🌸 గంగావతరణ కథ 🌸



          🌸    గంగావతరణ కథ 🌸
చదివినవారు విన్నవారు తమపాపాలను పోగొట్టుకోగలుగుతారు.
.               .  🌷🍃🌷🍃🌷

మన వేదాలలోనూ ఇతిహాసాలైన రామాయణం మహాబారతంలోనూ గంగానదికి  గురించి విస్తృతమైన   ప్రస్తావన కనిపిస్తుంది.  

గంగానది-బలిమహారాజు

ఈ భూమండలంపై వివిధకాలాల్లో విష్ణుమూర్తి 10 అవతారాలు (దశావతారాలు) ఎత్తారు.  ప్రతి అవతారంలోనూ ఆయన ఈ భూమిని ఒక కష్టం నుండి లేదా ఒక దుష్టశక్తి నుండి కాపాడాడు. ఆ దశావతారాలలో  ఒక అవతారం వామనావతారం. ఈ అవతారంలో విష్ణుమూర్తి  వామనరూపంలో (మరుగుజ్జు ) బ్రాహ్మణునిగా అగుపిస్తారు.

దానవుడైన బలిచక్రవర్తి, ధనవంతుడు మరియు మహాపరాక్రమశాలి. ఇతని సైన్యంలో పదాతిదళంతో బాటు  గుర్రాలు, ఏనుగులు రథాలు కూడా ఉండేవి. ఇతను గొప్ప విష్ణుభక్తుడైనందున ఎంతో పరాక్రమవంతుడై నాడు, చివరకు స్వర్గాధిపతైన దేవతలకు రాజైన ఇంద్రుడు కూడా ఇతని వల్ల రాజ్యం కోల్పోతానేమోనని బయపడేవాడు.

ఒక రోజు ఇంద్రుడు విష్ణువు దగ్గరకు ఒక సహాయాన్ని ఆశిస్తూవెళ్ళాడు.  బలి చక్రవర్తి కూడా యజ్ఞం నిర్వహించిన పిదుప పధ్ధతి ప్రకారం ఇతర రాజులల్లాగా బ్రాహ్మణునులకు వారు కోరిన కోరికను తీర్చసాగాడు. విష్ణువు ఒక మరుగుజ్జు బ్రాహ్మణుని వేషంలో బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళాడు. బలిచక్రవర్తి విష్ణువుని గుర్తించాడు, దానవుల రాజగురువువైన శుక్రాచార్యుడు కూడా విష్ణువుని గుర్తించి బలిచక్రవర్తిని  హెచ్చరించాడు. బలి తను ఇచ్చిన మాటపై నిలబడి వచ్చిన ఆబ్రాహ్మణుని కోరిక ఏమిటని అడిగాడు?

బ్రాహ్మణునుడు మూడడుగుల భూమిని కోరాడు. అందుకు బలి అంగీకరించి మూడడుగుల స్థలాన్ని కొలుచుకోమన్నాడు,  అంతలోనే ఒక అధ్భుతం జరిగింది. మరుగుజ్జు బ్రాహ్మణునుడు  విపరీతమైన  పరిమాణాన్ని సంతరించుకొని  త్రివిక్రమునిగా  మారుతాడు. ఒక అడుగుతో భూగ్రహాన్ని, రెండవ అడుగు మిగిలిన విశ్వాన్ని ఆక్రమించగా మూడవ అడుగు పెట్టడానికి స్థలంలేక ఎక్కడ ఉంచను అని అడుగుతాడు. బలిచక్రవర్తి ఆ మూడవ అడుగును తన తలపై
 ఉంచమని చెప్పాడు. త్రివిక్రముడు మూడవ అడుగుని బలితలపై ఉంచి అతనిని పాతాళలోకానికి తొక్కివేశాడు.  

త్రివిక్రముని పాదం ఆకాశంలో ఉండగా  బ్రహ్మదేవుడు ఆ పాదాన్ని నీటితోకడిగి ఆ పవిత్రమైన  నీటిని కమండలంలో పట్టాడు.  ఈ నీరే గంగ, బ్రహ్మదేవుని మానస పుత్రిక.

ఇంకొక ఇతిహాసం ప్రకారం గంగ హిమవంతుని కుమార్తె మరియు ఉమాసోదరి. ఇంద్రుడు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి గంగను స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు.

దుర్వాశ ముని శాపం

బ్రహ్మదేవుని ఆలనా పాలనలో గంగ ఆనందంగా పెరగ సాగింది. ఇతిహాసం ప్రకారం ఒక రోజు దుర్వాశమహాముని స్నానమాచరిస్తుండగా వేగంగా వీచినగాలి వలన అంగవస్త్రం ఊడి పోయింది.  అది చూసిన గంగ నవ్వింది.  కోపోద్రిక్తుడైన  దుర్వాశుడు గంగను భూమిపై నదిగా మారి అందులో స్నానంచేసిన వారందరికీ శుధ్ధిని ప్రసాదించమని  శపించాడు.

భువి పైకి గంగా   

సాగర్ అనే రాజు త నపరాక్రమాన్ని నిరూపించుకోవడానికి అశ్వమేధ యాగం నిర్వహించాడు. ఈ యాగాన్ని చూసిన ఇంద్రుడు తనపదవికి ముప్పు వస్తుందేమోనని భావించి ఆయజ్ఞాశ్వాన్ని దొంగలించి కపిలమహర్షి ఆశ్రమంలో కట్టివేశాడు. సాగరుని 60,000 మంది కొడుకులు యాగాశ్వం కోసం వెతుకుతూ దానిని కపిలమహర్షి ఆశ్రమంలో కనుగొన్నారు. వారు ఆ సాధువే యాగాశ్వాన్ని దొంగలించాడని తలచి దానిని విడిపించసాగారు. ఈ క్రమంలో జరిగిన అలజడి వలన కపిల మహర్షి ధ్యానానానికి ఆటంకం కలిగింది.  యాగాశ్వాన్ని తానే దొంగలించానని వారు తలాచారని తెలుసుకొని కోపంతో వారిని భష్మేపటలం చేశారు.

వారంతా  ఉత్తర క్రియలు పూర్తీచేయకనే బూడిదగా మారిపోయారు. కావున దయ్యాలుగా మారిపోయారు. మిగిలిన ఒకే ఒక పుత్రుడు అంశుమాన్ కపిల మహర్షిని వారంతా స్వర్గాన్ని చేరడానికి వీలయ్యే విధంగా  వారి ఉత్తరక్రియలు నిర్వహించడానికి అనువైన ఒక మార్గాన్ని చూపమని వేడుకొన్నాడు. 

గంగను వారి  ప్రవహింపచేస్తే ఉత్తరక్రియలు నిర్వహించినట్లే అని కపిల మహర్షి తెలిపాడు. బ్రహ్మదేవున్ని ప్రార్థించి గంగను తీసుకొని రావచ్చని తెలిపాడు.    

సాగరుని వంశ క్రమంలో చాలా తరాల తరువాత వచ్చిన భగీరథుడు 1000 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ఈ తపస్సుకి మెచ్చి గంగను భువికి తీసుకొని వెళ్లడానికి వరమిచ్చాడు. భువికి వేగంగా వస్తానని దారిలో ఉన్న అన్నిటిని  తనలో కలిపేసుకుంటాననే నిభంధనతో గంగ సంతోషంతో భువికి ఉరికింది.  కానీ గంగ ఉధ్ధేశ్యాన్ని గ్రహించిన శివుడు గంగను జడలుకట్టిన తన శిఖలో బంధించాడు.

భగీరథుని ప్రార్థనకు శివుడు మెచ్చి గంగను తన ఝటాఝూటం నుంచి నిదానంగా వదిలాడు. ఆవిధంగా గంగ భగీరథి అయ్యింది. ఆమె ఆ బూడిదను చేరుకొనే క్రమంలో జాహ్నుముని ఆశ్రమాన్ని ముంచివేసింది. ముని చాలా కోపంగా గంగను మింగివేశాడు. భగీరథుడు తిరిగి మునిని గంగను వదలమని వేడుకొన్నాడు. ఈ విధంగా వచ్చిన గంగను జాహ్నవి అని అన్నారు. గంగా ప్రవాహంలో  ప్రజలు తమ స్నానాలను ఆచరించడం ద్వారా తమపాపాలను పోగొట్టుకోగలిగారు.

దేవతగా గంగ

శాపఫలితంగా లేక ఆపదలో ఉన్న ఒక మనిషి తపస్సు ఫలితంగానో గంగ భువికి వచ్చినా, గంగను అన్నికాలలోనూ ఒక దేవతగానే చూశారు.  ఆమెను నమ్మిన వారికి ఆమె ఎపుడూ ఒక దేవతే. ఒక స్త్రీ వింజామరలు విసురతుండగా  మరొక స్త్రీ తెల్లని గొడుగుని పట్టుకొని ఉండగా, నాలుగు చేతులతో, మూడు కన్నులతో  నిండు ఆభరణములతో, కిరీటపు పై భాగంలో ఒక నెలవంకతో, ఒక చేతిలో తామరతో, మరొక చేతిలో అనంత సంపద గలపెట్టెతో,  సగంమొసలి, సగంచేప ఆకారంతో ఉన్న మకర వాహనాన్ని అలంకరించిన ఆమె రూపం ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. గంగ స్వర్గంలోనూ,  నరకంలోనూ మరియు భూవిపై  ప్రవహిస్తూ ఉందని ఒక నమ్మకం.           

మహాభారతంలో గంగా

కామధేనువు  ఉత్తమమైన గోవు. గోవులందరికీ తల్లి వంటిది. కామధేనువు కోరిన వాటినిచ్చే వరాల తల్లి. యజ్ఞయాగాదులు నిర్వహించేందుకు అవసరమైన అన్నింటిని ప్రసాదించగలదు. అందుకని వశిష్టుడు తన ఆశ్రమంలో పెంచుకొంటాడు.  

ఒక రోజు దేవతలంతా తమ భార్యలతో కలసి వశిష్టమహాముని  ఆశ్రమ సందర్శనకు వచ్చారు. వారిలో అష్టవసువులలో  ఒకరు కామధేనువుని చూసి ముచ్చట పడడంతో కామధేనువుని ఆశ్రమం నుండి దొంగలించారు.  ఈ విషయాన్ని దివ్యదృష్టితో పరికించిన వశిష్టమహాముని ఆగ్రహాన్ని ఆపుకోలేక వారిని భూమిపై మానవులుగా జన్మించమని  శపించాడు.

దేవతలు పాశ్చాతాపంతో మునిని వేడుకోగా కామధేనువు దొంగతనానికి మూలకారమైన 
అష్టవసువులలో  ఒకరైన వాసుని భూమిపై ఎక్కువకాలం  ఎంతో కీర్తితో జీవించేలా శపిస్తాడు. మిగిలిన ఏడుగురు భూమిపై జన్మించిన సంవత్సరం లోపలే తిరిగి స్వర్గానికి చేరుతారని తెలిపారు. దీనికోసం వారు గంగను ఆమె పుత్రులుగా జన్మించే అవకాశాన్ని ఇమ్మని కోరగా గంగ ఇందుకు అంగీకరించింది.

 హస్తినాపురం రాజైన శంతనునికి ఒక రోజు గంగా తీరంలో ఒక అందమైన అమ్మాయి కనిపించింది. అతడు ఆమెను తాను ప్రేమిస్తున్నట్లుగానూ వివాహం చేసుకొంటానని తెలిపాడు. ఆ అందమైన అమ్మాయి తాను గంగ అని శంతనుని వివాహం చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని కాకపోతే ఒక నిబంధనను తెలిపింది. తాను ఏమి చేసినా శంతనుడు ప్రశ్నించకూడదనే షరతుతో ఆమె శాంతననుని వివాహం ఆడింది. వారిద్దరూ ఎంతో సంతోషంతో జీవించసాగారు.  వారికి సంతానం కలిగిన ప్రతిసారి గంగ ఎంతో వింతగా అప్పుడే జన్మించిన పిల్లవాడిని 
 నదిలోకి వేసేది. శంతనుడు ఏడుగురు సంతానాన్ని గంగ నీటిలోకి వేసినా ఏమీ మాట్లాడలేదు. కానీ ఎనిమిదవ సంతానాన్ని గంగ 
నదిలో వేయడానికి అంగీకరించలేదు.

గంగ ఎనిమిదవ సంతానాన్ని కూడా నీటికి సమర్పిస్తుండగా శంతనుడు వారిస్తాడు. ఆమె ఆ సంతానాన్ని శంతనునికి అప్పగించి ఆ ఏడుగురు తనకు జన్మించిన వాసులను వారు గంగద్వారా స్వర్గానికి చేరారని.  తాను కూడా  స్వర్గానికి వెళుతున్నాని వెళుతుంది. శంతనుని ఎనిమిదవ సంతానమే భీష్ముడు.       

భిల్ ఆదిమజాతుల ప్రకారం గంగావతరణ

భీల్స్ అనే ఆదిమజాతి వారు చాలా రాష్ట్రాలలో నివసిస్తున్నప్పటికీ మధ్యభారతదేశం వారి స్వస్థలమని నమ్మకం. గంగావతారణకు సంబంధించి మహభారతంలో ఉన్న వివరణకు భిన్నంగా ఈ తెగలో గంగావతరణ గురించిన ఒక జానపదకథ మౌఖికంగా ఒకతరం నుండి మరొక తరానికి అందజేయబడుతోంది.

ఒక కప్ప గంగా యాత్రకు బయలుదేరింది. మార్గ మధ్యంలో పశువుల మంద కాళ్ళక్రిందపడి చనిపోతుంది. అది ఒక మహిళ కడుపులోకి ప్రవేశించి ఆమెకు కొడుకుగా జన్మిస్తుంది. ఇతను ఇంద్రుని దగ్గర పనిచేసి మంచి పేరుని గడించి అక్కడ నుండి బయటకు వస్తాడు. దీనికి జీతంగా ఒక  బండి నిండా బంగారాన్ని పొందుతాడు.

ఇతను కూడా గంగాయాత్రకు బయలు తేరుతాడు. మార్గమధ్యంలో అతను ప్రయాణిస్తూన్న ఎద్దు చనిపోవడంతో సూర్యుణ్ణి సహాయం కోసం అర్థించాడు. సూర్యుడు సహాయాన్ని అందించి అందుకు ప్రతిఫలంగా బండిలోని సగం బంగారాన్ని అడుగుతాడు. అంగీకారం కుదరడంతో సూర్యుడు ఎద్దుని అందిస్తాడు. గంగానదిలో స్నానం చేసిన తరువాత మొత్తం బంగారాన్ని గంగకు సమర్పిస్తాడు. తిరుగు ప్రయాణంలో సూర్యుడు తనవంతు బంగారాన్ని ఇవ్వాలని ఇతనిని అడుగుతాడు. ఇతను బంగారాన్ని ఇవ్వలేకపోవడంతో సూర్యుడు  ఇతన్ని నక్కగా మారుస్తాడు.

ఈ నక్క గంగానది ఒడ్డున ఉన్న అడవిలో నివసిస్తూ ఉంటుంది. ఒక రోజు అందంగా ఉన్న గంగను చూసి తనను పరిణయమాడ వలసినదిగా కోరుతుంది.  అతని సాహాసాన్ని మెచ్చి గంగ అతనికి తగ్గరౌతుంది.  అతను గంగను మరింతగా హత్తుకోవడంతో ఆమె అతనిపై ఒక చిన్న రాయిని విసురుతుంది. నక్కరూపం పొందిన అతడు బయంతో ఆమెను వెంటాడుతాడు. ఆమె వేగంగా తన గురువు సర్శం కర్ ని  సమీపించి  రక్షణకోసం అతని వెనుకగా నక్కుతుంది.  గురువుని నక్కను బూడిదగా మార్చి దానిని గంగలో కలపమని ఆమెతో చెపుతాడు. ఆమె ఆ పని చేస్తుండగా “బూడిద”  ఆమెతో భర్త ఉత్తరక్రియలు  శ్రధ్దగా  నిర్వహిస్తున్నావని చెపుతుంది.   

గంగ పాతాళానికి తిరిగి వస్తుంది. ఆదే సమయంలో బూడిద సాల్ చెట్టుగా మారి ఆ నీటి దగ్గరగా ఉంటుంది. మరోసారి ఆ చెట్టు గంగను నీవు నా భార్యలా కనిపిస్తున్నావు. నిన్ను కౌగిలించుకోవాలని అనుకొంటున్నాను అని పలుకుతుంది. గంగా కోపంతో ఆ చెట్టుని నీటి బయటకు విసిరివేస్తుంది.

12 సంవత్సరాలపాటు ఆ చెట్టు అక్కడే పడిఉండి ఎండిపోయింది.  గురువు సర్శం కర్ అక్కడికి రావడంతో మొద్దు అంటుకుంది. దీని నుండి శంతనుడు బయటకు వస్తాడు.

శంతనుడు గురువుతో పాటు వెళతాడు. శంతనుడు విల్లంబులు చేతబట్టి విచక్షణా రహితంగా పక్షులను జంతువులను చంపుతుంటాడు. గురువు దానిని వారిస్తాడు. శంతనుడు గంగ తనను పెళ్లాడే దాకా తాను ఇలానే చేస్తుంటాడని  గురువుకి మొండిగా సమాధానం చెపుతాడు. 

గురువు గంగను పిలిపించి శంతనను పెళ్లిచేసుకోవాల్సినదిగా ఆదేశిస్తాడు. వారికి కలిగే సంతానాన్ని  గంగకే సమర్పించాలనే  షరతుతో గంగ దీనికి ఆంగీకారాన్ని తెలియచేస్తుంది. శంతనుడు దీనికి అంగీకరించి ఎన్నో పరీక్షలను కష్టాలను ఎదుర్కొని ఎన్నో జన్మల తరువాత గంగను వివాహమాడుతాడు. వారు మేఘాలలో నివశించడానికి ప్రయాణమయ్యారు. వారికి ముగ్గురు మగపిల్లలు పుడతారు. వారిని శంతనుడు వధిస్తాడు. ఆడపిల్ల పుట్టినపుడు ఆ అమ్మయిని మాత్రం ఒక నమ్మకస్తుడికి అప్పగించి గంగకు అబద్ధం చెపుతాడు. దీనికి ఆమె విచారించి  మూడు తప్పట్లు కొట్టి ముగ్గురు యువరాజులను రప్పిస్తుంది. కానీ యువరాణి రాదు. శంతనుడు అభద్దామాడాడని గంగ అతనిని వదలి వెళుతుంది.  

గంగకు సంబంధించిన కొన్ని విషయాలు  

1.     హిమాలయాల దక్షణ భాగంలోనున్న గంగోత్రి హిమానీనదం, గంగానది జన్మస్థానం.

2.    ప్రపంచంలోనే పెద్దదైన సుందర్బన్ మైదాన ప్రాంతం గంగానది ముఖద్వారం వద్ద ఏర్పడుతున్నది.

3.    గంగానది పై నిర్మించిన ఫరక్కా మరియు హరిద్వార్ ఆనకట్టలు అతి పెద్దదైనవి

4.    గంగానే గంగా నది

5.    బ్రహ్మపుత్రా నదితో కలిసి గంగానది ఏర్పరిచే నదీ వ్యవస్థ ప్రపంచంలోనే అగుపించే మంచినీటి డాల్ఫిన్  gaangesriverdolphin లకు ఆవాసం. ఈ డాల్ఫిన్లకు చూపు ఉండదు.

6.    గంగానది జన్మస్థానం మొదలు సముద్రంలో కలిసే వరకు అన్ని ప్రదేశాలలో మానవ కార్యకలాపాల వలన కాలుష్యం చెందుతోంది.

7.    అంత కాలుష్యం చెందినా ఈ నది ఆమ్లజని శాతాన్ని నిలుపుకోగలుగుతోంది.  ఇది ఈ నది ప్రత్యేకత

8.    ఇప్పటి వరకు గంగానది కాలుష్యనివారణకు చాలా పథకాలు అమలుజరిపారు. కానీ ఏవీ ఫలవంతం కాలేదు.

9.    నదీ పరీవాహ ప్రాంతాలలో కొన్ని స్థాలాలలో ఇది స్నానం చేయడానికి కూడా వీలుకానంత కాలుష్యానికి గురౌతోంది. అయినా ఈ నది ప్రాశస్త్యం దృష్ట్యా ఇప్పటికీ ప్రజలు ఈ ప్రదేశాలలోకూడా  స్నానాలు ఆచరిస్తున్నారు   

10. ఈ నది  జలక్రీడలకు కూడా ప్రసిధ్ధి.

11.  ఉపనదులతో కలిసి ఈ నది బాంగ్లాదేశ్ మరియు మనదేశ వ్యవసాయానికి ఎంతో ఆధారంగా నిలుస్తోంది. 

 



Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: