💥 జనన సూత్రములు💥 51-60
💥 జనన సూత్రములు💥
51) మదాద్రంధ్రేబలినః పాపావాబాలస్యమృతిః
తా) శనికి ఎనిమిదవ స్థానం మందు పాప గ్రహములు బలిష్టంగా వున్న ఎడల బాలునకు సద్యో మరణం.
52) క్షీణేందివంగేకేంద్రాష్టమగాః పాపవా బాలస్య సద్యోమృతిః
తా) క్షీణ చంద్రుడు లగ్నమందుండి పాపగ్రహములు కేంద్రములయందు, అష్టమమందునున్నను బాలునకు మరణము.
53) కర్కాళ్యంగేఖలాః పూర్వార్థేసౌమ్యాః పరార్థే
వాలాగ్నాస్థాష్టాంత్యే సపాపేందౌ శుభాదృష్టే
శుభాయుతేషుకేంద్రేషు బాలస్యసద్యోమృతిః
తా) లగ్న కర్కాట వృశ్చికములందు పాపగ్రహములున్నను, చక్రము యొక్క పూర్వార్ధ మందు గాని పరభాగమందుగాని సౌమ్య గ్రహములు 1, 7, 8, 12 యందు పాపగ్రహములతో కూడిన చంద్రుడు ఉండి
శుభులతో కలిసి గానీ చూడబడక గానీ ఉన్న ఎడల బాలునకు మరణం.
54) త్రికేసౌమ్యాఃకేంద్రకోణేపాపాః
లగ్నేర్కేవాబాలస్యమృతిః
తా) షష్టాష్టమవ్యయ స్థానముల యందు సౌమ్యగ్రహములు కేంద్ర కోణముల యందు పాపగ్రహములు లగ్న మందు సూర్యుడు ఉన్న యెడల బాలునకు సద్యో మరణము.
55) చంద్రపాపయుతేషు సర్వకేంద్రేషు బాలస్యసద్యోమృతిః
తా) అన్ని కేంద్రముల యందును పాప గ్రహములతో కూడిన చంద్రుడు గాని పాపగ్రహములు గాని వున్న ఎడల బాలునకు సద్యో మరణము.
56) లగ్నాస్తగౌపాపౌచంద్రో మిశ్రదృష్టౌ బాలస్యసద్యోమృతిః
తా) పాప గ్రహములు 1, 7 స్థానముల యందు ఉండి చంద్రునితో కూడి గాని, చూడబడి గాని ఉన్న ఎడల బాలునకు సద్యో మరణము.
57) క్షీణేంద్రావంత్యేపాపేషుర్లగ్నాష్టగేషు కేంద్రాంతరగేషుశుభేషు బాలస్యసద్యోమృతిః
తా) వ్యయ స్థానము నందు క్షీణ చంద్రుడు 1, 8 స్థానముల యందు పాపగ్రహములు కేంద్రమధ్య స్థానముల యందు శుభ గ్రహములు వుండిన బాలునకు సద్యో మరణము.
58) పాపాస్తరేచంద్రే రంధ్రాంబుసప్తమగే బాలస్యసద్యోమృతిః
తా) చంద్రుడు పాపగ్రహముల మధ్యనుండి 8, 4, 7 స్థానములందున్న ఎడల బాలునకు సద్యో మరణము.
59) సంధ్యాయాంభాంత్యగాః పాపాఇందు హోరా యాం బాలస్యసద్యోమృతిః
తా) పాపగ్రహములు లగ్న నక్షత్ర సంధుల యందును చంద్ర హోర యందును ఉండిన బాలునకు సద్యో మరణము.
60) రంధ్రాస్తగౌపాపౌ పాపమాత్రదృష్టౌ బాలస్యసద్యోమృతిః
Comments
Post a Comment