🌸 జనన సూత్రములు🌸

🌸   జనన సూత్రములు🌸

29. శీర్షోదయాంశేంగే మూర్థతఃప్రసవంఉభయో
      దయంశేహస్తతః ప్రసవంఅన్యధాపాదతః:

తా) జననకాల లగ్నము శీర్షోదయ రాశి అయిన ఎడల శీర్షోదయంగా ప్రసవం అగును. శీర్షోదయ పృష్టోదయములు రెండున్నూ గల రాశి అయిన ఎడల హస్తములు ముందుగా ప్రసవమగును. కేవలం పృష్టోదయ రాశి అయిన ఎడల పాదములు ముందుగా ప్రసవమగును.

30. లగ్నచంద్రాన్యతరతో బంధ్వస్తగేషు క్రూరేషుమాతుఃకష్టం:

తా) లగ్నబలమునూ, చంద్ర బలమునూ గాక వేరుగా 4, 7 స్థానములందు క్రూర గ్రహములు ఉన్న ఎడల తంల్లికి  ప్రసవం కష్టమగును.

31. కేంద్రగస్యవాబలినో గ్రహస్యదిశిగృహద్వారం:

తా) కేంద్రమును పొంది యుండి గాని మరియొక విధముగా గాని బలవంతమైన గ్రహము యొక్క దిక్కు నందు ప్రసవ గృహ ద్వారం ఉండును.

32.కాష్టాఠ్యంనవందగ్ధం ఛిద్రంధృడంరమ్యం జీర్ణం క్రమాదకా౯దిషుయోబలీ తదనుసారీగృహం:

తా) జనన కాలమునకు సూర్యుడు బలముగా నుండిన కర్రలతో కూర్చబడిన గృహము, చంద్రుడు బలముగా నుండిన నూతన గృహము, కుజుడు బలముగా నుండిన దగ్ధమైన గృహము, బుధుడు బలముగా నుండిన ఛిద్రమైన గృహము, గురువు బలముగా నుండిన దృఢమైన గృహము, శుక్రుడు బలముగా నుండిన రమ్యమైన గృహము,శని బలముగా నుండిన శిధిలమైన గృహము, ప్రసవ గృహమై ఉండును.

33. వృషాజయోరుదయే గృహస్యపూర్వభాగే యుగ్మస్యాగ్నేయాం కర్కసింహయోర్యామే కన్యాయాంనైరుతే తులావృశ్చికయోఃపశ్చిమే ధనుషివాయౌ మందభయోరుత్తరే ఝషస్తేశాన్యాంజన్మ:

తా) మేష వృషభములయందు జననమైన యెడల గృహమునకు పూర్వభాగమందు, మిధునమందు ఆగ్నేయమూల, కర్కాటక సింహముల యందు దక్షిణభాగము, కన్యయందు నైరుతి మూల, తులావృశ్చికముల యందు పశ్చిమ భాగమందు, ధనస్సు నందు వాయువ్యమూల, మకర కుంభములందు, ఉత్తర భాగమందు, మీనమందు ఈశాన్య మూలనూ ప్రసవ గృహమై ఉండును.

34. అంగేచంద్రే గ్రహమాత్రాదృష్టే నిర్జనేప్రసవః:

తా) లగ్నమందు చంద్రుడు ఉండి ఏ గ్రహము చేతను చూడకుండా ఉన్న ఎడల నిర్జన స్థలమందు ప్రసవమగును.

35. స్వాంబుగేషుశుభేషు సుఖేనప్రసవః            త్రికోణాస్తగేషు పాపేషు కష్టతఃప్రసవః:

తా) శుభ గ్రహములు లగ్న చతుర్ధములను పొంది ఉన్న ఎడల సుఖప్రసవం అగును. పాపగ్రహములు త్రికోణములందును సప్తమమందును వున్న ఎడల
కష్ట ప్రసవమగును.

36. తుర్యేస్వేవా మందారార్కయోగే
       జన్మతఃప్రాక్ పితుర్మరణం:

తా) రవి కుజ శని ఈ మూడు గ్రహాలు 1- 12, స్థానమును పొంది ఉన్న ఎడల శిశువు పుట్టకుండగానే తండ్రి మరణించును.

37. లగ్నషష్టాస్తగాష్టమగాః పాపాఃమాత్రా సహబాలశ్యమృతిః:

తా) పాపగ్రహములు 1, 6, 7, 8,స్థానములను పొంది ఉన్న ఎడల తల్లితో కూడా శిశువు మరణము పొందును.

38. గ్రస్తేచంద్రేసమందే లగ్నాష్టమేభౌమే
     మాత్రాసహ బాలకస్యమృతిః:

తా) చంద్రుడు రాహు కేతు గ్రస్త మయి శనితో కూడి ఉండి పాపులు 1-8 స్థానములందు వుండిన ఎడల తల్లితోసహా శిశువు మృతి జరుగును.

39. గ్రస్తేర్కేమందజ్ఞాన్యత మయుతేరంధ్రాంగే
     కుజేమాత్రాసహ బాలకస్యమృతిః :
తా) సూర్యుడు రాహుకేతువుల చేత గ్రస్తమై యుండి శని బుధులు కాక ఇతర గ్రహములతో కూడి కుజుడు 1-8 స్థానములనందు వుండిన తల్లితో కూడా శిశువు మరణము పొందును.

40. భౌమభేఅర్కారమందే ఇందుదృష్టేష్టమే
      జ్యేబాలకస్య మహాకష్టం :

తా) సూర్య కుజ శనులు కుజ క్షేత్రమున ఉండి చంద్రుడిచే చూడబడుచూ అష్టమమందు గురువు ఉన్న ఎడల శిశువునకు కష్టము.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: