొక్క ఫలితాలే. భావోద్వేగాలను ఈ గ్రహ సంయోగం తీవ్రంగా రెచ్చగొడు తుంది.

చాలామంది జీవితాలలో జూలై 2014 లోపు ఈ గ్రహదోషం చుక్కలు చూపించి ముప్పు తిప్పలుపెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించింది అనడం నగ్నసత్యం. నామాటలు ఇప్పుడే నమ్మవద్దు. వేచి చూడండి ఫలితాలు ఎవరి జీవితాలలో వారికే కనిపిస్తాయి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: